త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Air Force One | అమెరికా అధ్య‌క్షుడికి కొత్త ఎయిర్‌ఫోర్స్ వ‌న్‌.. రూ.3 వేల కోట్ల జెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన ఖ‌తార్‌

Air Force One | అమెరికా అధ్య‌క్షుడు పాత ఎయిర్‌ఫోర్స్ వ‌న్ (Air Force One)కు గుడ్‌బై చెప్పేశారు. దాని స్థానంలో ఖ‌తార్ (Qatar) బ‌హూక‌రించిన విలాసవంతమైన బోయింగ్ 747-8ఐ విమానాన్ని వాడ‌నున్నారు.

D

International | Published On Jun 20, 2026, 12.41 pm IST

Air Force One | అమెరికా అధ్య‌క్షుడికి కొత్త ఎయిర్‌ఫోర్స్ వ‌న్‌.. రూ.3 వేల కోట్ల జెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన ఖ‌తార్‌
Advertisement

Air Force One | అమెరికా అధ్య‌క్షుడు పాత ఎయిర్‌ఫోర్స్ వ‌న్ (Air Force One)కు గుడ్‌బై చెప్పేశారు. దాని స్థానంలో ఖ‌తార్ (Qatar) బ‌హూక‌రించిన విలాసవంతమైన బోయింగ్ 747-8ఐ విమానాన్ని వాడ‌నున్నారు. ఈ విమానాన్ని అధ్య‌క్షుడు ట్రంప్ (Donald Trump) తాజాగా ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేశారు. మేరీల్యాండ్ (Maryland)లో ఉన్న జాయింట్ బేస్ ఆండ్రూస్ (Joint Base Andrews)లో న్యూ ఎయిర్‌ఫోర్స్ వ‌న్‌ను ట్రంప్‌ ఆవిష్క‌రించారు. ఇక గత 40 ఏళ్లుగా ఉన్న పాత బేబీ బ్లూ రంగును మార్చి.. అమెరికా జాతీయ పతాకం రంగులైన ఎరుపు, తెలుపు, నేవీ బ్లూ లైన్లతో దీనిని అందంగా తీర్చిదిద్దారు. ఇక‌పై ఈ విమానంలోనే అధ్య‌క్షుడు ప్ర‌యాణించ‌నున్నారు.

ఎగిరే వైట్‌హౌస్‌..

ఈ సంద‌ర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ముందుగా ఖ‌తార్ పాల‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ న్యూ ఎయిర్‌ఫోర్స్ వ‌న్‌ను ఎగిరే వైట్‌హౌస్‌గా అభివ‌ర్ణించారు. ఇది ప్ర‌పంచంలోనే అత్యంత విలాస‌వంత‌మైన‌ద‌ని చెప్పారు. వ‌చ్చే నెల‌లో ట‌ర్కీలోని అంకారాలో జ‌ర‌గ‌నున్న నాటో (NATO) సదస్సుకు తాను ఈ కొత్త జెట్‌లోనే వెళ్ల‌నున్న‌ట్లు ట్రంప్ ఈ సంద‌ర్భంగా తెలిపారు. అంతేకాదు, ఫ్రాన్స్‌లో జ‌రిగిన జీ7 (G7) సదస్సు ముగించుకుని అమెరికాకు తిరిగి రావడమే పాత ఎయిర్ ఫోర్స్ వ‌న్ విమానంలో తన చివరి ప్రయాణమని చెప్పారు.

పాత‌దానికంటే.. చాలా పెద్ద‌ది..

