త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IT Raids | స్నేహా ఫామ్స్‌పై ఐటీ దాడులు.. హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ స‌హా 16 చోట్ల సోదాలు

IT Raids | ప్రముఖ పౌల్ట్రీ, అగ్రి బిజినెస్ సంస్థ స్నేహ గ్రూప్‌పై (Sneha Group) ఆదాయపు పన్ను శాఖ అధికారులు మెరుపు దాడులు (IT Raids) నిర్వ‌హించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మొత్తం 16 ప్రాంతాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు చేస్తున్నారు.

G

Telangana | Published On Nov 21, 2026, 10.48 am IST

IT Raids | స్నేహా ఫామ్స్‌పై ఐటీ దాడులు.. హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ స‌హా 16 చోట్ల సోదాలు
Advertisement

IT Raids | త్రినేత్ర న్యూస్‌: ప్రముఖ పౌల్ట్రీ, అగ్రి బిజినెస్ సంస్థ స్నేహ గ్రూప్‌పై (Sneha Group) ఆదాయపు పన్ను శాఖ అధికారులు మెరుపు దాడులు (IT Raids) నిర్వ‌హించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మొత్తం 16 ప్రాంతాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ (Hyderabad), విజయవాడ నగరాల్లోని ప్రధాన కార్యాలయాలతో పాటు సంస్థ డైరెక్టర్లు రామ్‌రెడ్డి డెండి, వరుణ్ రెడ్డి డెండి, స్నేహ డెండి నివాస్లాల్లోనూ త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు.

1982లో రామ్‌రెడ్డి చికెన్ మార్కెట్‌గా ప్రారంభమైన ఈ సంస్థ‌.. 1994 నాటికి స్నేహ ఫామ్స్‌గా విస్తరించింది. ప్రస్తుతం పౌల్ట్రీ బ్రీడింగ్, చికెన్ ప్రాసెసింగ్, పశువుల దాణా రంగాలతో పాటు 'సఫల' బ్రాండ్‌తో వంట నూనెల తయారీ విభాగంలోనూ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న‌ది. కొండాపూర్ కేంద్రంగా న‌డుస్తున్న స్నేహా ఫామ్స్‌.. తెలంగాణలో గంటకు దాదాపు 12 వేల‌ కోళ్లను ప్రాసెస్ చేసే సామర్థ్యం గ‌ల ఆటోమేటెడ్ ప్లాంట్‌ను క‌లిగి ఉంది. రెండు రాష్ట్రాల్లో 2000 మందికి పైగా కాంట్రాక్ట్ రైతులతో కలిసి వ్యాపారం నిర్వ‌హిస్తున్న‌ది. కాగా, పన్ను చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయా అనే కోణంలో అధికారులు రికార్డులు, హార్డ్‌డిస్క్‌లు, బ్యాంకు ఖాతాల వివరాలను పరిశీలిస్తున్నారు.

Advertisement
Advertisement