PM Modi | నారీ శక్తికి ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నాం.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీ
PM Modi | మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు (womens reservation) కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పష్టం చేశారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచకుండా ఏ శక్తీ ఆపలేదని వ్యాఖ్యానించారు.
PM Modi | త్రినేత్ర న్యూస్ : పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు (womens reservation) కల్పించేందుకు తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) శనివారం స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల అమలులో ఎదురయ్యే ప్రతి అడ్డంకిని తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు.
"మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు మేము కట్టుబడి ఉన్నాము. మహిళల రాజకీయ ప్రాతినిధ్యం కోసం దశాబ్దాలుగా పోరాటం కొనసాగుతోంది. ఆ పోరాటంలో భాగమైన వారిలో నేను కూడా ఒకడిని. దేశవ్యాప్తంగా ఎంతో మంది మహిళలు ఈ అంశాన్ని వ్యక్తిగతంగా నా దృష్టికి తెచ్చారు. లెక్కలేనన్ని ఉత్తరాలు రాసి తమ ఆకాంక్షలను పంచుకున్నారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచకుండా ఏ శక్తీ ఆపలేదు. నారీ శక్తి (Nari Shakti)కి ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు మేము కట్టుబడి ఉన్నాం" అని ప్రధాని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) బిల్లు, మహిళా బిల్లును ఈనెల 30న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రధాని ఈ పోస్టు చేశారు.
Also Read..
బిస్లరీ నీటిలో కోలిఫామ్ బ్యాక్టీరియా.. ప్రాసిక్యూషన్‌కు FSSAI అనుమతి
మురుగన్‌దే విజయం.. దీపం వివాదం వేళ ప్రధాని ఆసక్తికర పోస్ట్
మోదీ సర్కార్‌కు బూస్ట్.. డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు.. యూటర్న్ వెనుక అసలు కారణమిదే..!
తాజావార్తలు
- ●Self Employed Indians | పింఛన్, ఈపీఎఫ్ లేవు.. రిటైర్మెంట్ ఆదాయం ఎలా పొందాలి?
- ●Ramchandar Rao | పూలే దంపతుల స్ఫూర్తితో మహిళలకు 33 శాతం సీట్లు ఇస్తం
- ●Bisleri water | బిస్లరీ నీటిలో కోలిఫామ్ బ్యాక్టీరియా.. ప్రాసిక్యూషన్‌కు FSSAI అనుమతి
- ●Ethics Committee Meeting | ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం
- ●Mahesh Goud | డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం: మహేశ్ గౌడ్
- ●PM Modi | మురుగన్‌దే విజయం.. దీపం వివాదం వేళ ప్రధాని ఆసక్తికర పోస్ట్

Self Employed Indians | పింఛన్, ఈపీఎఫ్ లేవు.. రిటైర్మెంట్ ఆదాయం ఎలా పొందాలి?

Ramchandar Rao | పూలే దంపతుల స్ఫూర్తితో మహిళలకు 33 శాతం సీట్లు ఇస్తం

Bisleri water | బిస్లరీ నీటిలో కోలిఫామ్ బ్యాక్టీరియా.. ప్రాసిక్యూషన్‌కు FSSAI అనుమతి

Ethics Committee Meeting | ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం






