Mothers Day | రూ.10 వేల నగదు, 3 రోజులు వేతనంతో కూడిన సెలవులు.. మదర్స్‌డే సందర్భంగా ఉద్యోగులకు బంపర్ ఆఫర్
Mothers Day | మదర్స్ డే సందర్భంగా ఢిల్లీకి చెందిన ఓ సంస్థ ఉద్యోగులకు "పేరెంటల్ పెర్క్" పేరుతో బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ తల్లిదండ్రులతో టైమ్ స్పెండ్ చేసేందుకు, వారిని విహారయాత్రకు తీసుకెళ్లేందుకు మూడు రోజుల (జీతంతో కూడిన) సెలవుతోపాటూ.. రూ.10 వేలు నగదు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
Mothers Day | కార్పొరేట్ ప్రపంచం అంటేనే లాభనష్టాల లెక్కలు. పని ఒత్తిడి ఎక్కువ. ఉద్యోగుల్లో పనిఒత్తిడిని తగ్గించేందుకు పలు సంస్థలు అనేక చర్యలు తీసుకుంటుంటాయి. ఇందులో భాగంగా పండగల సమయంలో ఉద్యోగులకు కొన్ని సంస్థలు వరాల జల్లు కురపిస్తుంటాయి. బోనస్‌లు, స్వీట్ బాక్సులు వంటివి ఇచ్చి ఉద్యోగులను ఖుషీ చేస్తుంటాయి. ఇంకొన్ని ఓ అడుగు ముందుకేసి ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ఖరీదైన కార్లు, బైక్స్ , ఇల్లు వంటివి గిఫ్ట్‌గా ఇస్తుంటాయి. అయితే, మదర్స్ డే (Mothers Day) సందర్భంగా ఢిల్లీకి చెందిన ఓ సంస్థ ఉద్యోగులకు "పేరెంటల్ పెర్క్" పేరుతో బంపర్ ఆఫర్ ప్రకటించింది.
మదర్స్‌డే సందర్భంగా తమ తల్లిదండ్రులతో టైమ్ స్పెండ్ చేసేందుకు, వారిని విహారయాత్రకు తీసుకెళ్లేందుకు మూడు రోజుల (జీతంతో కూడిన) సెలవుతోపాటూ.. రూ.10 వేలు నగదు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. "తల్లిదండ్రులు మనకోసం ఎంతో చేస్తుంటారు. ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. తమ సమయాన్ని, కలలను, శక్తిని ధారపోస్తుంటారు. అందుకు ప్రతిఫలంగా మన నుంచి వారు ఏమీ ఆశించరు. ఇప్పుడు మనం వారికోసం ఏదో ఒకటి చేసే సమయం వచ్చింది. వారి చిన్నచిన్న కోరికలను తీర్చాలి. వారి కలలు నెరవేరేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది" అంటూ ఎలైట్ మార్క్ అనే పీఆర్ సంస్థ (PR firm Elite Marque) వ్యవస్థాపకుడు, సీఈవో రజత్ గ్రోవర్ (Rajat Grover) సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశారు. సీఈవో ప్రకటన చూసిన నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. "బాస్ ఆఫ్ ది ఇయర్" అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read..
కేసు నమోదు చేయకపోతే.. మోదీ సమక్షంలో ఆత్మహత్య చేసుకుంటాం..!
వినేశ్‌కు భారత రెజ్లింగ్ సమాఖ్య షాక్.. పోటీల్లో పాల్గొనకుండా నిషేధం..!
ముందు మద్దతు కూడగట్టుకోండి.. ఆ తర్వాత గవర్నర్‌ను కలవొచ్చు.. విజయ్‌పై డీఎంకే విమర్శలు
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Nizamabad | నిజామాబాద్ జీజీహెచ్‌కు రిఫరల్ హోదా
- ●Telangana Voter List 2026 | ఓటరు జాబితా ప్రక్షాళన: ఒకే కుటుంబానికి చెందిన సభ్యులకు ఒకే పోలింగ్ బూత్
- ●Noida 15-year-old Girl Case | మోదీపై కామెంట్స్.. క్షమాపణ చెప్పినా ఆగని వేధింపులు: రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసిన తల్లీకూతుళ్లు
- ●Indian Passport Visa-Free Countries 2026 | భారత పాస్‌పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ వెళ్లగలిగే 27 దేశాలు ఇవే!
- ●BRAOU MBA Admission 2026 | అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో ఎంబీఏ చేయాలనుకుంటున్నారా? దరఖాస్తుకు మరో రెండు రోజులే గడువు!
- ●Digitel Service | డిజిటల్ గవర్నెన్స్‌పై ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సీఎస్ చర్చ

Nizamabad | నిజామాబాద్ జీజీహెచ్‌కు రిఫరల్ హోదా

Telangana Voter List 2026 | ఓటరు జాబితా ప్రక్షాళన: ఒకే కుటుంబానికి చెందిన సభ్యులకు ఒకే పోలింగ్ బూత్

Noida 15-year-old Girl Case | మోదీపై కామెంట్స్.. క్షమాపణ చెప్పినా ఆగని వేధింపులు: రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసిన తల్లీకూతుళ్లు

Indian Passport Visa-Free Countries 2026 | భారత పాస్‌పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ వెళ్లగలిగే 27 దేశాలు ఇవే!






