త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jensen Huang | జెన్స‌న్ హువాంగ్ మళ్లీ సీఈఓ అవ‌డం వెనుక‌.. వైట్ హౌస్ ప్ర‌మేయం..

Jensen Huang | ఎన్విడియా వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్‌ను తిరిగి సీఈఓగా నియమించడంతో కంపెనీ షేర్లు భారీగా పుంజుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాత్రతో బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది. దీంతో ఎన్విడియా మార్కెట్ విలువ మళ్లీ 4 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటింది. ప్రపంచంలో రెండో అత్యంత విలువైన కంపెనీగా తిరిగి తన స్థానాన్ని దక్కించుకుంది.

S

Business | Published On Nov 24, 2026, 10.54 am IST

Jensen Huang | జెన్స‌న్ హువాంగ్ మళ్లీ సీఈఓ అవ‌డం వెనుక‌.. వైట్ హౌస్ ప్ర‌మేయం..
Advertisement

Jensen Huang | ఎన్విడియా వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్‌ను తిరిగి సీఈఓగా నియమించడంతో కంపెనీ షేర్లు భారీగా పుంజుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాత్రతో బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది. దీంతో ఎన్విడియా మార్కెట్ విలువ మళ్లీ 4 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటింది. ప్రపంచంలో రెండో అత్యంత విలువైన కంపెనీగా తిరిగి తన స్థానాన్ని దక్కించుకుంది.

ధ్రువీక‌రించిన ట్రంప్‌..

ప్రముఖ ఏఐ చిప్ తయారీ సంస్థ ఎన్విడియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సంస్థ వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్ అనూహ్యంగా వైదొలిగిన 11 రోజుల తర్వాత, నవంబర్ 23న కంపెనీ బోర్డు ఆయనను తిరిగి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించింది. వ్యాపారవేత్తతో వివాహేతర సంబంధం, ఆమె చైనా గూఢచారి అన్న ఆరోపణల నేపథ్యంలో నవంబర్ 12న హువాంగ్ సీఈఓ పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామాలతో ఎన్విడియా షేర్లు భారీగా పడిపోయాయి. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకుని హువాంగ్‌ను తిరిగి నియమించాలని బోర్డుపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు వెల్లడైంది. ఎన్బీసీకి చెందిన సీబీఎన్‌సీతో మాట్లాడిన ట్రంప్.. ఎన్విడియా నిర్ణయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా పాల్గొన్నారని ధ్రువీకరించారు. హువాంగ్ తిరిగి రావడం అమెరికా జాతీయ భద్రతకు, సాంకేతిక ఆధిపత్యానికి కీలకమని భావించి బోర్డు సభ్యులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా చర్చలు జరిపినట్లు ట్రంప్ వివరించారు. హువాంగ్‌ను తిరిగి తీసుకురావాలన్న తన జోక్యం ఫలించిందని ఆయన పేర్కొన్నారు.

జాతీయ భద్రతకు ముప్పు లేదన్న అమెరికా ప్రభుత్వం..

ఎన్విడియా బోర్డు వరుస చర్చలు, సమావేశాల అనంతరం ఏకగ్రీవంగా హువాంగ్‌ను తిరిగి సీఈఓగా నియమించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ముందు అమెరికా ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికారుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని, హువాంగ్ పునర్నియామకం వల్ల జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని బోర్డు స్పష్టం చేసింది. ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. అమెరికా అటార్నీ జనరల్ ధ్రువీకరణ ప్రకారం, హువాంగ్ ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినట్లు ప్రభుత్వానికి ఆధారాలు లేవని తెలిపారు. ఎన్విడియా విజయానికి మాత్రమే కాకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కూడా హువాంగ్ నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. అదే సమయంలో అమెరికా ఎగుమతి నియంత్రణ నిబంధనలను ఎన్విడియా పూర్తిస్థాయిలో పాటిస్తోందో లేదో అంతర్గత విచారణ కొనసాగించాలని సూచించారు.

Advertisement
Advertisement