బోయింగ్ సంస్థ నుంచి ఆర్డ‌ర్ చేసిన కొత్త ప్రెసిడెన్షియ‌ల్ జెట్‌లు వ‌చ్చేంత వ‌ర‌కూ కొత్త ఎయిర్‌ఫోర్స్ వ‌న్‌నే తాను ఉప‌యోగించ‌నున్న‌ట్లు అధ్య‌క్షుడు ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు. కొత్త బోయింగ్ విమానాలు 2028లో డెలివ‌రీ అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు చెప్పారు. ఇక కొత్త విమానాన్ని ముందెన్న‌డూ ఎవ‌రూ చూడ‌ని స్థాయి విలాస‌వంత‌మైన ఫ్ల‌యింగ్ వైట్ హౌస్‌గా మార్చిన‌ట్లు ట్రంప్ తెలిపారు. ఈ విమానం పాత దానికంటే దాదాపు రెట్టింపు ప‌రిమాణంలో ఉంటుంద‌న్నారు. పాత ఎయిర్‌ఫోర్స్ వ‌న్ కంటే వేగంగా, ఎక్కువ దూరం ప్ర‌యాణిస్తుంద‌ని చెప్పారు. 250వ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా జూలై 4వ తేదీన జ‌రిగే సంబ‌రాల్లో కొత్త ఎయిర్ ఫోర్స్ వ‌న్ విమానం ఫ్లైఓవ‌ర్ నిర్వ‌హిస్తుంద‌ని ట్రంప్ తెలిపారు. ఖ‌తార్ బ‌హుమ‌తిగా అందించిన విలాస‌వంత‌మైన ఈ జెట్ ఖ‌రీదు 400 మిలియ‌న్ల డాల‌ర్లు ఉంటుంద‌ని అంచ‌నా అంటే.. భార‌త క‌రెన్సీలో దాదాపు రూ. 3,300 కోట్లకు పైమాటే.

ట్రంప్ నిర్ణ‌యంపై గ‌తంలో విమ‌ర్శ‌లు..

కాగా, గ‌తేడాది మేలో ట్రంప్ మ‌ధ్య‌ప్రాచ్యంలో ప‌ర్య‌టించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ట్రంప్‌కు ఖ‌తార్ పాల‌క కుటుంబం విలాస‌వంత‌మైన 747-8 జంబో జెట్ (Boeing 747-8i) విమానాన్ని బహుమతిగా ప్రకటించింది. అధ్య‌క్షుడు కూడా ఆ బ‌హుమ‌తిని ఆనందంగా స్వీక‌రించారు. అయితే దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ట్రంప్‌ ఈ ఖరీదైన బహుమతిని స్వీకరించడంతోపాటు దాన్ని ఎయిర్‌ఫోర్స్‌ వన్‌గా వినియోగించాలనుకోవడం జాతీయ భద్రతాపరమైన ప్రశ్నలను లేవనెత్తుతుందని పలువురు డెమోక్రాట్‌లు విమర్శించారు.

వ‌ద్ద‌న‌డం మూర్ఖత్వ‌మే అవుతుంది..

అయితే, త‌న‌పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌న్నింటికీ ట్రంప్ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. కోట్ల రూపాయల ఖరీదు చేసే విమానాన్ని ఉచితంగా ఇస్తానంటే వద్దని చెప్పడం మూర్ఖత్వం అవుతుందన్నారు. ఖరీదైన విమానాన్ని గిఫ్టుగా అందుకోవడం అనేది గొప్ప విషయంగా అభివర్ణించారు. వారు ఫ్రీగా జెట్‌ విమానం ఇస్తుంటే లేదు లేదు. నాకు ఫ్రీగా వద్దు. మీకు 1 బిలియన్‌ డాలర్లు లేదా 400 మిలియన్‌ డాలర్లు ఖరీదు కట్టిస్తా అని చెప్పాలా..? అని అప్ప‌ట్లో ట్రంప్‌ ప్రశ్నించారు.

 

Also Read..

ఆ మాట నేనేదో జోక్‌గా అంటే.. ప్ర‌పంచ‌మంతా పాకింది.. బాస్ వ్యాఖ్య‌ల‌పై ట్రంప్ వివ‌ర‌ణ‌

నోరు మూస్తారా.. యూఎన్ ప్ర‌తినిధిపై ఇజ్రాయెల్ రాయ‌బారి ఫైర్‌

రేపే నీట్ రీ ఎగ్జామ్‌.. నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబిలో సెంట‌ర్‌.. ఎన్‌టీఏ ఏమ‌న్న‌దంటే..?

Advertisement
Advertisement