PM Modi | హైదరాబాద్‌లో మోదీ పర్యటన.. 2 వేల మంది పోలీసులతో భద్రత
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మోదీ బిజీబిజీగా గడపనున్నారు. పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
PM Modi | త్రినేత్ర.న్యూస్ : ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మోదీ బిజీబిజీగా గడపనున్నారు. పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. హైటెక్ సిటీలో సింధూ ఆస్పత్రిని ప్రారంభించనున్నారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా పోలీసులు అలర్ట్ ప్రకటించారు. మరి ముఖ్యంగా మోదీ పర్యటించే ప్రాంతాల్లో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వద్దనే 2 వేల మంది పోలీసులు విధుల్లో ఉండనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు.
సభా వేదికతో పాటు ప్రాంగణం, సమీప రోడ్లు, పార్కింగ్ ఏరియాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సభకు వచ్చే వారిని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే సభా ప్రాంగణంలోకి అనుమతించనున్నారు. అనుమానితులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించే ప్రసక్తే లేదని మల్కాజ్‌గిరి సీపీ సుమతి తెలిపారు. సీసీటీవీ కెమెరాలతో నిఘా పర్యవేక్షించనున్నారు. ఆక్టోపస్, ఎన్ఎస్‌జీ బృందాలు, ఇతర ప్రత్యేక పోలీసు బృందాలు కూడా విధుల్లో ఉంటాయని సీపీ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




