త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rinku Singh | డిసెంబర్ 4న పెళ్లి పీట‌లెక్క‌నున్న‌ రింకూ సింగ్, ప్రియా సరోజ్.. ప్ర‌ధాని మోదీకి ఆహ్వానం

Rinku Singh | టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లికి ముహుర్తం ఖ‌రారైంది. డిసెంబర్ 4న లక్నోలో వీరిద్ద‌రూ మూడు ముళ్లు, ఏడు అడుగుల బంధంతో ఒక్క‌టి కానున్నారు.

S

National | Published On Nov 25, 2026, 6.09 pm IST

Rinku Singh | డిసెంబర్ 4న పెళ్లి పీట‌లెక్క‌నున్న‌ రింకూ సింగ్, ప్రియా సరోజ్.. ప్ర‌ధాని మోదీకి ఆహ్వానం
Advertisement

Rinku Singh | త్రినేత్ర న్యూస్ : టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లికి ముహుర్తం ఖ‌రారైంది. డిసెంబర్ 4న లక్నోలో వీరిద్ద‌రూ మూడు ముళ్లు, ఏడు అడుగుల బంధంతో ఒక్క‌టి కానున్నారు. లక్నోలోని హోటల్ రమదాలో ఈ వేడుక ఘనంగా జరగనుంది.

ఈ వేడుకకు రాజకీయ, క్రీడా, సినిమా రంగాల నుంచి సుమారు 2,000 మంది అతిథులు హాజరయ్యే అవకాశం ఉంది. అతిథుల జాబితాలో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ, రాహుల్ గాంధీ, సీఎం యోగి ఆదిత్యనాథ్, బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ వంటి ప్రముఖులు హాజ‌రు కానున్నారు. ఈ మేర‌కు రింకూ సింగ్, ప్రియా స‌రోజ్ మోదీని క‌లిసి వివాహ ఆహ్వాన ప‌త్రికను అంద‌జేశారు.

Advertisement
Advertisement