Akhilesh Yadav | బీజేపీకి దేశం కంటే ఎన్నికలే ముఖ్యం : అఖిలేష్ యాదవ్
Akhilesh Yadav | బీజేపీకి దేశం కంటే ఎన్నికలే ముఖ్యమని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) విమర్శించారు. అంతర్జాతీయ సరిహద్దుల భద్రతపై దృష్టి పెట్టకుండా కేవలం లోక్‌సభ నియోజకవర్గాల సరిహద్దులను మార్చడంపైనే ఆసక్తి చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Akhilesh Yadav | త్రినేత్ర న్యూస్ : కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) బిల్లు, మహిళా బిల్లును ఈనెల 30న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొన్ని ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తుండగా.. కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ వంటి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.
డీలిమిటేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టే అంశంపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీకి దేశం కంటే ఎన్నికలే ముఖ్యమని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ సరిహద్దుల భద్రతపై దృష్టి పెట్టకుండా కేవలం లోక్‌సభ నియోజకవర్గాల సరిహద్దులను మార్చడంపైనే ఆసక్తి చూపుతోందని విమర్శించారు. "బీజేపీకి ఎన్నికలే ముఖ్యం తప్ప దేశం కాదు. అందుకే వారు దేశ సరిహద్దుల గురించి కాకుండా లోక్‌సభ నియోజకవర్గాల సరిహద్దుల గురించి ఆందోళన చెందుతున్నారు" అని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ డీలిమిటేషన్ ప్రక్రియ బీజేపీ రాజకీయ జీవితంలో అతిపెద్ద తప్పుగా నిలిచిపోతుందని అఖిలేష్ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. గతంలో పెద్దనోట్ల రద్దు వంటి నిర్ణయాల వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని చెప్పారు. అవినీతి, ద్రవ్యోల్బణం మరింత పెరిగాయని ఆయన ఆరోపించారు.
Also Read..
స్టాలిన్‌కు ఆర్ఎస్ఎస్ యూనిఫాం వేసిన టీవీకే.. డీలిమిటేషన్‌కు మద్దతుపై భగ్గుమన్న విజయ్ పార్టీ
పహల్గామ్ ఉగ్రదాడి కథతో సినిమా - ఆయోధ్యలో అర్జున్ దేశభక్తి మూవీ లాంఛ్
నిరుద్యోగ మహిళలకు గుడ్‌న్యూస్.. కేజీబీవీల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

MK Stalin | స్టాలిన్‌కు ఆర్ఎస్ఎస్ యూనిఫాం వేసిన టీవీకే.. డీలిమిటేషన్‌కు మద్దతుపై భగ్గుమన్న విజయ్ పార్టీ
నవంబర్ 28, 2026

Devi Prasad | డీలిమిటేషన్ బిల్లుకు వాళ్లెందుకు మద్దతిస్తున్నారో అద్దంకి చెప్పాలి
నవంబర్ 28, 2026

Mallikarjun Kharge | ఆ బిల్లు ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం : ఖర్గే
నవంబర్ 28, 2026
తాజావార్తలు
- ●India Exports | ఎగుమతుల్లో భారత్ సరికొత్త రికార్డు.. 45 శాతం వృద్ధి..
- ●Padmavathi Ammavari Brahmotsavams | డిసెంబర్లో తిరుమల వెళ్తున్నారా..? తిరుచానూరులో జరిగే ఉత్సవాల గురించి తెలుసా?
- ●MK Stalin | స్టాలిన్‌కు ఆర్ఎస్ఎస్ యూనిఫాం వేసిన టీవీకే.. డీలిమిటేషన్‌కు మద్దతుపై భగ్గుమన్న విజయ్ పార్టీ
- ●Musi Riverfront Development Project | మూసీ ప్రాజెక్టు: హరిత ప్రాంతాలు సగానికి తగ్గింపు.. రహదారులు 261 శాతం పెంపు!
- ●Idupu Kayitham | ఇడుపుకాయితం సీరియస్ సినిమా కాదు - ఆ గ్యారెంటీ మాది - నిర్మాత కామెంట్స్
- ●Devi Prasad | డీలిమిటేషన్ బిల్లుకు వాళ్లెందుకు మద్దతిస్తున్నారో అద్దంకి చెప్పాలి

India Exports | ఎగుమతుల్లో భారత్ సరికొత్త రికార్డు.. 45 శాతం వృద్ధి..

Padmavathi Ammavari Brahmotsavams | డిసెంబర్లో తిరుమల వెళ్తున్నారా..? తిరుచానూరులో జరిగే ఉత్సవాల గురించి తెలుసా?

MK Stalin | స్టాలిన్‌కు ఆర్ఎస్ఎస్ యూనిఫాం వేసిన టీవీకే.. డీలిమిటేషన్‌కు మద్దతుపై భగ్గుమన్న విజయ్ పార్టీ

Musi Riverfront Development Project | మూసీ ప్రాజెక్టు: హరిత ప్రాంతాలు సగానికి తగ్గింపు.. రహదారులు 261 శాతం పెంపు!



