త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kishan Reddy | తెలంగాణలో ఇక బీజేపీ ఆట షురూ.. కిష‌న్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..!

Kishan Reddy | తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ అసలైన ఆట మొదలుపెట్టబోతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, రాబోయే రోజుల్లో ఆ రెండు పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని అన్నారు.

P

Telangana | Published On Nov 20, 2026, 9.30 pm IST

Kishan Reddy | తెలంగాణలో ఇక బీజేపీ ఆట షురూ.. కిష‌న్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..!
Advertisement

Kishan Reddy | తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ అసలైన ఆట మొదలుపెట్టబోతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, రాబోయే రోజుల్లో ఆ రెండు పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని అన్నారు. తెలంగాణలో రాజకీయ మార్పును తీసుకొచ్చే సత్తా బీజేపీకే ఉందని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవడంలో రాహుల్‌ విఫలమయ్యారని విమర్శించారు. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసే క్రమంలో రాజ్యాంగ సంస్థలను అంతర్జాతీయ వేదికలపై అవమానిస్తున్నారని ఆరోపించారు.

ఇది మోదీని కించపరచడం కాదని, యావత్‌ దేశ ప్రజల గౌరవాన్ని దెబ్బతీయడమేనని వ్యాఖ్యానించారు. దేశ అభివృద్ధికి ఉపయోగపడే సూచనలు చేయకుండా విమర్శలకే పరిమితమవుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ, గాంధీ కుటుంబం గత ఆరు దశాబ్దాల్లో దేశాన్ని అవినీతిమయం చేశాయని ఆరోపించారు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడి భారతీయులను కలిస్తే దేశ ప్రతిష్ట, భారతీయుల గౌరవం ఎలా పెరిగాయో తెలుస్తుందని రాహుల్‌కు సూచించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులతో కలిసి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ బలంపై సీఎం రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలని కిషన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనే బీజేపీ రాష్ట్రంలో ఎనిమిది స్థానాలు గెలుచుకుందని గుర్తుచేశారు.

ఇటీవల రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ విజయం సాధించామని, త్వరలో జరగనున్న మరో రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఫలితాలే రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ప్రజాదరణకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని, ప్రజలు ఆ పార్టీలపై నమ్మకం కోల్పోతున్నారని విమర్శించారు. తెలంగాణతోపాటు కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లోనూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోనే దేశం, తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement