త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TVK Vijay | ఉత్కంఠ‌కు తెర‌.. విజ‌య్‌కి వీసీకే మ‌ద్ద‌తు

TVK Vijay | త‌మిళ‌నాడులో ప్ర‌భుత్వ ఏర్పాటు విష‌యంలో నెల‌కొన్న ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. ఎట్ట‌కేల‌కు విజ‌య్‌కి మ‌ద్ద‌తిస్తున్న‌ట్లు విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) పార్టీ ప్ర‌క‌టించింది.

D

National | Published On May 9, 2026, 4.56 pm IST

TVK Vijay | ఉత్కంఠ‌కు తెర‌.. విజ‌య్‌కి వీసీకే మ‌ద్ద‌తు
Advertisement

TVK Vijay | త‌మిళ‌నాడులో ప్ర‌భుత్వ ఏర్పాటు విష‌యంలో నెల‌కొన్న ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. విజ‌య్ ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కేందుకు అడ్డంకులు తొల‌గిపోయాయి. ఎట్ట‌కేల‌కు విజ‌య్‌కి మ‌ద్ద‌తిస్తున్న‌ట్లు విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) పార్టీ ప్ర‌క‌టించింది. రాష్ట్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు త‌మ మ‌ద్ద‌తును తెలియ‌జేస్తూ.. వీకేసీ అధ్య‌క్షుడు తోల్ తిరుమావ‌ళ‌వ‌న్ టీవీకే (TVK) నేత‌ ఆద‌వ్ అర్జున‌ (Aadhav Arjuna)కు లేఖ స‌మ‌ర్పించారు.

కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎంలు ఇప్ప‌టికే తాము మ‌ద్దతునిస్తున్న‌ట్లు లేఖ‌లు స‌మ‌ర్పించ‌గా, ఇండియ‌న్ యూనియ‌న్ ముస్లిం లీగ్ (IUML), విడుద‌లై చిరుతైగ‌ళ్ క‌ట్చి (VCK) లేఖ‌లు ఇవ్వ‌క‌పోవ‌డంతో నేడు జ‌ర‌గాల్సిన విజ‌య్ ప్ర‌మాణ స్వీకారం నిలిచిపోయిన విష‌యం తెలిసిందే. తాజా ప‌రిణామంతో విజ‌య్ సీఎం పీఠం ఎక్కేందుకు నెల‌కొన్న అడ్డంకులు తొల‌గిపోయిన‌ట్లే. వీసీకే మ‌ద్ద‌తుతో విజ‌య్ పార్టీకి 118 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ల‌భించిన‌ట్లైంది.

Also Read..

రూ.10 వేల న‌గ‌దు, 3 రోజులు వేత‌నంతో కూడిన సెల‌వులు.. మ‌ద‌ర్స్‌డే సంద‌ర్భంగా ఉద్యోగుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌

హైద‌రాబాద్‌లో మోదీ ప‌ర్య‌ట‌న‌.. 2 వేల మంది పోలీసుల‌తో భ‌ద్ర‌త‌

పెద్ది ట్రైల‌ర్ లాంఛ్ డేట్ ఫిక్స్ - ఆస్కార్ విన్న‌ర్ లైవ్ ప‌ర్ఫార్మెన్స్ - గ్రాండ్‌గా ఈవెంట్

Advertisement
Advertisement