త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Restrictions | రాణిగంజ్‌ ఆర్‌యూబీ విస్త‌ర‌ణ.. ఆ మార్గంలో 6 నెలలు ట్రాఫిక్‌ ఆంక్షలు

Traffic Restrictions | సికింద్రాబాద్‌లోని ఎంజీ రోడ్డులో రాణిగంజ్‌ రైల్వే అండ‌ర్ బ్రిడ్జి (RUB) విస్త‌ర‌ణ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. దీంతో ఈ మార్గంలో ఆరు నెల‌ల పాటు ట్రాఫిక్ ఆంక్ష‌లు (Traffic Restrictions) విధించారు.

G

Hyderabad | Published On Nov 21, 2026, 12.29 pm IST

Traffic  Restrictions | రాణిగంజ్‌ ఆర్‌యూబీ విస్త‌ర‌ణ.. ఆ మార్గంలో 6 నెలలు ట్రాఫిక్‌ ఆంక్షలు
Advertisement

Traffic Restrictions | త్రినేత్ర న్యూస్‌: సికింద్రాబాద్‌లోని ఎంజీ రోడ్డులో రాణిగంజ్‌ రైల్వే అండ‌ర్ బ్రిడ్జి (RUB) విస్త‌ర‌ణ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. దీంతో ఈ మార్గంలో ఆరు నెల‌ల పాటు ట్రాఫిక్ ఆంక్ష‌లు (Traffic Restrictions) విధించారు. రాణిగంగ్ ఆర్‌యూబీని (Ranigunj RuB) 1874లో నిర్మించారు. 152 ఏండ్ల నాటి ఆ బ్రిడ్జిని విస్త‌రించ‌నున్నారు. ప్రస్తుతం 11 మీటర్లుగా ఉన్న‌ రహదారిని 22 మీటర్లకు వెడల్పున‌కు పెంచ‌నున్నారు. వ‌చ్చే వ‌ర్షాకాలంలోపు ఒక వైపు 11 మీట‌ర్ల ప‌నుల‌ను పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు, దారి మ‌ళ్లింపులు ఉంటాయ‌ని అధికారులు వెల్ల‌డించారు.

విస్త‌ర‌ణ పనుల నిమిత్తం 8 మీటర్ల మేర బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో కేవలం 3 మీటర్ల వెడల్పు గల మార్గంలో మాత్రమే కర్బాలా మైదాన్‌ నుంచి రాణిగంజ్‌ మీదుగా ప్యారడైజ్‌ వైపు కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను అనుమతిస్తారు. ఈ మార్గంలో లారీలు, డీసీఎంలు, ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు, కరీంనగర్‌, సిద్దిపేట, నిజామాబాద్‌ హైవేల వైపు రాకపోకలు సాగించే వాహనదారులు ప్రత్యామ్నాయ రహదారులను ఎంచుకోవాలని సూచించారు.

ట్రాఫిక్ మ‌ళ్లింపులు ఇలా..

ప్యారడైజ్‌ నుంచి రోచా బజార్‌, రాణిగంజ్‌ మీదుగా ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లే అన్ని రకాల వాహనాలను ఆర్‌యూబీకి ముందే ఎడమవైపునకు అడవయ్య చౌరస్తా, డిస్టిలరీ రోడ్డు మీదుగా కర్బాలా మైదాన్‌ వైపు మళ్లిస్తారు.

సెక్రటేరియట్‌, అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ నుంచి వచ్చే భారీ వాహనాలను అంబేద్క‌ర్‌ విగ్రహం వద్ద నుంచి లిబర్టీ వైపు, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ నుంచి వచ్చే వాహనాలను డీబీఆర్‌ మిల్స్‌ వద్ద మళ్లిస్తారు.

ప్యారడైజ్‌, సీటీఓ వైపు నుంచి వచ్చే భారీ వాహనాలను ప్యాట్నీ లేదా రసూల్‌పురా వైపు మళ్లిస్తారు.

క్లాక్‌టవర్‌, ఎస్‌బీఐ క్రాస్‌ రోడ్స్‌, ఘాస్మండీ, మోండా మార్కెట్‌ వైపు నుంచి రాణిగంజ్‌ వచ్చే వాహనాలను ఇతర మార్గాల్లోకి పంపిస్తారు.

Advertisement
Advertisement