త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lava Virat Curve | లావా విరాట్ కర్వ్ వచ్చేసింది.. వెనుక మరో డిస్‌ప్లే..

Lava Virat Curve | లావా సంస్థ తన విరాట్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. లావా విరాట్ కర్వ్ పేరుతో వచ్చిన ఈ ఫోన్‌లో వంపు తిరిగిన డిస్‌ప్లేతోపాటు వెనుక భాగంలో ప్రత్యేకమైన సెకండరీ డిస్‌ప్లేను అందించారు. మధ్యస్థాయి ధర విభాగంలో ప్రత్యేకమైన డిజైన్‌తోపాటు ఎక్కువ బ్యాటరీ సామర్థ్యాన్ని కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు.

S

Technology | Published On Sep 21, 2026, 5.38 pm IST

Lava Virat Curve | లావా విరాట్ కర్వ్ వచ్చేసింది.. వెనుక మరో డిస్‌ప్లే..
Advertisement

Lava Virat Curve | లావా సంస్థ తన విరాట్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. లావా విరాట్ కర్వ్ పేరుతో వచ్చిన ఈ ఫోన్‌లో వంపు తిరిగిన డిస్‌ప్లేతోపాటు వెనుక భాగంలో ప్రత్యేకమైన సెకండరీ డిస్‌ప్లేను అందించారు. మధ్యస్థాయి ధర విభాగంలో ప్రత్యేకమైన డిజైన్‌తోపాటు ఎక్కువ బ్యాటరీ సామర్థ్యాన్ని కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ ఫోన్‌లో 6.67 ఇంచుల త్రీడీ కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది. గరిష్ఠంగా 1,100 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ముందు, వెనుక భాగాల్లో సమానమైన వంపులతో రూపొందించడంతో చేతిలో పట్టుకున్నప్పుడు మెరుగైన గ్రిప్ లభించేలా డిజైన్ చేశారు. ఫోన్ వెనుక భాగంలో వెగన్ లెదర్ టెక్స్చర్‌ను ఉపయోగించారు. హెరిటేజ్ ఇండిగో, మక్రానా ఐవరీ అనే రెండు రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణ కోసం ఐపీ64 రేటింగ్‌తోపాటు మిలిటరీ గ్రేడ్ మన్నిక కోసం ఎంఐఎల్ ఎస్‌టీడీ810హెచ్ ప్రమాణాలను కూడా కలిగి ఉంది.

వెనుక వైపు డిస్‌ప్లే..

ఈ ఫోన్‌లో ప్రత్యేక ఆకర్షణగా వెనుక కెమెరా మాడ్యూల్ పక్కనే మినీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ప్రధాన డిస్‌ప్లేను ఆన్ చేయాల్సిన అవసరం లేకుండా ఇన్‌కమింగ్ కాల్స్, నోటిఫికేషన్లు, మ్యూజిక్ కంట్రోల్స్, బ్యాటరీ శాతం, ఛార్జింగ్ సమాచారం వంటి వాటిని ఇందులో చూడవచ్చు. అలాగే కస్టమ్ టెక్స్ట్, సమయం, ఎమోజీలను కూడా ఈ చిన్న డిస్‌ప్లేపై చూడ‌వ‌చ్చు. పనితీరు విషయానికి వస్తే, లావా విరాట్ కర్వ్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనికి 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ జత చేశారు. వర్చువల్ ర్యామ్ విస్తరణకు కూడా ఫోన్‌లో మద్దతు ఉంది. ఇందులో 6,000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ల వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇక బాక్స్‌లో 33 వాట్ల ఛార్జర్‌ను అందిస్తున్నారు. వెనుక భాగంలో డ్యుయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగాపిక్స‌ల్ ప్రధాన కెమెరాను అందించారు. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎల్ఈడీ ఫ్లాష్‌తోపాటు 30 ఎఫ్పీఎస్ వద్ద 2కె వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఉంది. ముందు భాగంలో 13 మెగాపిక్స‌ల్ కెమెరాను పంచ్ హోల్ డిజైన్‌లో అందించారు.

ధ‌ర ఎంతంటే..

సాఫ్ట్‌వేర్ పరంగా లావా విరాట్ కర్వ్ ఆండ్రాయిడ్ 16తో వస్తుంది. రెండు ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్లు, మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని లావా తెలిపింది. భవిష్యత్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లో కొత్త లావా యూఐ, నేటివ్ గ్యాలరీ యాప్, మెరుగుపరిచిన వాయు ఏఐ ఫీచర్లను తీసుకురానున్నారు. ఇతర ఫీచర్లలో ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, యూఎస్‌బీ టైప్ సి ఆడియో, వైఫై 6ఈ, బ్లూటూత్ 5.4, డ్యుయల్ సిమ్, 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. లావా విరాట్ కర్వ్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.23,999గా నిర్ణయించారు. లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ.4వేల బ్యాంక్ ఆఫర్‌తో రూ.19,999 ప్రారంభ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ సెప్టెంబర్ 28 సాయంత్రం 7 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి అందుబాటులోకి రానుంది.

Advertisement
Advertisement