త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sonia Gandhi | పౌర‌స‌త్వం అంశం.. సోనియా గాంధీకి చుక్కెదురు

Sonia Gandhi | పౌర‌స‌త్వం అంశంలో కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కురాలు సోనియా గాంధీ (Sonia Gandhi)కి మ‌ళ్లీ చుక్కెదురైంది. ఆమెపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్‌ను కొట్టివేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను ఢిల్లీ సెష‌న్స్ కోర్టు ర‌ద్దు చేసింది.

D

National | Published On Sep 21, 2026, 5.23 pm IST

Sonia Gandhi | పౌర‌స‌త్వం అంశం.. సోనియా గాంధీకి చుక్కెదురు
Advertisement

Sonia Gandhi | త్రినేత్ర‌.న్యూస్ : కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కురాలు సోనియా గాంధీ (Sonia Gandhi)కి మ‌ళ్లీ చుక్కెదురైంది. భారత పౌరసత్వం (citizenship) పొందడానికి మూడేళ్ల‌ ముందే ఓటర్ల జాబితాలో సోనియా గాంధీ పేరును చేర్చారనే ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల‌ని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను ఢిల్లీ సెషన్స్ కోర్టు ర‌ద్దు చేసింది.

ఇటలీలో జన్మించిన సోనియా గాంధీ 1968లో రాజీవ్ గాంధీని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 1983 ఏప్రిల్ 30న ఆమె భారత పౌరసత్వాన్ని అధికారికంగా స్వీకరించారు. అయితే, పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందే అంటే 1980లోనే ఆమె పేరు ఢిల్లీ ఓటర్ల జాబితాలో చేర్చ‌డం వివాదాస్ప‌ద‌మైంది. ఈ విషయంపై 1982లో నిరసనలు వ్యక్తమవ‌డంతో ఆమె పేరును తొలగించారు. 1983 జనవరిలో తిరిగి చేర్చారు. అదే ఏడాది ఏప్రిల్ 30న ఆమెకు భారత పౌరసత్వం మంజూరైంది. అయితే, పౌర‌స‌త్వం పొంద‌క‌ముందే ఓట‌ర్ల జాబితాలో ఆమె పేరు చేర్చారంటూ ఢిల్లీకి చెందిన న్యాయవాది వికాస్ త్రిపాఠి రౌస్ అవెన్యూ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్ర‌యించారు. చ‌ట్ట‌విరుద్ధంగా వ్యవహరించిన ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని విజ్ఞ‌ప్తి చేశారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు స‌రైన ఆధారాలు లేవ‌ని పిటిష‌న్‌ను డిస్మిస్ చేసింది.

దిగువ కోర్టు నిర్ణ‌యాన్ని పిటిష‌న‌ర్ రౌస్ అవెన్యూ కోర్టులో స‌వాల్ చేస్తూ రివిజ‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన ప్రత్యేక జడ్జి విశాల్ గోగ్నే (Special Judge Vishal Gogne).. దిగువ కోర్టు ఆదేశాలు చ‌ట్ట‌విరుద్ధంగా ఉన్నాయ‌ని పేర్కొంటూ వాటిని ర‌ద్దు చేశారు. పోలీసుల నివేదిక‌ను తీసుకోకుండా, ఫిర్యాదులోని ప్రాథ‌మిక అంశాల‌ను ప‌రిశీలించ‌కుండా మెజిస్ట్రేట్ త్వ‌రిత‌గ‌తిన నిర్ణ‌యం తీసుకున్నార‌ని ఆక్షేపించారు. ఈ వ్య‌వ‌హారంపై కొత్త‌గా వాద‌న‌లు విని చ‌ట్ట‌ప్ర‌కారం త‌గిన ఆదేశాలు జారీ చేయాల‌ని కేసును తిరిగి మెజిస్ట్రేట్ కోర్టుకు అప్పగించారు. అనంత‌రం ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 29కి వాయిదా వేశారు.

Also Read..

మ‌రోసారి తెర‌పైకి ధ‌ర్మ‌స్థ‌ల హ‌త్యాచార కేసు.. సుప్రీం కీల‌క ఆదేశాలు

యూపీఐ ద్వారా రైలు టిక్కెట్ల‌ను కొంటే ఛార్జీలు ఉంటాయా.. రైల్వే శాఖ స్ప‌ష్ట‌త‌..

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం

Advertisement
Advertisement