త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold Prices | దీపావళికి బంగారం కొన్నారా? ఇప్పుడు దాని విలువ ఎంతంటే?

Gold Prices | దీపావళి, ధన త్రయోదశి సందర్భంగా బంగారం కొనుగోలు చేసిన వారికి నవంబర్‌లో ధరలు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. నవంబర్ 8తో పోలిస్తే నవంబర్ 20 నాటికి 22, 24 క్యారెట్ల బంగారం ధరలు సుమారు 12.5 శాతం తగ్గాయి. దీంతో పండుగ సమయంలో కొనుగోలు చేసిన బంగారం ప్రస్తుత మార్కెట్ విలువ గణనీయంగా తగ్గింది.

S

Business | Published On Nov 21, 2026, 12.17 pm IST

Gold Prices | దీపావళికి బంగారం కొన్నారా? ఇప్పుడు దాని విలువ ఎంతంటే?
Advertisement

Gold Prices | దీపావళి, ధన త్రయోదశి సందర్భంగా బంగారం కొనుగోలు చేసిన వారికి నవంబర్‌లో ధరలు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. నవంబర్ 8తో పోలిస్తే నవంబర్ 20 నాటికి 22, 24 క్యారెట్ల బంగారం ధరలు సుమారు 12.5 శాతం తగ్గాయి. దీంతో పండుగ సమయంలో కొనుగోలు చేసిన బంగారం ప్రస్తుత మార్కెట్ విలువ గణనీయంగా తగ్గింది.

గ‌ణనీయంగా త‌గ్గిన ధ‌ర‌లు..

అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న పరిణామాలు, పెట్టుబడిదారుల సెంటిమెంట్ ప్రభావంతో నవంబర్ నెలలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. గుడ్‌రిటర్న్స్ వివరాల ప్రకారం.. నవంబర్ 20న 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.12,557గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.11,510, 18 క్యారెట్ల ధర రూ.9,418గా నమోదైంది. నవంబర్ 8న 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,31,600గా, 24 క్యారెట్ల ధర రూ.1,43,570గా ఉంది. తాజా ధరలతో పోలిస్తే బంగారం విలువ సుమారు 12.5 శాతం తగ్గింది. అంటే దీపావళి సమయంలో కొనుగోలు చేసిన బంగారం ప్రస్తుత మార్కెట్ విలువ గతంతో పోలిస్తే గణనీయంగా పడిపోయింది.

దీపావ‌ళికి కొని ఉంటే ఎంత త‌గ్గింది..?

దీపావళికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారాన్ని రూ.1,31,600కు కొనుగోలు చేసిన వ్యక్తికి, నవంబర్ 20 నాటి ధరల ప్రకారం దాని విలువ రూ.1,15,100కు తగ్గింది. అంటే సుమారు రూ.16,500 తేడా ఏర్పడింది. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని రూ.1,43,570కు కొనుగోలు చేస్తే, ప్రస్తుతం దాని సూచిక మార్కెట్ విలువ రూ.1,25,570గా ఉంది. ఈ లెక్కన రూ.18వేల మేర విలువ తగ్గింది. ఐదు గ్రాముల 22 క్యారెట్ల బంగారాన్ని రూ.65,800కు కొనుగోలు చేసినా, ప్రస్తుత ధరల ప్రకారం దాని విలువ సుమారు రూ.57,550 మాత్రమే. అయితే ఇవి మార్కెట్ ధరల ఆధారంగా చేసిన అంచనాలు మాత్రమే. నగల విక్రయం సమయంలో స్వచ్ఛత పరీక్షలు, తరుగు, ఇతర తగ్గింపుల కారణంగా వాస్తవంగా లభించే మొత్తం ఇంకా తక్కువగా ఉంటుంది.

కొనుగోలుదారులు న‌ష్ట‌పోయిన‌ట్లా..

అయితే బంగారం ధరలు తగ్గినంత మాత్రాన దీపావళికి కొనుగోలు చేసినవారు వెంటనే నష్టపోయినట్లు కాదని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ డిమాండ్, కరెన్సీ మారకపు విలువలు, వడ్డీ రేట్ల అంచనాలు, పెట్టుబడిదారుల సెంటిమెంట్ వంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా నగలు కొనుగోలు చేసినవారు బంగారం అసలు ధరతో పాటు చెల్లించిన మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. నగలను తిరిగి విక్రయించే సమయంలో మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ సాధారణంగా తిరిగి లభించవు. అలాగే నగల స్వచ్ఛత, తరుగు, సంబంధిత జువెల్లరీ షాపు బైబ్యాక్ నిబంధనలను బట్టి విక్రయ ధర మారుతుంది.

Advertisement
Advertisement