త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CJP | చ‌ర్చ‌ల కోసం మంత్రులే మా ద‌గ్గ‌ర‌కు రావాలి.. కేంద్రానికి సీజేపీ అల్టిమేటం

CJP | కాక్రోచ్ పార్టీ నిర‌స‌న‌ల్లో (CJP) కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. నిర‌స‌న‌కారులు చ‌ర్చ‌ల‌కు వ‌స్తే మాట్లాడేందుకు మేం సిద్ధంగా ఉన్నామంటూ ప్ర‌భుత్వం చెబుతుండ‌గా.. ప్రభుత్వం చర్చలు జరపాలనుకుంటే జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద‌కే రావాల‌ని సీజేపీ డిమాండ్ చేస్తోంది.

D

National | Published On Jul 22, 2026, 3.53 pm IST

CJP | చ‌ర్చ‌ల కోసం మంత్రులే మా ద‌గ్గ‌ర‌కు రావాలి.. కేంద్రానికి సీజేపీ అల్టిమేటం
Advertisement

CJP | కాక్రోచ్ పార్టీ నిర‌స‌న‌ల్లో (CJP) కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. నిర‌స‌న‌కారులు చ‌ర్చ‌ల‌కు వ‌స్తే మాట్లాడేందుకు మేం సిద్ధంగా ఉన్నామంటూ ప్ర‌భుత్వం చెబుతుండ‌గా.. ప్రభుత్వం చర్చలు జరపాలనుకుంటే జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద‌కే రావాల‌ని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. ప్ర‌భుత్వం త‌మ‌తో చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌నుకుంటే మంత్రులే త‌మ వ‌ద్ద‌కు రావాల‌ని సీజేపీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) స్ప‌ష్టం చేశారు. అంతేకాదు, ప్ర‌భుత్వం త‌మ డిమాండ్ల‌కు క‌ట్టుబ‌డి ఉండాల‌ని తేల్చి చెప్పారు.

"మేము ఎవ‌రి ఇంటికో, ఆఫీస్‌కో వెళ్ల‌డం లేదు. ఇక్క‌డ ఒక జ‌న‌తా ద‌ర్బార్ జ‌రుగుతోంది. కాబ‌ట్టి మంత్రులు మాట్లాడాల‌నుకుంటే వారు నేరుగా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే రావాలి. ఒక‌వేళ భ‌ద్ర‌తాప‌ర‌మైన ఆందోళ‌న‌లేమైనా ఉంటే.. జంత‌ర్ మంత‌ర్ స‌మీపంలో అంద‌రికీ అనుకూల‌మైన ప్రాంతంలో స‌మావేశ‌మ‌య్యేందుకు మేం సిద్ధ‌మే" అని సీజేపీ జాతీయ అధికార ప్ర‌తినిధి అశుతోష్ రంకా (Ashutosh Ranka) స్ప‌ష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌న్నదే తమ ప్ర‌ధాన డిమాండ్ అని అశుతోష్ తెలిపారు. ఈ డిమాండ్ నుంచి వెన‌క్కి త‌గ్గేదే లేద‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read..

జ‌మ్ము క‌శ్మీర్‌లో ఉగ్ర‌దాడి.. కానిస్టేబుల్ మృతి

ఢిల్లీలో హై అల‌ర్ట్‌.. 16 మెట్రో స్టేష‌న్లు క్లోజ్‌.. ఎందుకంటే..?

మాజీ అగ్నివీరుల‌కు 50% రిజ‌ర్వేష‌న్లు.. ఎలాంటి ప‌రీక్ష‌లూ లేకుండానే పారామిలటరీ దళాల్లో చేరొచ్చు

Advertisement
Advertisement