త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

GTA 6 | చ‌రిత్ర సృష్టించిన జీటీఏ6.. తొలి రోజే 3.8 బిలియ‌న్ డాలర్ల అమ్మ‌కాలు..

GTA 6 | ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6 (జీటీఏ 6) తొలి రోజే సుమారు 3.8 బిలియన్ డాలర్ల (రూ.3.4 లక్షల కోట్లకు పైగా) అమ్మకాలు సాధించినట్లు టేక్-- ఇంటరాక్టివ్ వెల్లడించింది. దీంతో సినిమా, వీడియో గేమ్స్ సహా అన్ని వినోద రంగాల్లో ఇదే అతిపెద్ద విడుదలగా రికార్డు సృష్టించింది. విడుదలకు ముందే 3.25 కోట్ల ప్రీ-ఆర్డర్లు నమోదవడం ఈ గేమ్‌పై ఉన్న క్రేజ్‌కు నిదర్శనంగా నిలిచింది.

S

Business | Published On Nov 21, 2026, 10.44 am IST

GTA 6 | చ‌రిత్ర సృష్టించిన జీటీఏ6.. తొలి రోజే 3.8 బిలియ‌న్ డాలర్ల అమ్మ‌కాలు..
Advertisement

GTA 6 | ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6 (జీటీఏ 6) తొలి రోజే సుమారు 3.8 బిలియన్ డాలర్ల (రూ.3.4 లక్షల కోట్లకు పైగా) అమ్మకాలు సాధించినట్లు టేక్-- ఇంటరాక్టివ్ వెల్లడించింది. దీంతో సినిమా, వీడియో గేమ్స్ సహా అన్ని వినోద రంగాల్లో ఇదే అతిపెద్ద విడుదలగా రికార్డు సృష్టించింది. విడుదలకు ముందే 3.25 కోట్ల ప్రీ-ఆర్డర్లు నమోదవడం ఈ గేమ్‌పై ఉన్న క్రేజ్‌కు నిదర్శనంగా నిలిచింది.

తొలి రోజే 3.8 బిలియ‌న్ డాల‌ర్ల అమ్మ‌కాలు..

రాక్‌స్టార్ గేమ్స్ రూపొందించిన జీటీఏ 6 ప్రపంచ వినోద పరిశ్రమలో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ గేమ్ తొలి పూర్తి రోజైన గురువారం ముగిసే సమయానికి 3.8 బిలియన్ డాలర్ల అమ్మకాలు సాధించినట్లు మాతృసంస్థ టేక్-టూ ఇంటరాక్టివ్ వెల్లడించింది. గత 13 ఏళ్ల క్రితం విడుదలైన జీటీఏ 5 తొలి ఐదు రోజుల్లో 1.15 బిలియన్ డాలర్ల ఆదాయం మాత్రమే సాధించగా, జీటీఏ 6 ఒక్క రోజులోనే దానిని అధిగమించింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే ప్రపంచవ్యాప్తంగా సాధించిన 2.5 బిలియన్ డాలర్ల వసూళ్లను కూడా జీటీఏ 6 తొలి రోజు ఆదాయం మించిపోయింది. పరిశోధనా సంస్థ నికో పార్ట్‌నర్స్ అంచనా ప్రకారం ఈ గేమ్ ఈ ఏడాది మొత్తం 3 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం సాధించే అవకాశం ఉంది. అయితే ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే 4.5 బిలియన్ డాలర్ల వసూళ్లతో గాన్ విత్ ది విండ్ చిత్రం ఇప్పటికీ ముందంజలో ఉంది.

భారీగా పెరిగిన ఇంట‌ర్నెట్ ట్రాఫిక్‌..

గేమ్ విడుదలతో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ట్రాఫిక్ భారీగా పెరిగింది. క్లౌడ్‌ఫ్లేర్ నివేదిక ప్రకారం, బ్రిటన్‌లో ప్లేస్టేషన్ 5 డౌన్‌లోడ్లు సాధారణ స్థాయితో పోలిస్తే 8.6 రెట్లు పెరిగాయి. ఆస్ట్రేలియాలో రాక్‌స్టార్ ఆన్‌లైన్ సేవల ట్రాఫిక్ 11.2 రెట్లు, అమెరికా తూర్పు తీరంలో 9.3 రెట్లు పెరిగింది. న్యూజిలాండ్‌లో గేమ్ ముందుగా అందుబాటులోకి రావడంతో అక్కడ ట్రాఫిక్ 14.8 రెట్లు పెరిగింది. సెన్సార్ టవర్ అంచనాల ప్రకారం మొత్తం అమ్మకాల్లో సుమారు 75 శాతం ప్లేస్టేషన్ 5 ద్వారా, మిగిలినవి ఎక్స్‌బాక్స్ ద్వారా నమోదయ్యాయి. ఈ గేమ్ కారణంగా ఇతర సింగిల్ ప్లేయర్ గేమ్స్ ఆడేందుకు వినియోగదారులు కేటాయించే సమయం 10 శాతం తగ్గుతుంద‌ని సంస్థ అంచనా వేసింది.

1 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగా వ్య‌యం..

ఇక జీటీఏ 6 అభివృద్ధికి 1 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చయినట్లు అంచనా. దీంతో ఇప్పటివరకు అత్యంత ఖరీదైన వీడియో గేమ్‌గా నిలిచింది. ఫ్లోరిడా రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని రూపొందించిన కల్పిత ప్రాంతం లియోనిడాలో కథ సాగుతుంది. లూసియా, జేసన్ అనే ఇద్దరు చిన్న స్థాయి నేరస్థుల చుట్టూ గేమ్ కథనం ఉంటుంది. మరోవైపు జపాన్‌లో గేమ్‌లోని హింసాత్మక దృశ్యాల కారణంగా సెన్సార్ ఆంక్షలు ఎదురయ్యాయి. చైనా ప్రధాన భూభాగంలోనూ విక్రయాలకు అనుమతి లేదు. అమెరికాలో పోలీసులు వీధి రేసింగ్, తుపాకీ హింస చట్టవిరుద్ధమని గేమ్ విడుదల సందర్భంగా ప్రజలకు గుర్తుచేశారు. అయితే పీసీ వెర్షన్ విడుదల తేదీ, మల్టీప్లేయర్ విస్తరణపై రాక్‌స్టార్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. జీటీఏ 5 తరహాలో ఆన్‌లైన్ గేమింగ్, ఇన్-గేమ్ కొనుగోళ్ల ద్వారా భవిష్యత్తులో మరింత ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి.

Advertisement
Advertisement