త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Congress | పార్టీ వ్య‌వ‌హారాల ఇన్‌చార్జిని క‌ల‌వండి.. ఎమ్మెల్యే రాజ‌గోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశం

Congress | మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి (Rajagopal Reddy) అస‌మ్మ‌తి వ్య‌వ‌హారం కాంగ్రెస్ పార్టీలో కాక‌రేపుతున్న‌ది. సొంత‌ ప్ర‌భుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతూనే ఉన్నారు. సిద్దిపేట స‌భ‌లో సొంత పార్టీ అసంతృప్తి నేత‌ల గురించి సీఎం రేవంత్ చేసిన హెచ్చ‌రిక‌ల‌ను కూడా ఆయ‌న ప‌ట్టించుకోకుండా మాట‌ల యుద్ధం కొన‌సాగిస్తున్నారు.

G

Telangana | Published On Nov 21, 2026, 11.57 am IST

Congress | పార్టీ వ్య‌వ‌హారాల ఇన్‌చార్జిని క‌ల‌వండి.. ఎమ్మెల్యే రాజ‌గోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశం
Advertisement

Congress | త్రినేత్ర న్యూస్‌: మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి (Rajagopal Reddy) అస‌మ్మ‌తి వ్య‌వ‌హారం కాంగ్రెస్ పార్టీలో (Congress) కాక‌రేపుతున్న‌ది. సొంత‌ ప్ర‌భుత్వం, సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతూనే ఉన్నారు. సిద్దిపేట స‌భ‌లో సొంత పార్టీ అసంతృప్తి నేత‌ల గురించి సీఎం రేవంత్ చేసిన హెచ్చ‌రిక‌ల‌ను కూడా ఆయ‌న ప‌ట్టించుకోకుండా మాట‌ల యుద్ధం కొన‌సాగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం (AICC) నుంచి రాజ‌గోపాల్ రెడ్డికి కీల‌క ఆదేశాలు అందాయి. ఈ నెల 23న రాష్ట్ర పార్టీ వ్య‌వ‌హారాల ఇన్‌చార్జి బీఎం సందీప్‌తో (BM Sandeep) స‌మావేశం కావాలంటూ ఏఐసీసీ కార్య‌ద‌ర్శి స‌చిన్ సావంత్ ఆయ‌న‌కు స‌మాచారం అందించారు. ఈ నేప‌థ్యంలో రాజ‌గోపాల్ రెడ్డి వ్య‌వ‌హారంలో పార్టీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌నే విష‌య‌మై స‌ర్వ‌త్రా చ‌ర్చ‌జ‌రుగుతున్న‌ది.

కాగా, ఇటీవ‌లే సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఇదే విష‌య‌మై నివేదిక పంపాలని టీపీసీసీని (TPCC) ఏఐసీసీ ఆదేశించింది. దీంతో రాజగోపాల్ రెడ్డి ప్రసంగాల వీడియోలు, ఆధారాలతో కూడిన నివేదికను పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఢిల్లీకి పంపారు. హైకమాండ్ ఆదేశాల మేరకు ఆయ‌న‌పై తదుపరి నిర్ణయం ఉంటుందని చెప్పిన విష‌యం తెలిసిందే. ఈ వ్యవహారంతో పాటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలను కూడా పార్టీ పరిశీలిస్తున్న‌ది.

షోకాజ్ నోటీసులు?

పార్టీలో అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలను బహిరంగ వేదికలపై మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాజాగోపాల్‌రెడ్డికి షోకాజ్‌ నోటీసు (Show Cause Notice) ఇస్తార‌నే చర్చ జరుగుతున్న‌ది. పార్టీలో అంతర్గత క్రమశిక్షణ విషయంలో ఇప్పటికే పలుమార్లు అధిష్టానం నుంచి వచ్చిన సూచనలు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వ్యాఖ్యలు సీఎం రేవంత్‌ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని పీసీసీ క్రమశిక్షణా కమిటీ భావిస్తున్న‌దని. ఆదివారం జరగనున్న టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సమావేశంలో రాజగోపాల్‌రెడ్డి అంశాన్ని చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతరం పీఏసీ అనుమతి మేరకు రాజగోపాల్‌రెడ్డికి షోకాజ్‌ నోటీసు ఇస్తారని గాంధీ భ‌వ‌న్ వ‌ర్గాలు అంటున్నాయి.

Advertisement
Advertisement