MK Stalin | స్టాలిన్ రీ ఎంట్రీ ఇస్తారా..? బాబు మృతితో అందరి చూపు కొలత్తూరు ఉప ఎన్నికపైనే
MK Stalin | టీవీకే ఎమ్మెల్యే వీ.ఎస్. బాబు (TVK MLA VS Babu) మరణంతో తమిళనాడులోని కొలత్తూరు (Kolathur) ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే (DMK) అధినేత ఎంకే స్టాలిన్ ఈ ఉప ఎన్నిక ద్వారా అసెంబ్లీలోకి రీ ఎంట్రీ ఇస్తారా..? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అటు విజయ్ నేతృత్వంలోని అధికర టీవీకే పార్టీ కూడా కొలత్తూరు స్థానాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తోంది. దీంతో కొలత్తూరు (Kolathur) పోరు ఆసక్తికరంగా మారింది.
MK Stalin | త్రినేత్ర న్యూస్ : మరో రాజకీయ పోరుకు తమిళనాడు సిద్ధమవుతోంది. కొలత్తూరు (Kolathur) అసెంబ్లీ నియోజకవర్గ టీవీకే ఎమ్మెల్యే వీ.ఎస్. బాబు (TVK MLA VS Babu) మరణంతో ఆ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఈ స్థానం నుంచి మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే (DMK) అధినేత ఎంకే స్టాలిన్ ఘోర ఓటమి చవిచూడాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు బాబు మరణంతో స్టాలిన్ (MK Stalin)కు అసెంబ్లీకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం వచ్చింది.
ఈ అంశంపై తమిళనాట తెగ చర్చ జరుగుతోంది. ఉప ఎన్నికలో స్టాలిన్ పోటీ చేయాలని డీఎంకే నేతలు, అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. అయితే, పోటీ విషయం పూర్తిగా స్టాలిన్‌దేనని డీఎంకే ఎంపీ సి. రవీంద్రన్ స్పష్టం చేశారు. స్టాలిన్ ఈ ఉప ఎన్నికలో పోటీ చేయాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు. మరోవైపు ఎన్నికల్లో ఓటమితో తీవ్రంగా నష్టపోయిన పార్టీ రాజకీయంగా పుంజుకోవడానికి ఈ ఉప ఎన్నిక మంచి అవకాశమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 2026 ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయి, స్టాలిన్ స్వయంగా ఓడిపోయిన నేపథ్యంలో ఈ ఉప ఎన్నికలో గెలిచి తిరిగి అసెంబ్లీలో అడుగుపెట్టడం డీఎంకేకు కీలకంగా మారింది. అదే సమయంలో స్టాలిన్ ఇక్కడ పోటీ చేసి ఓడిపోతే పార్టీకి కోలుకోలేని దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
విజయ్‌కి పరీక్షే
అటు ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడం అధికార టీవీకేకి కూడా చాలా అవసరం. 234 స్థానాలున్న అసెంబ్లీలో 108 స్థానాలు గెలుచుకుని.. కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) తన పార్టీకి ప్రతిష్టాత్మకమైన కొలత్తూరు స్థానాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తున్నారు. దీంతో కొలత్తూరు ఉప ఎన్నిక పోరు ఆసక్తికరంగా మారింది. ఈ ఉప ఎన్నికలో ఎంకే స్టాలిన్ తిరిగి పోటీ చేస్తారా..? లేదా..? అలాగే ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని అధికార టీవీకే ఈ స్థానానికి ఎవరిని బరిలోకి దింపుతుంది అనే దానిపై తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
డీఎంకే తన పట్టు నిలుపుకుంటుందా..?
కొలత్తూరు నియోజకవర్గంపై డీఎంకేకి మంచి పట్టుంది. 2011 నుంచి ఎంకే స్టాలిన్ ఇక్కడి నుంచే పోటీ చేసి గెలుపొందుతున్నారు. వరుసగా మూడుసార్లు గెలిచిన ఆయన.. తన పట్టును నిలుపుకున్నారు. 2016లో 51.4 శాతం ఓట్లతో సులభంగా గెలిచిన స్టాలిన్.. 2021లో 1,05,522 ఓట్లు సాధించి ఏఐఏడీఎంకే అభ్యర్థి ఆది రాజారాంపై 70,384 ఓట్ల మెజారిటీతో (61.4 శాతం ఓట్లతో) విజయం సాధించారు. కానీ అనూహ్యంగా ఈ ఏడాది ఎన్నికల్లో వీఎస్ బాబు చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. న్నికల్లో బాబుకు 88,180 ఓట్లు రాగా.. స్టాలిన్‌కు 72,988 ఓట్లు వచ్చాయి.
వీఎస్ బాబు మృతి
ఎంకే స్టాలిన్ (MK Stalin)ను ఓడించి సంచలనం సృష్టించిన టీవీకే నేత, ఎమ్మెల్యే వీఎస్ బాబు గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న వీఎస్ బాబు.. సెప్టెంబర్ 9న చెన్నైలోని MGM హెల్త్‌కేర్ (MGM Healthcare) ఆసుపత్రిలో చేరారు. దాదాపు 70 రోజులకు పైగా ఐసీయూలో చికిత్స పొందిన ఆయన.. గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం టీవీకేలో తీవ్ర విషాదాన్ని నింపింది.
Also Read..
భారత్‌లోనే తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయ్.. ఫెడ్‌పై ట్రంప్ విమర్శలు
1962 నాటి అవమానానికి కాంగ్రెస్ క్షమాపణలు చెబుతుందా..? : రాహుల్‌పై కేంద్ర మంత్రి ఫైర్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
- ●MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
- ●Elderly couple death | వృద్ధాప్య సమస్యలతో భర్త మృతి.. తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య కన్నుమూత
- ●Indus Water | సింధూ జలాల ఒప్పందంపై మా వైఖరి స్పష్టంగా ఉంది : భారత్
- ●Loan Guarantor | లోన్ గ్యారంటర్‌గా సంతకం చేస్తున్నారా? ఈ ప్రమాదాలు తెలుసుకోండి!
- ●BRS Leaders | కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత

IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ

MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

Elderly couple death | వృద్ధాప్య సమస్యలతో భర్త మృతి.. తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య కన్నుమూత

Indus Water | సింధూ జలాల ఒప్పందంపై మా వైఖరి స్పష్టంగా ఉంది : భారత్






