Special Trains | ప్రయాణికులకు అలర్ట్.. చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు
Special Trains | పండుగలు, శబరిమల యాత్ర నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణమధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను (Special Trains) నడుపుతున్నది. ఇప్పటికే చర్లపల్లి నుంచి కొల్లాం, హజ్రత్ నిజాముద్దీన్, ప్రయాగ్‌రాజ్, శ్రీకాకుళం రోడ్, రెక్సాల్‌కు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
Special Trains | త్రినేత్ర న్యూస్: పండుగలు, శబరిమల యాత్ర నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణమధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను (Special Trains) నడుపుతున్నది. ఇప్పటికే చర్లపల్లి నుంచి కొల్లాం, హజ్రత్ నిజాముద్దీన్, ప్రయాగ్‌రాజ్, శ్రీకాకుళం రోడ్, రెక్సాల్‌కు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తాజాగా చర్లపల్లి–బరౌని మధ్య ప్రత్యేక సర్వీసును నడుపనున్నట్లు తెలిపింది.
చర్లపల్లి-బరౌని (రైలు నంబర్- 07561/07562): స్పెషల్ ట్రైన్ ఈ నెల 23న మధ్యాహ్నం 2 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి 24న తెల్లవారు జామున 1.30 గంటలకు బరౌని చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 25వ తేదీ తెల్లవారు జామున 3 గంటలకు బయలుదేరి రెండవ రోజు సాయంత్రం 7 గంటలకు చర్లపల్లికి చేరుకోనుంది.
రెక్సాల్-చర్లపల్లి (రైలు నం. 05531/95532): స్పెషల్ ట్రైన్ ఈ నెల 21వ తేదీ సాయంత్రం 4.55 గంటలకు బయలుదేరి రెండవ రోజు ఉదయం 10 గంటలకు చర్లపల్లికి చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో 23వ తేదీ రాత్రి 10 గంటలకు బయలుదేరి రెండవ రోజు సాయంత్రం 7 గంటలకు రెక్సాల్ చేరుకుంటుంది.
రెక్సాల్-చర్లపల్లి (రైలు నం. 05529/05530): అన్ రిజర్వ్‌డ్ స్పెషల్ ట్రైన్ ఈ నెల 22వ తేదీ సాయంత్రం 4.55 గంటలకు రెక్సాల్ నుంచి బయలుదేరి రెండవ రోజు ఉదయం 10 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 24వ తేదీ రాత్రి 10 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి రెండవ రోజు సాయంత్రం 7 గంటలకు రెక్సాల్ చేరుతుంది.
చర్లపల్లి - హజ్రత్ నిజాముద్దీన్(07023): నవంబర్ 24న రాత్రి 7.45 గంటలకు బయలుదేరుతుంది.
చర్లపల్లి - ప్రయాగ్‌రాజ్(04122): నవంబర్ 24, డిసెంబర్ 1 తేదీలలో నడుస్తుంది.
చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్ (07037): నవంబర్ 25 వరకు ప్రతి మంగళ, బుధవారాల్లో ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
చర్లపల్లి - రెక్సాల్ అన్‌రిజర్వ్‌డ్ స్పెషల్ (05530): నవంబర్ 24 రాత్రి 10 గంటలకు బయలుదేరుతుంది.
తాజావార్తలు
- ●IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
- ●MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
- ●Elderly couple death | వృద్ధాప్య సమస్యలతో భర్త మృతి.. తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య కన్నుమూత
- ●Indus Water | సింధూ జలాల ఒప్పందంపై మా వైఖరి స్పష్టంగా ఉంది : భారత్
- ●Loan Guarantor | లోన్ గ్యారంటర్‌గా సంతకం చేస్తున్నారా? ఈ ప్రమాదాలు తెలుసుకోండి!
- ●BRS Leaders | కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత

IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ

MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

Elderly couple death | వృద్ధాప్య సమస్యలతో భర్త మృతి.. తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య కన్నుమూత

Indus Water | సింధూ జలాల ఒప్పందంపై మా వైఖరి స్పష్టంగా ఉంది : భారత్






