Bank Balance | రూ.1,100 పెన్షన్ కోసం వెళితే.. వృద్ధుడి ఖాతాలో రూ.759 కోట్లు
Bank Balance | వృద్ధాప్య పెన్షన్ (old-age pension) డ్రా చేసుకునేందుకు వెళ్లిన ఓ వృద్ధుడికి ఊహించని అనుభవం ఎదురైంది. అతడి ఖాతాలో ఏకంగా రూ.759 కోట్ల బ్యాలెన్స్ (Bank Balance) ఉన్నట్లు చూపించింది. అతడి కుమారుడి ఖాతాలోనూ ఇంతే మొత్తం చూపించడం గమనార్హం.
Bank Balance | రూ.1,100 వృద్ధాప్య పెన్షన్ (old-age pension) డ్రా చేసుకునేందుకు వెళ్లిన ఓ వృద్ధుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఊహించని విధంగా ఆయన ఖాతాలో (Bank Balance) ఏకంగా రూ.759 కోట్లు ఉండటం ఆశ్చర్యానికి గురి చేసింది. అతడి కుమారుడి ఖాతాలోనూ అంతే మొత్తం నగదు చూపించడం గమనార్హం. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..? బీహార్ (Bihar)లోని ముజఫర్‌పూర్ (Muzaffarpur) జిల్లాకు చెందిన 82 ఏళ్ల కామేశ్వర్ మిశ్రా తనకు వచ్చిన రూ.1,100 వృద్ధాప్య పింఛన్ విత్‌డ్రా చేసుకునేందుకు స్థానికంగా ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ (CSC)కి వెళ్లాడు. డబ్బు విత్ డ్రా చేసుకున్నాకా.. ఖాతాలో బ్యాలెన్స్ చెక్ చేయగా అందులో రూ.759 కోట్లు ఉన్నట్లు చూపించింది. అది చూసి ఆ వృద్ధుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇక అతడి దివ్యాంగుడైన కుమారుడి ఖాతా చెక్ చేయగా.. అందులోనూ ఇంతే మొత్తంలో బ్యాలెన్స్ చూపించింది.
తండ్రీకొడుకుల ఖాతాల్లో కలిపి రూ.1,500 కోట్లకు పైగా బ్యాలెన్స్ కనిపించడంతో ఆపరేటర్‌తో పాటు అక్కడున్నవారంతా కూడా షాక్‌కు గురయ్యారు. తమ ఖాతాల్లోకి ఇంత భారీ మొత్తం డబ్బు ఎలా వచ్చిందో తనకు అర్థం కావడం లేదని మిశ్రా తెలిపాడు. ఈ విషయంపై విచారణ జరపాలని బ్యాంకు, సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశాడు. మరోవైపు వృద్ధుడి ఖాతాలోకి ఇంత భారీ మొత్తంలో బ్యాలెన్స్ రావడానికి గల ఖచ్చితమైన కారణం ఏంటన్నది ఇంకా తెలియరాలేదు. సాంకేతిక, బ్యాంకింగ్ వ్యవస్థ లోపం కారణంగానే ఇలా జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Also Read..
ప్రియాంక గాంధీ ఎక్కడ..? వయనాడ్ దుర్ఘటన నేపథ్యంలో బీజేపీ
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●BC Reservations | ప్రతి కులానికి ‘యూనిక్ కోడ్’ కేటాయించాల్సిందే
- ●Nepal | మూడు రోజులుగా వరద బురదలోనే.. అయినా బతికింది..
- ●Gosula Srinivas Yadav | ఉద్యమకారులను బెదిరిస్తే తగిన బుద్ధి చెబుతాం : గోసుల శ్రీనివాస్ యాదవ్
- ●Uttam Kumar Reddy | ప్రజాస్వామ్యం, సంక్షేమం, అభివృద్ధికి వెయ్యి రోజులు
- ●CV Anand | డీజీపీ సీవీ ఆనంద్ సెంచరీ..
- ●NEET PG | నీట్-పీజీ ఆల్ ఇండియా కోటాను 50 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలి

BC Reservations | ప్రతి కులానికి ‘యూనిక్ కోడ్’ కేటాయించాల్సిందే

Nepal | మూడు రోజులుగా వరద బురదలోనే.. అయినా బతికింది..

Gosula Srinivas Yadav | ఉద్యమకారులను బెదిరిస్తే తగిన బుద్ధి చెబుతాం : గోసుల శ్రీనివాస్ యాదవ్

Uttam Kumar Reddy | ప్రజాస్వామ్యం, సంక్షేమం, అభివృద్ధికి వెయ్యి రోజులు






