Kiren Rijiju | 1962 నాటి అవమానానికి కాంగ్రెస్ క్షమాపణలు చెబుతుందా..? : రాహుల్‌పై కేంద్ర మంత్రి ఫైర్
Kiren Rijiju | రాజీపడిన ప్రధాని అంటూ మోదీ (PM Modi)ని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rijiju) తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి నాలుగు ప్రశ్నలు సంధించారు. 1962లో చైనా తన గ్రామాన్ని ఆక్రమించిందని.. ఆ నాటి ఓటమి, అవమానానికి కాంగ్రెస్ ఇప్పుడు క్షమాపణ చెబుతుందా..? అంటూ ప్రశ్నించారు.
Kiren Rijiju | త్రినేత్ర న్యూస్ : ప్రధాని రాజీపడ్డారంటూ మోదీని (PM Modi) ఉద్దేశిస్తూ కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rijiju) తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి నాలుగు ప్రశ్నలు సంధించారు.
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి
1962లో చైనా తన గ్రామాన్ని ఆక్రమించిందని.. ఆ నాటి ఓటమి, అవమానానికి కాంగ్రెస్ ఇప్పుడు క్షమాపణ చెబుతుందా..? అంటూ ప్రశ్నించారు. భారత్‌ను కాంగ్రెస్ పేద దేశంగా ఎందుకు ఉంచింది..? అని నిలదీశారు. భారతదేశాన్ని పాములు ఆడించే వారి దేశమని ఎందుకు పిలిచేవారు..? భారతదేశ ఆర్థిక వ్యవస్థను హిందూ వృద్ధి రేటు అని ఎందుకు అవమానించారు..? అంటూ రిజుజు తన ఎక్స్ పోస్టులో ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ సమాధానాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Congress must answer 4 questions:
1. My village was occupied by China in 1962. Will Congress apologize for 1962 humiliation?
2. Congress kept India a poor nation. Why?
3. Why was India called land of snake charmers?
4. Why was India's economy insulted as Hindu rate of growth? https://t.co/ojrdYYDFLA— Kiren Rijiju (@KirenRijiju) November 20, 2026
విదేశీ శక్తులతో కుమ్మక్కై
అంతకు ముందు శుక్రవారం మీడియాతో మాట్లాడిన కిరణ్ రిజుజు.. రాహుల్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతర్జాతీయంగా భారత ప్రతిష్ఠను ప్రతిపక్ష నేత దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. స్వదేశంలోనైనా, విదేశాల్లోనైనా దేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయకూడదని హితవు పలికారు. విదేశాల్లోని భారత వ్యతిరేక శక్తులతో రాహుల్ కుమ్మక్కై దేశ ప్రజాస్వామ్యం, ఆర్థిక వ్యవస్థపై అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని రిజుజు ఆరోపించారు.
ఇదీ వివాదం..
చైనాలోని షెన్‌జెన్ (Shenzhen) వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), రష్యా అధినేత పుతిన్ (Vladimir Putin), చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Xi Jinping) మధ్య అత్యంత కీలకమైన త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోను రాహుల్ తన ఎక్స్‌లో షేర్ చేస్తూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే.. ఈ టేబుల్ వద్ద భారత ప్రధాన మంత్రి కూర్చొని ఉండేవారని పేర్కొన్నారు. రాజీపడిన ప్రధాని ఎప్పటికీ ఆ టేబుల్ వద్ద కూర్చోలేరంటూ ప్రధాని మోదీని (PM Modi) ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
If Congress were in power, India's Prime Minister would be sitting at this table.
A compromised PM can never sit at this table. https://t.co/EpGZVnJPYq
— Rahul Gandhi (@RahulGandhi) November 20, 2026
Also Read..
నూడుల్స్ తిని ఏడేళ్ల బాలిక మృతి
స్నేహా ఫామ్స్‌పై ఐటీ దాడులు.. హైదరాబాద్, విజయవాడ సహా 16 చోట్ల సోదాలు
చరిత్ర సృష్టించిన జీటీఏ6.. తొలి రోజే 3.8 బిలియన్ డాలర్ల అమ్మకాలు..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Congress | పార్టీ వ్యవహారాల ఇన్చార్జిని కలవండి.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశం
నవంబర్ 21, 2026

Donald Trump | భారత్‌లోనే తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయ్.. ఫెడ్‌పై ట్రంప్ విమర్శలు
నవంబర్ 21, 2026

Kishan Reddy | తెలంగాణలో ఇక బీజేపీ ఆట షురూ.. కిషన్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
నవంబర్ 20, 2026
తాజావార్తలు
- ●Special Trains | ప్రయాణికులకు అలర్ట్.. చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు
- ●WhatsApp | గుడ్‌న్యూస్ చెప్పిన వాట్సాప్.. గ్రూప్ సభ్యుల పరిమితి పెంపు..
- ●E-Waste | టెక్నాలజీ పెరిగే.. ఈ-వ్యర్థాలు పేరుకుపోయే!
- ●MK Stalin | స్టాలిన్ రీ ఎంట్రీ ఇస్తారా..? బాబు మృతితో అందరి చూపు కొలత్తూరు ఉప ఎన్నికపైనే
- ●Traffic Restrictions | రాణిగంజ్ ఆర్యూబీ విస్తరణ.. ఆ మార్గంలో 6 నెలలు ట్రాఫిక్ ఆంక్షలు
- ●Gold Prices | దీపావళికి బంగారం కొన్నారా? ఇప్పుడు దాని విలువ ఎంతంటే?

Special Trains | ప్రయాణికులకు అలర్ట్.. చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు

WhatsApp | గుడ్‌న్యూస్ చెప్పిన వాట్సాప్.. గ్రూప్ సభ్యుల పరిమితి పెంపు..

E-Waste | టెక్నాలజీ పెరిగే.. ఈ-వ్యర్థాలు పేరుకుపోయే!

MK Stalin | స్టాలిన్ రీ ఎంట్రీ ఇస్తారా..? బాబు మృతితో అందరి చూపు కొలత్తూరు ఉప ఎన్నికపైనే



