MLA Devireddy Sudhir Reddy | రాహుల్.. కేసీఆర్ ఉద్యోగం పీకెస్తే రెండు లక్షల ఉద్యోగాలిస్తమన్నవ్.. ఏమైంది?: ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
MLA Devireddy Sudhir Reddy | కేసీఆర్(KCR)ది ఒక్క ఉద్యోగం పీకేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలిస్తమని చెప్పిన కాంగ్రెస్ పెద్దల హామీలు ఏమయ్యాయని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి నిలదీశారు. ఈరోజు వరకు ఒక్క హామీని నెరవేర్చలేదని ఆరోపించారు.
- సెంట్రల్ లైబ్రరీలో ఇచ్చిన మాటేమైంది?
- ప్రియాంకా గాంధీ యూత్ డిక్లరేషన్ ఎటువోయింది?
- రేవంత్ సీఎం అయ్యాక నిరుద్యోగులను మోసం చేస్తుండు
- విసిగి వేసారిపోయి శంకర్ అనే విద్యార్థి టీ పాయింట్ పెట్టుకుండు
- ఈ పాపం ఊరికే పోదు
- కాంగ్రెస్‌పై ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ధ్వజం
MLA Devireddy Sudhir Reddy | త్రినేత్ర.న్యూస్: కేసీఆర్(KCR)ది ఒక్క ఉద్యోగం పీకేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలిస్తమని చెప్పిన కాంగ్రెస్ పెద్దల హామీలు ఏమయ్యాయని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి నిలదీశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో నిరుద్యోగ యువతను రాహుల్ గాంధీ (Rahul Gandhi) కలిసి జాబ్ క్యాలెండర్ (Job Calendar) విడుదల చేస్తామని, విద్యార్థులు, నిరుద్యోగులకు రూ.5 లక్షల వరకు విద్యా భరోసా కార్డు అందిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈరోజు వరకు ఒక్క హామీని నెరవేర్చలేదని ఆరోపించారు.
సెంట్రల్ లైబ్రరీలో నమ్మబలికిన రాహుల్..
నోటిఫికేషన్లు వస్తలేవు, జీవితం గడవాలంటే కష్టమైతుందని, ఉద్యోగం కోసం ఎదురుచూసి విసిగి వేసారిపోయిన శంకర్ అనే విద్యార్థి ‘ఆస్పిరెంట్ టీ పాయింట్’ ను పెట్టుకున్నాడు. తల్లిదండ్రులంతా తమ కొడుకులకు ఉద్యోగాలొస్తయనే ఆశతో అప్పులు చేసి హైదరాబాద్‌కు పంపించారు. కోచింగ్ సెంటర్లలో వేలకు వేలు ఫీజులు కట్టి చదివిస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క నోటిఫికేషన్ కూడా పడలేదు. సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీ పోయిండు. నిరుద్యోగులతో ముచ్చటించిండు. వారికి ఒక భరోసా కల్పించిండు. కాంగ్రెస్ వచ్చిన వెంటనే ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలిస్తమని విద్యార్థులకు నమ్మబలికిండు. దీంతో విద్యార్థులంతా తమ తమ కుటుంబ సభ్యులను ఒప్పించి కాంగ్రెస్‌కు ఓటేయించారు అని సుధీర్‌రెడ్డి గుర్తు చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా రెండు లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పారు. ఈరోజు పదవుల్లోకి ఎక్కి నిరుద్యోగులను నిర్దాక్షిణ్యంగా మరిచిపోయారు. ఈ పాపం ఊరికో పోదు. మిమ్మల్ని వెంటాడుతది. మేం ఉద్యోగాలియ్యం, శంకర్ లాంటి వాళ్లు టీ పాయింట్లు పెట్టుకోండి అని ప్రభుత్వం సంకేతాలిస్తోంది. అమ్మాయిలు ఏదైనా పని చేసుకోండి అని చెబుతున్నట్లు మాకు అనిపిస్తోంది అని ఎమ్మెల్యే దేవిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.
ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి..
అలాగే తెలంగాణలో ఖాళీగా ఉన్న సుమారు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని సరూర్‌నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ను ప్రకటించింది. ఆ హామీలను నమ్మి యువత ఓటేస్తే.. అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల ఊసే లేకుండా నిరుద్యోగ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేసి, ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు.
తాజావార్తలు
- ●‘22ఏ’ పంచాయితీ: సెక్రటేరియట్ వర్సెస్ తెలంగాణ భవన్.. భూపోరులో గెలుపెవరిది?
- ●Amazon India | అమెజాన్ ఆసక్తికర సర్వే.. ఫోన్లలో ఏఐ ఫీచర్లను కోరుకుంటున్న యూజర్లు..
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన పసిడి ధర.. బులియన్ మార్కెట్లలో ఉత్సాహం..
- ●Revanth Reddy US Tour | రేవంత్ రెడ్డికి కేంద్రం షాక్.. యూఎస్ పర్యటన రద్దు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో స్వల్ప నష్టాలు.. బ్యాంకింగ్ షేర్ల మద్దతు..
- ●EFLU | ఇఫ్లూలో విద్యార్థి సంఘాల మధ్య గొడవ.. 14 మంది సస్పెండ్.. ఉపసంహరించుకోవాలంటూ విద్యార్థుల ధర్నా

‘22ఏ’ పంచాయితీ: సెక్రటేరియట్ వర్సెస్ తెలంగాణ భవన్.. భూపోరులో గెలుపెవరిది?

Amazon India | అమెజాన్ ఆసక్తికర సర్వే.. ఫోన్లలో ఏఐ ఫీచర్లను కోరుకుంటున్న యూజర్లు..

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన పసిడి ధర.. బులియన్ మార్కెట్లలో ఉత్సాహం..

Revanth Reddy US Tour | రేవంత్ రెడ్డికి కేంద్రం షాక్.. యూఎస్ పర్యటన రద్దు






