Modi-Trump | మోదీ గ్రేట్ లీడర్.. యుద్ధాలకు దూరంగా ఉంటారు.. ప్రధానిపై ట్రంప్ ప్రశంసల వర్షం
Modi-Trump | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ గ్రేట్ లీడర్, ధైర్యవంతుడు అని కొనియాడారు. ఆయన గత 12 ఏళ్లకు పైగా అత్యంత పటిష్టంగా, స్థిరంగా అధికారంలో కొనసాగుతున్నారన్నారు.
Modi-Trump | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ గ్రేట్ లీడర్, ధైర్యవంతుడు అని కొనియాడారు. భారత్‌ను నడిపించడంలో మోదీ అనుసరిస్తున్న వ్యూహాలు అద్భుతమంటూ కితాబిచ్చారు. గత 12 ఏళ్లకు పైగా ఆయన అత్యంత పటిష్టంగా, స్థిరంగా అధికారంలో కొనసాగుతున్నారని.. ఇది సాధారణ విషయం కాదంటూ చెప్పుకొచ్చారు.
మోదీ, జిన్‌పింగ్ పాత్రలకు నటులు దొరకరు..
అంతర్జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన 'ది యాక్సియోస్ షో' ప్రత్యేక ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మీకు నచ్చిన ఇద్దరు గొప్ప నాయకుల గురించి చెప్పండి అంటూ విలేకరు ప్రశ్నించారు. దీనికి ట్రంప్ ఏమాత్రం తడబడకుండా.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Xi Jinping), భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్లను చెప్పారు."మోదీ, జిన్‌పింగ్ ఇద్దరూ గొప్ప నాయకులు. ఒకవేళ వీరిద్దరి జీవిత చరిత్రల ఆధారంగా ఎవరైనా సినిమా తీయాలని అనుకుంటే.. వారి పాత్రలు పోషించడానికి సరిపోయే హీరో హాలీవుడ్‌లో మొత్తం వెతికినా దొరకరు. నేను ఈ విషయాన్ని కచ్చితంగా చెప్పగలను" అని ట్రంప్ అన్నారు. ఇక తనకు నచ్చిన నాయకుల జాబితాలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్లను కూడా చేర్చారు.
మోదీ చాలా కఠినమైన వ్యక్తి..
ఇక ప్రధాని మోదీ గురించి ట్రంప్ ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ఆయన యుద్ధాలకు చాలా దూరంగా ఉంటారన్నారు. ఇది చాలా స్మార్ట్ నిర్ణయమని ట్రంప్ చెప్పుకొచ్చారు. భారత్ ప్రస్తుతం 150 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా ఉందన్నారు. అంతటి భారీ దేశాన్ని మోదీ అద్భుతంగా నడిపిస్తున్నారని కొనియాడారు. మోదీ ప్రశాంతంగా సుదీర్ఘ పాలనను సాగిస్తున్నారన్నారు. అదే సమయంలో ప్రధాని మోదీ చాలా కఠినమైన వ్యక్తి అని ట్రంప్ పేర్కొన్నారు. తమ దేశ ప్రయోజనాల విషయంలో ఆయన రాజీపడరని.. భారత్ కోసం ఎంతటి కఠినమైన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా వెనుకాడరన్నారు.
అమెరికాను భారత్ దోచుకుంది..
ఈ సందర్భంగా భారత్ గురించి పలు విమర్శలు కూడా చేశారు. గతంలో అమెరికాను భారత్ దోచుకునేదని (టారిఫ్‌లను ఉద్దేశించి) ఆరోపించారు. కానీ ఇప్పుడు తాము భారత్‌తో చాలా వ్యాపారం చేస్తున్నామన్నారు.
మోదీ వచ్చాక భారత్‌లో రాజకీయ పరిస్థితి మారిపోయింది..
అదే సమయంలో భారత్‌లో రాజకీయ పరిస్థితులను కూడా ట్రంప్ ప్రస్తావించారు. "నేను గత కొన్నేళ్లుగా భారత్‌ను గమనిస్తూ వస్తున్నాను. గతంలో అక్కడ ప్రభుత్వాలు చాలా వేగంగా మారిపోయేవి. ఎవరో ఒకరు ఆరు నెలలు లేదా ఏడాది పాటూ ప్రధానిగా ఉండేవారు. ఆ తర్వాత దిగిపోయేవారు. కానీ, ప్రధానమంత్రి మోదీ వచ్చాక ఆ పరిస్థితి మారిపోయింది. ఆయన గత 12 ఏళ్లకు పైగా అత్యంత పటిష్టంగా, స్థిరంగా అధికారంలో కొనసాగుతున్నారు. మోదీ ప్రశాంతంగా సుదీర్ఘ పాలనను సాగిస్తున్నారన్నారు. ఇది సామాన్యమైన విషయం కాదు" అని ట్రంప్ చెప్పుకొచ్చారు.
Also Read..
పిల్లల భవిష్యతుత్తో జూదం ఆడటం ఆపండి.. కేంద్రంపై రాహుల్ ఫైర్
అమెరికా అధ్యక్షుడికి కొత్త ఎయిర్‌ఫోర్స్ వన్.. రూ.3 వేల కోట్ల జెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన ఖతార్
ఆ మాట నేనేదో జోక్‌గా అంటే.. ప్రపంచమంతా పాకింది.. బాస్ వ్యాఖ్యలపై ట్రంప్ వివరణ
సంబంధిత వార్తలు

