త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mallikarjun Kharge | యూపీ ప్రజలే మోదీ ‘400 పార్’ నినాదానికి అడ్డుకట్ట వేశారు : మల్లికార్జున ఖర్గే

Mallikarjun Kharge | 2024 లోక్‌సభ ఎన్నికల్లో (2024 Lok Sabha elections) ఉత్తరప్రదేశ్ ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పి.. ఆ పార్టీ దూకుడుకు అడ్డుక‌ట్ట వేశార‌ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. ప్రధాని మోదీ (PM Modi) 'అబ్ కీ బార్ 400 పార్' నినాదం (Narendra Modi 400 paar slogan) కాస్తా మూగబోయిందని వ్యాఖ్యానించారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యుడి జేబుకు చిల్లు ప‌డుతుంటే.. బీజేపీ ఖజానా మాత్రం నిండుతోందని విమ‌ర్శించారు.

D

National | Published On Nov 26, 2026, 5.07 pm IST

Mallikarjun Kharge | యూపీ ప్రజలే మోదీ ‘400 పార్’ నినాదానికి అడ్డుకట్ట వేశారు : మల్లికార్జున ఖర్గే
Advertisement

Mallikarjun Kharge | త్రినేత్ర న్యూస్ : 2024 లోక్‌సభ ఎన్నికల్లో (2024 Lok Sabha elections) ఉత్తరప్రదేశ్ ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. ఈ ఓటమితో ప్రధాని మోదీ (PM Modi) 'అబ్ కీ బార్ 400 పార్' నినాదం కాస్తా మూగబోయిందని (Narendra Modi 400 paar slogan) వ్యాఖ్యానించారు. ల‌క్నో (Lucknow)లోని కాంగ్రెస్ కార్యాల‌యంలో జ‌రిగిన సంవిధాన్ ర‌క్షా స‌మ్మేళ‌న్‌లో (Samvidhan Raksha Sammelan) ఖ‌ర్గే మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి కేవ‌లం 36 స్థానాలను మాత్రమే గెలుచుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

"ఉత్తరప్రదేశ్ ప్రజలకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్కడికి వెళ్లినా తన ప్రసంగాలన్నింటిలో 'అబ్ కీ బార్ 400 పార్' అని నిన‌దించేవారు. కానీ బీజేపీ 400 సీట్ల మార్కును దాటిందా..? ప్రజలు మిమ్మల్ని (బీజేపీని ఉద్దేశిస్తూ) ఇంటికి పంపించారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని మోకాళ్లపై కూర్చోబెట్టారు. యూపీ ప్ర‌జ‌ల తీర్పు వల్లే నేడు మోదీ మౌనంగా కూర్చున్నారు" అని ఖర్గే వ్యాఖ్యానించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా బహిరంగ ప్రకటనలు తగ్గించారని ఖర్గే ఎద్దేవా చేశారు. వారిద్ద‌రి మ‌ధ్య సఖ్యత ఉందో లేదో త‌న‌కు తెలియ‌ద‌ని వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌పై ఖ‌ర్గే ప‌రోక్ష విమ‌ర్శ‌లు చేశారు. ల‌క్నోలో ఉన్న మ‌రో నాయ‌కుడి క‌న్ను కూడా ప్ర‌ధాని కుర్చీపై ఉంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది..?

ఈ సంద‌ర్భంగా దేశ ఆర్థిక ప‌రిస్థితిపై ఖ‌ర్గే తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యుడి జేబుకు చిల్లు ప‌డుతుంటే.. బీజేపీ ఖజానా మాత్రం నిండుతోందని విమ‌ర్శించారు. ఈసీకి సమర్పించిన వార్షిక ఆడిట్ నివేదిక ప్రకారం.. బీజేపీ వద్ద సుమారు రూ. 10,000 కోట్ల నిధులు ఉన్నాయని చెప్పిన ఖ‌ర్గే.. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఈడీ (ED), ఐటీ (IT), సీబీఐ (CBI) వంటి కేంద్ర సంస్థలను అడ్డుపెట్టుకుని ప్రజలను భయపెట్టి బీజేపీ డబ్బు వసూలు చేస్తోందని తీవ్ర‌స్థాయిలో ఆరోపించారు.

Also Read..

హెచ్-1బీ వీసాదారులకు షాకిచ్చిన IBM.. ఇక ఉద్యోగుల‌కు రెండే ఆప్ష‌న్లు

నవంబర్‌ 30నే పార్లమెంట్‌ స్సెషల్ సెషన్?

10 ఏళ్ల‌లో 12.5 రెట్ల లాభం ఇచ్చిన స్టాక్‌.. రూ.1 ల‌క్షకు రూ.12.5 ల‌క్ష‌లు..

Advertisement
Advertisement