Paternity Leave | ప్రభుత్వ ఉద్యోగులకు పితృత్వ సెలవులు.. ప్రభుత్వం కీలక ప్రకటన
Paternity Leave | తమిళనాడు (Tamil Nadu)లోని విజయ్ సర్కార్ (CM Vijay) సంచలన నిర్ణయం తీసుకుంది. పురుష ప్రభుత్వ ఉద్యోగులకు (Male government employees) 15 రోజుల పాటు పితృత్వ (Paternity Leave) సెలవు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రసవ సమయంలో తల్లికి శారీరకంగా, మానసికంగా అండగా నిలవడంతో పాటు, శిశువు సంరక్షణలో తండ్రి తోడ్పాటు ఎంతో అవసరమని పేర్కొంది.
Paternity Leave | త్రినేత్ర న్యూస్ : పురుష ప్రభుత్వ ఉద్యోగులకు (Male government employees) తమిళనాడు (Tamil Nadu)లోని విజయ్ (CM Vijay) సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పురుష ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పాటు పితృత్వ (Paternity Leave) సెలవు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. తమిళనాడు రాష్ట్ర చరిత్రలో పురుష ఉద్యోగులకు ఇలాంటి సదుపాయం కల్పించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. తమిళనాడులో పనిచేస్తున్న పురుష ప్రభుత్వ ఉద్యోగులు 15 రోజుల పాటూ పెటర్నిటీ సెలవును వినియోగించుకోవచ్చని తెలిపింది. ప్రసవానికి 15 రోజుల ముందు లేదా బిడ్డ జన్మించిన ఆరు నెలల లోపు ఎప్పుడైనా ఈ సెలవును తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రసవ సమయంలో భార్యకు అండగా నిలవడంతో పాటు, నవజాత శిశువు సంరక్షణ, కుటుంబ బాధ్యతల్లో తండ్రుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది.
తమిళనాడులో ఇప్పటికే మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు 365 రోజుల మాతృత్వ సెలవులు (Maternity Leave) అమల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెటర్నిటీ సెలవులను ప్రవేశపెట్టాలని కోరుతూ పురుష ఉద్యోగుల నుంచి ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు అందాయి. ఈ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో తల్లికి శారీరకంగా, మానసికంగా అండగా నిలవడంతో పాటు, శిశువు సంరక్షణలో తండ్రి తోడ్పాటు ఎంతో అవసరమని ప్రభుత్వం పేర్కొంది.
Also Read..
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. త్వరలో యాపిల్ ఫస్ట్ రిటైల్ స్టోర్.. ఎక్కడంటే..?
ఇప్పుడు పాలకులే ఓటర్లను నిర్ణయిస్తున్నరు
పెళ్లి తర్వాత సినిమాల్లోకి అమలాపాల్ - తల్లి పాత్రలో మలయాళ బ్యూటీ
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Thiruparankundram | తిరుపరంకుండ్రం కొండపై ఉద్రిక్తత.. దీపస్తంభం వద్ద వెలగని జ్యోతి
నవంబర్ 24, 2026

Madras High Court | మహిళా కలెక్టర్‌కు ఎమ్మెల్యే అసభ్యకర మెసేజ్‌లు.. విజయ్ ప్రభుత్వంపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం
నవంబర్ 24, 2026

Thiruparankundram Hilltop Lamp Ritual | కార్తీక దీపం వేడుకలపై తీవ్ర ఉత్కంఠ.. మదురైలో 144 సెక్షన్ అమలు
నవంబర్ 24, 2026
తాజావార్తలు
- ●Stock Markets | 10 నెలల గరిష్ఠానికి సెన్సెక్స్, నిఫ్టీ.. స్టాక్ మార్కెట్లలో భారీ లాభాలు..
- ●Revanth Reddy | ఇప్పుడు పాలకులే ఓటర్లను నిర్ణయిస్తున్నరు
- ●Harish Rao | సిద్దిపేటపై కాంగ్రెస్ సర్కార్ వివక్ష : మాజీ మంత్రి హరీశ్‌రావు
- ●Google Gemini | గూగుల్ జెమినిలో అద్భుతమైన ఫీచర్.. డిస్కౌంట్లు, డీల్స్ ఎప్పటికప్పుడు చెబుతుంది..
- ●Errolla Srinivas | రేవంత్ పాలనలో అడుగడుగునా కుల వివక్ష : ఎర్రోళ్ల శ్రీనివాస్
- ●Apple Store | హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. త్వరలో యాపిల్ ఫస్ట్ రిటైల్ స్టోర్.. ఎక్కడంటే..?

Stock Markets | 10 నెలల గరిష్ఠానికి సెన్సెక్స్, నిఫ్టీ.. స్టాక్ మార్కెట్లలో భారీ లాభాలు..

Revanth Reddy | ఇప్పుడు పాలకులే ఓటర్లను నిర్ణయిస్తున్నరు

Harish Rao | సిద్దిపేటపై కాంగ్రెస్ సర్కార్ వివక్ష : మాజీ మంత్రి హరీశ్‌రావు

Google Gemini | గూగుల్ జెమినిలో అద్భుతమైన ఫీచర్.. డిస్కౌంట్లు, డీల్స్ ఎప్పటికప్పుడు చెబుతుంది..



