Top ISIS Leader | ఐసిస్‌కు బిగ్ షాక్.. టాప్ కమాండర్ అబు బిలాల్ మినూకీ హతం.. ప్రకటించిన ట్రంప్
Top ISIS Leader | ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌కు (ISIS) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ గ్రూప్ అగ్ర కమాండర్ అబు బిలాల్ మినూకీ హతమయ్యాడు.
Top ISIS Leader | ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌కు (ISIS) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా, నైజీరియా దళాలు (Nigeria Armed Forces) సంయుక్తంగా జరిపిన సాహసోపేత దాడుల్లో ఈ గ్రూప్ అగ్ర కమాండర్ అబు బిలాల్ మినూకీ హతమయ్యాడు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో పోస్టు పెట్టారు.
తన ఆదేశాల మేరకు అమెరికా, నైజీరియా భద్రతా బలగాలు ప్రపంచంలోనే అత్యంత చురుగ్గా ఉన్న ఉగ్రవాదిని యుద్ధరంగం నుంచి తుడిచిపెట్టేశాయని ట్రంప్ వెల్లడించారు. "ఐసిస్ ఉగ్రసంస్థలో రెండో స్థానంలో ఉన్న అబు బిలాల్ అల్ మినూకీ.. ఆఫ్రికాలో దాక్కోవచ్చని అనుకున్నాడు. కానీ మా గూఢచార వర్గాలు అక్కడా ఉన్నాయన్న విషయం అతడికి తెలియదు. ఇకపై అతడు ఆఫ్రికా ప్రజలను భయబ్రాంతులకు గురిచేయలేడు. అంతేకాదు, అమెరికన్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్లాన్ చేయలేడు. అతడి మృతితో ప్రపంచ వ్యాప్తంగా ఐసిస్ కార్యకలాపాలు చాలా వరకూ బలహీనపడతాయి" అంటూ ట్రంప్ తన పోస్టులో రాసుకొచ్చారు. ఈ ఆపరేషన్‌లో తమకు సహకరించిన నైజీరియా ప్రభుత్వానికి ట్రంప్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
Also Read..
గర్ల్‌ఫ్రెండ్‌తో హార్దిక్ పాండ్యా రెండో పెళ్లి.. డేట్ కూడా ఫిక్స్..?
సంబంధిత వార్తలు

Boat Capsizes | నైజీరియాలో నీట మునిగిన పడవ.. 50 మందికిపైగా మృతి.. ఎక్కువ మంది చిన్నారులే..
ఆగస్టు 21, 2026

India US trade | భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం.. 2030 వరకు 500 బిలియన్ల డాలర్లకు..
ఆగస్టు 18, 2026

Strait of Hormuz | హార్ముజ్ జలసంధి మాదే.. ఒమన్ అడ్డువస్తే బాంబులేస్తాం: ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్, బదులిచ్చిన టెహ్రాన్!
ఆగస్టు 18, 2026
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన పసిడి ధర.. బులియన్ మార్కెట్లలో ఉత్సాహం..
- ●Revanth Reddy US Tour | రేవంత్ రెడ్డికి కేంద్రం షాక్.. యూఎస్ పర్యటన రద్దు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో స్వల్ప నష్టాలు.. బ్యాంకింగ్ షేర్ల మద్దతు..
- ●EFLU | ఇఫ్లూలో విద్యార్థి సంఘాల మధ్య గొడవ.. 14 మంది సస్పెండ్.. ఉపసంహరించుకోవాలంటూ విద్యార్థుల ధర్నా
- ●Harvard Medical School | మార్చురీ మేనేజర్ నిర్వాకం.. బ్లాక్మార్కెట్లో మృతదేహాల భాగాల విక్రయం.. 440 కోట్ల పరిహారం..
- ●Boat Capsizes | నైజీరియాలో నీట మునిగిన పడవ.. 50 మందికిపైగా మృతి.. ఎక్కువ మంది చిన్నారులే..

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన పసిడి ధర.. బులియన్ మార్కెట్లలో ఉత్సాహం..

Revanth Reddy US Tour | రేవంత్ రెడ్డికి కేంద్రం షాక్.. యూఎస్ పర్యటన రద్దు

Stock Markets | స్టాక్ మార్కెట్లలో స్వల్ప నష్టాలు.. బ్యాంకింగ్ షేర్ల మద్దతు..

EFLU | ఇఫ్లూలో విద్యార్థి సంఘాల మధ్య గొడవ.. 14 మంది సస్పెండ్.. ఉపసంహరించుకోవాలంటూ విద్యార్థుల ధర్నా



