Eating Noodles | నూడుల్స్ తిని ఏడేళ్ల బాలిక మృతి
Eating Noodles | ఇంట్లో తయారు చేసిన నూడుల్స్ తిని (Eating Noodles) ఏడేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయిన ఘటన రాజస్థాన్ (Rajasthan) జైపూర్ (Jaipur)లో వెలుగు చూసింది. మరో బాలిక తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరింది.
Eating Noodles | త్రినేత్ర న్యూస్ : రాజస్థాన్ (Rajasthan) జైపూర్ (Jaipur)లో విషాదం చోటు చేసుకుంది. నూడుల్స్ తిని (Eating Noodles) ఏడేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. మరో యువతి తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఫుడ్ పాయిజన్ వల్లే ఇలా జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 19న ఈ ఘటన జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పిహు కుమావత్ (Pihu Kumawat), దివ్యాన్షి (Divyanshi) అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇంట్లో నూడుల్స్ వండుకుని తిన్నారు. ఆ తర్వాత వారు నిద్రపోయారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో వారి తల్లిదండ్రులు ఇంటికి వచ్చే సరికి అక్క దివ్యాన్షి అస్వస్థతతో మేల్కొని ఉంది. కానీ పిహు అపస్మారక స్థితిలోనే ఉండిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు వారిద్దరినీ హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అక్కాచెల్లెళ్లను పరీక్షించిన వైద్యులు పిహు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. దివ్యాన్షికి అత్యవసర చికిత్స అందించారు. ఆమె కోలుకుని శుక్రవారం ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. ఫుడ్ పాయిజనింగ్ వల్లే ఇలా జరిగిందని అధికారులు ప్రాథమిక విచారణలో అనుమానిస్తున్నారు. అయితే, బాలిక మరణానికి గల అసలు కారణం పోస్టుమార్టం నివేదిక తర్వాతే స్పష్టమవుతుందని అధికారులు తెలిపారు.
బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్కాచెల్లెళ్లు తిన్న నూడుల్స్ నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు. మరోవైపు బాధితురాలి సోదరుడు గోవింద్ తీవ్ర అనారోగ్యంతో గత రెండు నెలలుగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పుడు బాలిక మృతితో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
Also Read..
న్యూయార్క్‌లో రోడ్డు ప్రమాదం.. నల్లగొండ జిల్లా యువకుడు దుర్మరణం
అమెరికా మార్కెట్లకు ఏఐ భయాలు.. ఇన్వెస్టర్లకు షాక్..
పెట్టుబడిదారులకు బంగారం భారీ షాక్.. వారం రోజుల్లోనే 9 శాతం పతనం..
సంబంధిత వార్తలు

Dating App | డేటింగ్ యాప్ ప్రేమలో ట్విస్ట్.. ఆ విషయం తెలిసి పెండ్లికి నిరాకరించిన యువకుడు!
నవంబర్ 15, 2026

Massive explosion on a railway track | ప్రయాణికుల రైలు వెళ్లిన కొద్దిసేపటికే.. రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు
నవంబర్ 4, 2026

Eight labourers died | రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా.. కరెంట్ షాక్‌తో 8 మంది కూలీలు మృతి
నవంబర్ 2, 2026
తాజావార్తలు
- ●Special Trains | ప్రయాణికులకు అలర్ట్.. చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు
- ●WhatsApp | గుడ్‌న్యూస్ చెప్పిన వాట్సాప్.. గ్రూప్ సభ్యుల పరిమితి పెంపు..
- ●E-Waste | టెక్నాలజీ పెరిగే.. ఈ-వ్యర్థాలు పేరుకుపోయే!
- ●MK Stalin | స్టాలిన్ రీ ఎంట్రీ ఇస్తారా..? బాబు మృతితో అందరి చూపు కొలత్తూరు ఉప ఎన్నికపైనే
- ●Traffic Restrictions | రాణిగంజ్ ఆర్యూబీ విస్తరణ.. ఆ మార్గంలో 6 నెలలు ట్రాఫిక్ ఆంక్షలు
- ●Gold Prices | దీపావళికి బంగారం కొన్నారా? ఇప్పుడు దాని విలువ ఎంతంటే?

Special Trains | ప్రయాణికులకు అలర్ట్.. చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు

WhatsApp | గుడ్‌న్యూస్ చెప్పిన వాట్సాప్.. గ్రూప్ సభ్యుల పరిమితి పెంపు..

E-Waste | టెక్నాలజీ పెరిగే.. ఈ-వ్యర్థాలు పేరుకుపోయే!

MK Stalin | స్టాలిన్ రీ ఎంట్రీ ఇస్తారా..? బాబు మృతితో అందరి చూపు కొలత్తూరు ఉప ఎన్నికపైనే