Air Force One | అమెరికా అధ్యక్షుడికి కొత్త ఎయిర్‌ఫోర్స్ వన్.. రూ.3 వేల కోట్ల జెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన ఖతార్
జూన్ 20, 2026

Donald Trump | ఆ మాట నేనేదో జోక్‌గా అంటే.. ప్రపంచమంతా పాకింది.. బాస్ వ్యాఖ్యలపై ట్రంప్ వివరణ
జూన్ 20, 2026

N Ramchander Rao | ప్రపంచానికి భారత్ అందించిన నాగరికతా బహుమతి యోగా: రామచందర్ రావు
జూన్ 20, 2026
తాజావార్తలు
- ●Leopard Attack IIT Bombay | ఐఐటీ బాంబే క్యాంపస్‌లోకి అర్ధరాత్రి ప్రవేశించిన చిరుత.. వీధి కుక్కను దారుణంగా వేటాడి.. VIDEO
- ●Premium Power Banks | బ్యాటరీ టెన్షన్‌కు చెక్.. బెస్ట్ ప్రీమియం పవర్ బ్యాంక్స్ ఇవే!
- ●massive protest | రాముడిని అవమానించారని కదం తొక్కిన హిందూ సమాజం.. జై శ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లిన ఢాకా
- ●Samantha vs Rashmika Mandanna | మా ఇంటి బంగారం వర్సెస్ కాక్ టెయిల్ 2 - కలెక్షన్స్‌లో సమంతను బీట్ చేసిన రష్మిక బాలీవుడ్ మూవీ
- ●Freelancers | ఫ్రీలాన్సర్లకు కీలక సమాచారం.. ఏ ఐటీఆర్ ఫామ్‌ను దాఖలు చేయాలి..?
- ●Bandi Bhagirath Bail | పోక్సో కేసు.. బండి భగీరథ్‌కు బెయిల్

Leopard Attack IIT Bombay | ఐఐటీ బాంబే క్యాంపస్‌లోకి అర్ధరాత్రి ప్రవేశించిన చిరుత.. వీధి కుక్కను దారుణంగా వేటాడి.. VIDEO

Premium Power Banks | బ్యాటరీ టెన్షన్‌కు చెక్.. బెస్ట్ ప్రీమియం పవర్ బ్యాంక్స్ ఇవే!

massive protest | రాముడిని అవమానించారని కదం తొక్కిన హిందూ సమాజం.. జై శ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లిన ఢాకా

Samantha vs Rashmika Mandanna | మా ఇంటి బంగారం వర్సెస్ కాక్ టెయిల్ 2 - కలెక్షన్స్‌లో సమంతను బీట్ చేసిన రష్మిక బాలీవుడ్ మూవీ



