త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Peddi Trailer | పెద్ది ట్రైల‌ర్ లాంఛ్ డేట్ ఫిక్స్ – ఆస్కార్ విన్న‌ర్ లైవ్ ప‌ర్ఫార్మెన్స్ – గ్రాండ్‌గా ఈవెంట్

రామ్ చ‌ర‌ణ్ పెద్ది మూవీ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్ డేట్‌తో పాటు వేదిక‌ క‌న్ఫామ్ అయిన‌ట్లు స‌మాచారం. మే 16న భోపాల్‌లో గ్రాండ్‌గా ట్రైల‌ర్ రిలీజ్ వేడుక‌ను నిర్వ‌హించ‌బోతున్నార‌ట. ఈ వేడుక‌లో ఆస్కార్ విన్న‌ర్ లైవ్ ప‌ర్ఫార్మెన్స్ ఉండ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు.

N

Entertainment | Published On May 9, 2026, 4.41 pm IST

Peddi Trailer | పెద్ది ట్రైల‌ర్ లాంఛ్ డేట్ ఫిక్స్ – ఆస్కార్ విన్న‌ర్ లైవ్ ప‌ర్ఫార్మెన్స్ – గ్రాండ్‌గా ఈవెంట్
Advertisement

Peddi Trailer | రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పెద్ది మూవీ జూన్ 4న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. రిలీజ్‌కు మ‌రో ఇర‌వై ఐదు రోజులు ఉండ‌గానే పెద్ది ఫీవ‌ర్‌తో తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్‌సీస్ షేక్ అవుతోంది. ఇటీవ‌లే ఓవ‌ర్‌సీస్‌లో పెద్ది అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ జ‌రుగుతోన్నాయి.

ప్ర‌మోష‌న్స్‌

మ‌రోవైపు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు తుది ద‌శ‌కు చేరుకోవ‌డంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్‌పై దృష్టిపెట్టారు. పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో గ్రాండ్ ఈవెంట్స్‌ను ప్లాన్ చేశార‌ట‌. ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్ డేట్‌తో పాటు వేదిక కూడా క‌న్ఫామ్ అయిన‌ట్లు స‌మాచారం. మే 16న‌ భోపాల్‌లో పెద్ది ట్రైల‌ర్ రిలీజ్ వేడుక‌ను నిర్వ‌హించ‌బోతున్నార‌ట‌. ఒకే స్టేజ్‌పై తెలుగు, త‌మిళ‌, హిందీతో పాటు మిగిలిన భాష‌ల ట్రైల‌ర్స్‌ను రిలీజ్ చేయ‌డ‌మే కాకుండా స్క్రీనింగ్ కూడా చేయ‌నున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.

ఆస్కార్ విన్న‌ర్....

ఈ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌కు రామ్‌చ‌ర‌ణ్‌, జాన్వీక‌పూర్‌, శివ‌రాజ్‌కుమార్‌తో పాటు మిగిలిన యాక్ట‌ర్లు, సాంకేతిక నిపుణులు హాజ‌రుకానున్నార‌ట‌. ఈ వేడుక‌లో ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ లైవ్ ప‌ర్ఫార్మెన్స్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిల‌వ‌నుంద‌ని అంటున్నారు. పెద్ది సినిమాలోని పాట‌ల‌ను రెహ‌మాన్ స్టేజ్‌పై లైవ్‌లో ఆల‌పించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. రామ్‌చ‌ర‌ణ్‌, జాన్వీక‌పూర్ కూడా స్టేజ్‌పై ఓ పాట‌కు స్టెప్పులు వేసే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.భోపాల్ తో పాటు ముంబై, బెంగ‌ళూరు, చెన్నైల‌లో స్పెష‌ల్ ఈవెంట్స్‌ను జ‌రుప‌బోతున్న‌ట్లు తెలిసింది.

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌...

స్పోర్స్ యాక్ష‌న్ డ్రామాగా డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానా ఈ సినిమాను తెర‌కెక్కిస్తోన్నారు. మార్చి 27నే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు డిలే కావ‌డంతో ఏప్రిల్ 30కి వాయిదాపడింది. కానీ స్పెష‌ల్ సాంగ్ షూట్ కార‌ణంగా జూన్ 4కు ఈ సినిమాను రెండో సారి పోస్ట్ పోన్ చేశారు. పెద్ది సినిమాకు ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. దాదాపు నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో ఈ మూవీ రూపొందింది.

 

Advertisement
Advertisement