UP Teacher Shot Dead | దారుణం.. విద్యార్థుల ఎదుటే టీచర్‌ను కాల్చి చంపాడు
UP Teacher Shot Dead | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లఖింపూర్ ఖేరీ (Lakhimpur Kheri)లో ఓ పాఠశాల ఉపాధ్యాయురాలిని దుండగుడు కాల్చి చంపాడు. ఆపై నిందితుడు కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
UP Teacher Shot Dead | త్రినేత్ర.న్యూస్ : ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లఖింపూర్ ఖేరీ (Lakhimpur Kheri)లో దారుణ ఘటన వెలుగు చూసింది. స్కూల్‌లో విద్యార్థుల (School Students) ఎదుటే ఓ మహిళా ఉపాధ్యాయురాలిని దుండగుడు కాల్చి చంపాడు (UP Teacher Shot Dead). ఆపై నిందితుడు కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిల్డ్రన్స్ అకాడమీ స్కూల్‌లో సోమవారం ఉదయం 11:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలు సదర్ కొత్వాలీ పరిధిలోని హిదాయత్ నగర్‌కు చెందిన 26 ఏళ్ల నిషత్ ఫాతిమాగా గుర్తించారు. నిందితుడు 28 ఏళ్ల మొహమ్మద్ సౌద్‌గా పోలీసులు తేల్చారు. సౌద్ ఇవాళ ఉదయం ఫాతిమాను కలిసేందుకు పాఠశాలకు వచ్చాడు. కారిడార్‌లో ఆమెతో మాట్లాడుతూనే తన వెంట తెచ్చుకున్న గన్‌తో ఫాతిమాపై కాల్పులు జరిపాడు. ఆపై తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనతో పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పాఠశాల ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఫాతిమా, సౌద్‌లు చాలాకాలంగా ఒకరికొకరు తెలుసునని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, ప్రత్యక్ష సాక్షులను పోలీసులు విచారిస్తున్నారు. మృతుడు, మృతురాలి కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నిస్తున్నారు.
Also Read..
పౌరసత్వం అంశం.. సోనియా గాంధీకి చుక్కెదురు
కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా
- ●Lava Virat Curve | లావా విరాట్ కర్వ్ వచ్చేసింది.. వెనుక మరో డిస్‌ప్లే..
- ●V Hanumantha Rao | కాంగ్రెస్ ఇచ్చిన భూములను కాంగ్రెస్సే కాపాడాలి
- ●Sonia Gandhi | పౌరసత్వం అంశం.. సోనియా గాంధీకి చుక్కెదురు
- ●Indian Railways | యూపీఐ ద్వారా రైలు టిక్కెట్లను కొంటే ఛార్జీలు ఉంటాయా.. రైల్వే శాఖ స్పష్టత..
- ●Ponguleti Srinivas Reddy | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం

Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా

Lava Virat Curve | లావా విరాట్ కర్వ్ వచ్చేసింది.. వెనుక మరో డిస్‌ప్లే..

V Hanumantha Rao | కాంగ్రెస్ ఇచ్చిన భూములను కాంగ్రెస్సే కాపాడాలి

Sonia Gandhi | పౌరసత్వం అంశం.. సోనియా గాంధీకి చుక్కెదురు






