త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Donald Trump | ఆ మాట నేనేదో జోక్‌గా అంటే.. ప్ర‌పంచ‌మంతా పాకింది.. బాస్ వ్యాఖ్య‌ల‌పై ట్రంప్ వివ‌ర‌ణ‌

Donald Trump | జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు (G7 Summit)లో 'నేనే బాస్' (Im the boss) అంటూ చేసిన వ్యాఖ్య‌ల‌పై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా వివ‌ర‌ణ ఇచ్చారు. ఆ వ్యాఖ్యలను తాను కేవలం ఫ‌న్నీగా అన్నాన‌ని చెప్పుకొచ్చారు. వాటిని సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

D

International | Published On Jun 20, 2026, 11.55 am IST

Donald Trump | ఆ మాట నేనేదో జోక్‌గా అంటే.. ప్ర‌పంచ‌మంతా పాకింది.. బాస్ వ్యాఖ్య‌ల‌పై ట్రంప్ వివ‌ర‌ణ‌
Advertisement

Donald Trump | జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సులో 'నేనే బాస్' (Im the boss) అంటూ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌న బాస్ వ్యాఖ్య‌ల‌పై ట్రంప్ తాజాగా వివ‌ర‌ణ ఇచ్చారు. ఆ వ్యాఖ్యలను తాను కేవలం సరదాగా మాత్రమే అన్నానని, ఆధిపత్యం ప్రదర్శించడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.

ఈ మేర‌కు ది యాక్సియోస్ షో ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ట్రంప్‌ను బాస్ వ్యాఖ్య‌ల‌పై విలేక‌రు ప్ర‌శ్నించారు. మీ మాట‌ల‌ను అక్క‌డ ఎంత మంది న‌మ్ముతారు..? అని ప్ర‌శ్నించారు. దీనికి అధ్యక్షుడు స‌మాధాన‌మిస్తూ.. అక్క‌డున్న వారంతా న‌మ్ముతార‌ని తెలిపారు. అయితే, ఆ వ్యాఖ్య‌లు తాను కేవ‌లం స‌ర‌దాగా మాత్ర‌మే అన్నాన‌ని చెప్పుకొచ్చారు. "అస‌లు అక్క‌డ ఏం జ‌రిగిందంటే.. ప్రపంచ దేశాల నాయకులు అప్ప‌టికే అక్క‌డ కూర్చొని ఉన్నారు. అప్పుడు నేను లోప‌లికి వెళ్లాను. వారిని చూసి సరదాగా 'నేనే బాస్' అన్నాను. అది కేవ‌లం స‌ర‌దాగా అన్న మాట‌. నిజంగా బాస్ అనిపించుకోవాల‌ని కాదు. దానిని సీరియ‌స్‌గా తీసుకోవ‌ల్సిన అవ‌స‌రం కూడా లేదు. కానీ, అది ప్ర‌పంచ‌మంతా పాకింది. నాకే నమ్మశక్యంగా లేదు" అని ట్రంప్ తెలిపారు. ఇటీవలే తన 80వ పుట్టినరోజు వేడుకలు ముగిసిన వెంటనే ట్రంప్ ఫ్రాన్స్‌లో జ‌రిగిన‌ జీ7 సదస్సుకు హాజరైన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ప్ర‌పంచ నేత‌ల‌తో ట్రంప్ భేటీ అయి ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు.

Also Read..

నోరు మూస్తారా.. యూఎన్ ప్ర‌తినిధిపై ఇజ్రాయెల్ రాయ‌బారి ఫైర్‌

రూ.40వేల లోపు ల‌భిస్తున్న‌ బెస్ట్ బ‌డ్జెట్ ల్యాప్‌టాప్‌లు ఇవే.. స్టూడెంట్స్, ఉద్యోగులకు టాప్ ఛాయిస్‌..

రేపే నీట్ రీ ఎగ్జామ్‌.. నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబిలో సెంట‌ర్‌.. ఎన్‌టీఏ ఏమ‌న్న‌దంటే..?

Advertisement
Advertisement