Hardik Pandya | గర్ల్‌ఫ్రెండ్‌తో హార్దిక్ పాండ్యా రెండో పెళ్లి.. డేట్ కూడా ఫిక్స్..?
Hardik Pandya | భారత స్టార్ క్రికెటర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) రెండోపెళ్లికి సిద్ధమయ్యారు. గర్ల్‌ఫ్రెండ్ మహీకా శర్మను పెళ్లిచేసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈనెల 22న అతికొద్ది మంది సమక్షంలో వీరు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు సమాచారం.
Hardik Pandya | భారత స్టార్ క్రికెటర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పాండ్యా త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తోంది. గర్ల్‌ఫ్రెండ్ మహీకా శర్మ (Mahika Sharma)ను పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. వీరి పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్సైందట. ఈనెల 22న అతికొద్ది మంది సమక్షంలో వీరు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు సమాచారం. ఉదయ్‌పూర్ (Udaipur)లో వీరి వివాహం జరగనుందని టాక్. అయితే, పెళ్లి వార్తపై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. దీనిపై హార్దిక్-మహీకా నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
అందుకే హడావుడిగా పెళ్లికి రెడీ..?
హార్దిక్ పెళ్లి నిర్ణయం వెనుక పెద్ద కారణమే ఉందట. ఐపీఎల్‌లో డ్రెస్సింగ్ రూమ్‌లోని రహస్యాలు బయటకు లీక్ అవుతుండటంతో.. బీసీసీఐ కఠిన చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఆటగాళ్లు తమ గర్ల్‌ఫ్రెండ్స్‌ను టీమ్ క్యాంప్‌లోకి తీసుకురావొద్దని నిబంధన పెట్టింది. దీంతో ఆమెను విడిచి ఉండలేక హార్దిక్ పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
నటాషాతో విడాకులు ప్రకటించిన అనంతరం పాండ్య బ్రిటీష్ సింగర్ జాస్మిన్ వాలియాతో కొన్నిరోజులు డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇది కొన్నిరోజులకే బ్రేకప్ అవ్వగా.. ఆ తర్వాత మహీకా శర్మతో డేటింగ్ మొదలు పెట్టాడు. ఆమెపై తనకున్న ప్రేమను పలుమార్లు బహిరంగంగా చాటుకున్నాడు కూడా. ఇక ఐపీఎల్‌లో హార్దిక్ పాండ్యా ఆడే ప్రతీ మ్యాచ్‌కు మహీకా హాజరువుతూ వస్తున్నారు. తన బాయ్‌ఫ్రెండ్‌కు గ్యాలరీ నుంచి మద్దతు తెలుపుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.
Also Read..
పార్టీని వీడాలనుకునేవారు స్వేచ్ఛగా వెళ్లిపోవచ్చు : మమతా బెనర్జీ
పుచ్చకాయ తిని తండ్రి మృతి.. కుమారుడి పరిస్థితి విషమం
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. బులియన్ మార్కెట్లలో అనిశ్చితి..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●‘22ఏ’ పంచాయితీ: సెక్రటేరియట్ వర్సెస్ తెలంగాణ భవన్.. భూపోరులో గెలుపెవరిది?
- ●Amazon India | అమెజాన్ ఆసక్తికర సర్వే.. ఫోన్లలో ఏఐ ఫీచర్లను కోరుకుంటున్న యూజర్లు..
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన పసిడి ధర.. బులియన్ మార్కెట్లలో ఉత్సాహం..
- ●Revanth Reddy US Tour | రేవంత్ రెడ్డికి కేంద్రం షాక్.. యూఎస్ పర్యటన రద్దు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో స్వల్ప నష్టాలు.. బ్యాంకింగ్ షేర్ల మద్దతు..
- ●EFLU | ఇఫ్లూలో విద్యార్థి సంఘాల మధ్య గొడవ.. 14 మంది సస్పెండ్.. ఉపసంహరించుకోవాలంటూ విద్యార్థుల ధర్నా

‘22ఏ’ పంచాయితీ: సెక్రటేరియట్ వర్సెస్ తెలంగాణ భవన్.. భూపోరులో గెలుపెవరిది?

Amazon India | అమెజాన్ ఆసక్తికర సర్వే.. ఫోన్లలో ఏఐ ఫీచర్లను కోరుకుంటున్న యూజర్లు..

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన పసిడి ధర.. బులియన్ మార్కెట్లలో ఉత్సాహం..

Revanth Reddy US Tour | రేవంత్ రెడ్డికి కేంద్రం షాక్.. యూఎస్ పర్యటన రద్దు






