Sergey Lavrov | ఢిల్లీ ప్రెస్‌మీట్‌లో జర్నలిస్ట్‌పై రష్యా విదేశాంగ మంత్రి అసహనం.. తుపాకీ తీయాల్సి వస్తుందంటూ హెచ్చరిక
Sergey Lavrov | ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్‌లో ఓ జర్నలిస్ట్‌పై రష్యా విదేశాంగ మంత్రి (Russian Foreign Minister) సెర్గీ లావ్రోవ్ (Sergey Lavrov) అసహనం వ్యక్తం చేశారు. ఫోన్ మాట్లాడటం ఆపకపోతే.. సెక్యూరిటీ సిబ్బంది గన్ తీయాల్సి వస్తుందంటూ తీవ్రస్వరంతో హెచ్చరించారు.
Sergey Lavrov | బ్రిక్స్ సదస్సు (BRICS Summit) కోసం ఢిల్లీ (Delhi) పర్యటనకు వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి (Russian Foreign Minister) సెర్గీ లావ్రోవ్ (Sergey Lavrov) ప్రెస్ బ్రీఫింగ్‌లో ఓ జర్నలిస్ట్‌పై (Journalist) అసహనం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో సదరు జర్నలిస్ట్ పదేపదే డిస్టర్బ్ చేస్తుండటంతో ఆగ్రహానికి గురయ్యారు. మీరు ఇలాగే చేస్తే.. సెక్యూరిటీ సిబ్బంది తుపాకీ తీయాల్సి వస్తుందంటూ తీవ్రంగా హెచ్చరించారు.
ప్రెస్ బ్రీఫింగ్‌లో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు రష్యా మంత్రి సమాధానాలు ఇస్తున్నారు. ఆ సమయంలో ఓ జర్నలిస్ట్ పదే పదే ఫోన్‌లో మాట్లాడుతూ.. సెర్గీ లావ్రోవ్‌కు చిరాకు తెప్పించారు. పలు మార్లు తీవ్ర అంతరాయం కలిగించారు. దీంతో సహనం కోల్పోయిన సెర్గీ.. "మీరు ఇక్కడి నుండి వెళ్తారా..? మీ ఫోన్‌ను పక్కకు పెడతారా..?" అంటూ సదరు జర్నలిస్ట్‌కు తొలిత వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత లావ్రోవ్ తిరిగి మాట్లాడటం ప్రారంభించారు. అయితే, కాసేపటికే సదరు జర్నలిస్ట్ మళ్లీ ఫోన్ మాట్లాడుతూ అంతరాయం కలిగించాడు. ఈసారి రష్యా విదేశాంగ మంత్రి మరింత ఘాటుగా స్పందించారు. "ఫస్ట్ మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్లిపోతారా..? నేను జోక్ చేయడం లేదు. మీరు మీ ఫోన్‌ను సరెండర్ చేయకుంటే.. సెక్యూరిటీ సిబ్బంది గన్ తీయాల్సి వస్తుంది" అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
“Can you please leave? I am not joking. Sir, excuse me. If you don’t surrender your phone, we will take out a gun.”
Russian Foreign Minister Sergey Lavrov after being repeatedly interrupted by a journalist who didn’t put his phone on silent mode during a presser in Delhi today pic.twitter.com/RljH3kxOqb
— Dhairya Maheshwari (@dhairyam14) May 15, 2026
Also Read..
గర్ల్‌ఫ్రెండ్‌తో హార్దిక్ పాండ్యా రెండో పెళ్లి.. డేట్ కూడా ఫిక్స్..?
పార్టీని వీడాలనుకునేవారు స్వేచ్ఛగా వెళ్లిపోవచ్చు : మమతా బెనర్జీ
సంబంధిత వార్తలు

Pak High Commission | దెబ్బకు దెబ్బ.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయం వెలుపల కూల్చివేతలు
ఆగస్టు 20, 2026

CM Revanth Reddy | 20న లండన్‌లో ఎంఐఎం ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి.. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి
ఆగస్టు 18, 2026

e-rickshaw battery blast | ఈ రిక్షా బ్యాటరీ పేలి భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి
ఆగస్టు 17, 2026
తాజావార్తలు
- ●‘22ఏ’ పంచాయితీ: సెక్రటేరియట్ వర్సెస్ తెలంగాణ భవన్.. భూపోరులో గెలుపెవరిది?
- ●Amazon India | అమెజాన్ ఆసక్తికర సర్వే.. ఫోన్లలో ఏఐ ఫీచర్లను కోరుకుంటున్న యూజర్లు..
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన పసిడి ధర.. బులియన్ మార్కెట్లలో ఉత్సాహం..
- ●Revanth Reddy US Tour | రేవంత్ రెడ్డికి కేంద్రం షాక్.. యూఎస్ పర్యటన రద్దు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో స్వల్ప నష్టాలు.. బ్యాంకింగ్ షేర్ల మద్దతు..
- ●EFLU | ఇఫ్లూలో విద్యార్థి సంఘాల మధ్య గొడవ.. 14 మంది సస్పెండ్.. ఉపసంహరించుకోవాలంటూ విద్యార్థుల ధర్నా

‘22ఏ’ పంచాయితీ: సెక్రటేరియట్ వర్సెస్ తెలంగాణ భవన్.. భూపోరులో గెలుపెవరిది?

Amazon India | అమెజాన్ ఆసక్తికర సర్వే.. ఫోన్లలో ఏఐ ఫీచర్లను కోరుకుంటున్న యూజర్లు..

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన పసిడి ధర.. బులియన్ మార్కెట్లలో ఉత్సాహం..

Revanth Reddy US Tour | రేవంత్ రెడ్డికి కేంద్రం షాక్.. యూఎస్ పర్యటన రద్దు



