Rahul Gandhi | పిల్లల భవిష్యతుత్తో జూదం ఆడటం ఆపండి.. కేంద్రంపై రాహుల్ ఫైర్
Rahul Gandhi | కేంద్రంలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలోని పిల్లల భవిష్యత్తుతో జూదం ఆడటం మానుకోవాలని వ్యాఖ్యానించారు. పరీక్షల నిర్వహణ వ్యవస్థ పనితీరును తీవ్రంగా ఎండగట్టారు.
Rahul Gandhi | రేపు జరగబోయే నీట్ రీ టెస్ట్ ఎగ్జామ్‌కు సంబంధించి ఓ విద్యార్థికి (Nagpur student) పొరపాటున యూఏఈలోని అబుదాబిలో పరీక్ష కేంద్రం (Abu Dhabi centre) కేటాయించడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తాజాగా స్పందించారు. ఈ మేరకు కేంద్రంలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం జూదం ఆడుతోందని మండిపడ్డారు. పరీక్షల నిర్వహణ వ్యవస్థ పనితీరును తీవ్రంగా ఎండగట్టారు.
ఈ మేరకు బాధిత విద్యార్థి పరిస్థితిని వివరిస్తూ ఎక్స్ వేదికగా రాహుల్ పోస్టు పెట్టారు. "నాగ్‌పూర్‌కు చెందిన ఒక విద్యార్థి నెల రోజులుగా నీట్ రీ-ఎగ్జామ్ కోసం సిద్ధమవుతున్నాడు. రేపటి పరీక్ష కోసం అతను తన అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నాడు. అందులో అతని పరీక్షా కేంద్రం అబుదాబి అని ఉంది. ఆ విద్యార్థికి పాస్‌పోర్ట్ లేదు. విద్యార్థిని విదేశాలకు పంపే ఆర్థిక స్థోమత ఆ కుటుంబానికి లేదు. పైగా ఇప్పుడు సమయం కూడా లేదు. దీంతో అతను రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు పరీక్ష రాసేందుకు కూడా ఇష్టపడట్లేదు. ఆ పరిస్థితిలో అభ్యర్థి ఎంత మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నాడో ఊహించగలరా.. ?" అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
అసలు ఇలాంటి పొరపాటు ఎలా జరుగుతుందని రాహుల్ నిలదీశారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ విద్యార్థీ కూడా పరీక్షా కేంద్రానికి చేరుకోలేని పరిస్థితి రాకూడదన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విద్యార్థులను, వారి కుటుంబాలను అనవసరపు ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. "ఒక విద్యార్థికి స్వస్థలంలో కేంద్రం కేటాయించలేని వ్యవస్థ, విదేశీ కేంద్రాన్ని కేటాయించే స్థాయికి చేరితే అలాంటి వ్యవస్థకు పరీక్షలు నిర్వహించే హక్కు లేదు. దేశంలో అమలవుతున్నది విద్యా వ్యవస్థ కాదు. ఒక తరం యువత డబ్బు, సమయం, మానసిక ప్రశాంతతను దోచుకోవడం తప్ప మరేమీ కాదు. పిల్లల భవిష్యతుత్తో జూదం ఆడటం ఆపండి. వారికి బాధ్యతాయుతమైన, జవాబుదారీతనం ఉన్న విద్యావ్యవస్థ, పరీక్షా సంస్థ అవసరం" అని రాహుల్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.
नागपुर का एक बच्चा एक महीने से NEET re-exam की तैयारी कर रहा था।
कल परीक्षा से ठीक एक दिन पहले उसने admit card डाउनलोड किया। उसका सेंटर निकला - अबू धाबी।
न पासपोर्ट, न परिवार के पास विदेश भेजने के पैसे, न अब कोई वक़्त बचा है। वो रातभर रोता रहा, और परीक्षा देने से ही मना कर रहा… https://t.co/TJOHUBnFDB
— Rahul Gandhi (@RahulGandhi) June 20, 2026
Also Read..
అమెరికా అధ్యక్షుడికి కొత్త ఎయిర్‌ఫోర్స్ వన్.. రూ.3 వేల కోట్ల జెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన ఖతార్
ఆ మాట నేనేదో జోక్‌గా అంటే.. ప్రపంచమంతా పాకింది.. బాస్ వ్యాఖ్యలపై ట్రంప్ వివరణ
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

NEET UG | నీట్ రీ-ఎగ్జామ్.. మధ్యాహ్నం 1.30 గంట వరకే ఎగ్జామ్ హాల్లోకి అనుమతి..
జూన్ 20, 2026

NEET Re Test | రేపే నీట్ రీ ఎగ్జామ్.. నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబిలో సెంటర్.. ఎన్టీఏ ఏమన్నదంటే..?
జూన్ 20, 2026

Harish Rao | రాహుల్ పుట్టిన రోజునే రైతు డిక్లరేషన్‌కు బొంద పెట్టారు: హరీశ్‌రావు
జూన్ 19, 2026
తాజావార్తలు
- ●Mynampally Hanumanth Rao | కేటీఆర్.. నీ బట్టలిప్పి పరుగెత్తిస్తా: మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు
- ●Post Office Time Deposit | ఈ పోస్టాఫీస్ పథకంలో చేరితే వడ్డీనే రూ.5 లక్షలు లభిస్తాయి..!
- ●Indian Railway | ప్రయాణికులకు రైల్వే షాక్.. జరిమానాలు భారీగా పెంపు
- ●RS Praveen Kumar | బాధితురాలికి అన్యాయం చేస్తే డిస్మిస్సే.. అనుమానముంటే ఆంధ్రా పోలీసులను అడగండి: ఆర్ఎస్ ప్రవీణ్
- ●Air Force One | అమెరికా అధ్యక్షుడికి కొత్త ఎయిర్‌ఫోర్స్ వన్.. రూ.3 వేల కోట్ల జెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన ఖతార్
- ●Harsil Valley | ఉత్తరాఖండ్‌లో దాగి ఉన్న ఈ లోయ నిజమైన స్వర్గం.. ప్రకృతి ప్రేమికులకు ఆహ్వానం..

Mynampally Hanumanth Rao | కేటీఆర్.. నీ బట్టలిప్పి పరుగెత్తిస్తా: మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు

Post Office Time Deposit | ఈ పోస్టాఫీస్ పథకంలో చేరితే వడ్డీనే రూ.5 లక్షలు లభిస్తాయి..!

Indian Railway | ప్రయాణికులకు రైల్వే షాక్.. జరిమానాలు భారీగా పెంపు

RS Praveen Kumar | బాధితురాలికి అన్యాయం చేస్తే డిస్మిస్సే.. అనుమానముంటే ఆంధ్రా పోలీసులను అడగండి: ఆర్ఎస్ ప్రవీణ్



