Ayushman Card | ఒక్క వాట్సాప్ మెసేజ్‌తోనే ఆయుష్మాన్ కార్డు.. కేంద్ర ప్రభుత్వ కొత్త సౌకర్యం..
Ayushman Card | ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఇప్పటి వరకు సాధారణ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ముఖ్యంగా ఆయుష్మాన్ కార్డు పొందేందుకు కార్యాలయాలకు వెళ్లడం లేదా హెల్ప్‌లైన్‌ను సంప్రదించడం తప్పనిసరిగా ఉండేది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్యక్రమంతో ఇప్పుడు ఈ ప్రక్రియ మరింత సులభమైంది.
Technology | Published On Jul 13, 2026, 12.42 pm IST
Ayushman Card | ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఇప్పటి వరకు సాధారణ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ముఖ్యంగా ఆయుష్మాన్ కార్డు పొందేందుకు కార్యాలయాలకు వెళ్లడం లేదా హెల్ప్‌లైన్‌ను సంప్రదించడం తప్పనిసరిగా ఉండేది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్యక్రమంతో ఇప్పుడు ఈ ప్రక్రియ మరింత సులభమైంది. ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లకుండానే, హెల్ప్‌లైన్‌కు కాల్ చేయకుండానే కేవలం వాట్సాప్ ద్వారానే ఆయుష్మాన్ కార్డు పొందే అవకాశం కల్పించింది. ఈ సేవల కోసం ప్రభుత్వం ఆయుష్మాన్ సారథి పేరుతో ప్రత్యేక వాట్సాప్ చాట్‌బాట్‌ను ప్రారంభించింది. దీని ద్వారా ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై)కి సంబంధించిన ప్రధాన సేవలను రోజులో 24 గంటలూ పొందవచ్చు.
వాట్సాప్ చాట్ బాట్ ద్వారా సేవలు..
ఈ చాట్‌బాట్‌ను నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్‌హెచ్‌ఏ) అభివృద్ధి చేసింది. ఏపీఐ ఆధారిత టూల్ ద్వారా పీఎం-జేఏవై డిజిటల్ వ్యవస్థలతో అనుసంధానం చేసి, భద్రతతోపాటు రియల్‌టైమ్‌లో సేవలు అందించేలా దీనిని రూపొందించారు. వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఆయుష్మాన్ సారథి ద్వారా లబ్ధిదారులు పీఎం-జేఏవై పథకానికి తమ అర్హతను తెలుసుకోవచ్చు. అలాగే ఆయుష్మాన్ కార్డుకు దరఖాస్తు చేయడం, కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడం, ఈ-కేవైసీ పూర్తి చేయడం, ఆధార్‌ను లింక్ చేయడం, పీఎం-జేఏవై కార్డును లాక్ లేదా అన్‌లాక్ చేయడం వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. 70 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధుల కోసం అందించే ఆయుష్మాన్ వయో వందన కార్డుకు సంబంధించిన సేవలను కూడా ఈ చాట్‌బాట్ ద్వారా పొందవచ్చు.
అనేక సేవలు అందుబాటులో..
అంతేకాకుండా వినియోగదారులు తమ వాలెట్ బ్యాలెన్స్, చికిత్స చరిత్రను పరిశీలించవచ్చు. సమీపంలోని ఎంపానెల్డ్ ఆస్పత్రులను గుర్తించవచ్చు. ఫిర్యాదులు నమోదు చేయడం, వాటి పురోగతిని తెలుసుకోవడం లేదా ఉపసంహరించుకోవడం, కాల్‌బ్యాక్ కోరడం, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత అభిప్రాయాన్ని తెలియజేయడం వంటి సదుపాయాలు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఈ చాట్‌బాట్‌ను ప్రారంభించడం ద్వారా వాట్సాప్ వేదికగా పీఎం-జేఏవై సేవలకు తక్షణ ప్రాప్యత, పారదర్శకత, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం, కాల్ సెంటర్లపై ఆధారపడే పరిస్థితిని తగ్గించడంలో ఇది కీలకంగా ఉపయోగపడుతుందని పేర్కొంది. లబ్ధిదారుల అభిప్రాయాల ఆధారంగా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతోపాటు, ఆరోగ్య సేవల పర్యవేక్షణను మెరుగుపరచి, డేటా ఆధారిత పాలనకు కూడా ఇది దోహదపడుతుందని వెల్లడించింది.
ఎలా డౌన్‌లోడ్ చేయాలి..
ముందుగా +91 72908 23838 నంబర్‌ను మొబైల్‌లో సేవ్ చేసుకోవాలి. అనంతరం అదే నంబర్‌కు వాట్సాప్‌లో Hi అని మెసేజ్ పంపాలి. ఆ తర్వాత చాట్‌బాట్ కొన్ని ఎంపికలను చూపిస్తుంది. అందులో Create Ayushman Card ను ఎంచుకోవాలి. తర్వాత మొబైల్ నంబర్, ఆధార్ వివరాలను నమోదు చేయాలి. ఓటీపీ ద్వారా ధ్రువీకరణ పూర్తయిన తర్వాత ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. అనంతరం ఆయుష్మాన్ కార్డు సిద్ధమవుతుంది. దానిని అక్కడి నుంచే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తాజావార్తలు
- ●BC Reservations | ప్రతి కులానికి ‘యూనిక్ కోడ్’ కేటాయించాల్సిందే
- ●Nepal | మూడు రోజులుగా వరద బురదలోనే.. అయినా బతికింది..
- ●Gosula Srinivas Yadav | ఉద్యమకారులను బెదిరిస్తే తగిన బుద్ధి చెబుతాం : గోసుల శ్రీనివాస్ యాదవ్
- ●Uttam Kumar Reddy | ప్రజాస్వామ్యం, సంక్షేమం, అభివృద్ధికి వెయ్యి రోజులు
- ●CV Anand | డీజీపీ సీవీ ఆనంద్ సెంచరీ..
- ●NEET PG | నీట్-పీజీ ఆల్ ఇండియా కోటాను 50 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలి

BC Reservations | ప్రతి కులానికి ‘యూనిక్ కోడ్’ కేటాయించాల్సిందే

Nepal | మూడు రోజులుగా వరద బురదలోనే.. అయినా బతికింది..

Gosula Srinivas Yadav | ఉద్యమకారులను బెదిరిస్తే తగిన బుద్ధి చెబుతాం : గోసుల శ్రీనివాస్ యాదవ్

Uttam Kumar Reddy | ప్రజాస్వామ్యం, సంక్షేమం, అభివృద్ధికి వెయ్యి రోజులు





