Amit Shah | నీట్ అంశంపై చర్చ.. స్పీకర్ ఓం బిర్లాకు అమిత్ షా లేఖ
Amit Shah | లోక్‌సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఓం బిర్లా (Om Birla)కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) లేఖ రాశారు. నీట్ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
Amit Shah | త్రినేత్ర.న్యూస్ : విద్యార్థుల నిరసనలు సహా ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతీ అంశంపై చర్చకు తాను సిద్ధమే అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఆయన లోక్‌సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఓం బిర్లా (Om Birla)కు అధికారికంగా లేఖ రాశారు. నీట్ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఇప్పటికే ప్రభుత్వం తరఫున నీట్ అంశంపై చర్చకు అంగీకారం తెలిపారని అమిత్ షా తన లేఖలో గుర్తుచేశారు. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని తీవ్రంగా ఎత్తిచూపడానికి ముందే, ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు, 2026' పై చర్చించినట్లు లేఖలో ప్రస్తావించారు. అయితే ఆ సమయంలో ప్రతిపక్ష సభ్యులెవరూ సభలో NEET పరీక్ష గురించి తమ అభిప్రాయాలను వ్యక్తపరచలేదని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మరొకసారి ఈ అంశంపై చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వివరించారు. ప్రతిపక్షాలతో చర్చించి చర్చ సమయాన్ని నిర్ణయించాలని కోరారు. అందుకు వారు కోరినంత సమయం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. చర్చలో తాను స్వయంగా పాల్గొంటానని చెప్పారు. ప్రతిపక్షాలు లేవనెత్తే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని లేఖలో షా స్పష్టం చేశారు.
Union Home Minister Amit Shah writes a letter to Lok Sabha Speaker Om Birla.
"You are aware that the Minister of Parliamentary Affairs, Kiren Rijiju, has agreed on behalf of the government—during the Business Advisory Committee meeting—to hold a discussion in Parliament… pic.twitter.com/d7mMKItESX
— ANI (@ANI) August 12, 2026
Also Read..
ఎన్టీఆర్‌కు సర్జరీ.. కోలుకునేందుకు 3 నెలలు..!
షాకింగ్ అధ్యయనం.. ఢిల్లీలో ప్రతి 20 మందిలో ఒకరికి షుగర్, బీపీ..
135 నుంచి 89 కేజీలకు.. ఇదీ నితిన్ గడ్కరీ వెయిట్ లాస్ జర్నీ
సంబంధిత వార్తలు

Amit Shah | చర్చకు నేను సిద్ధం.. విపక్షాలకు అమిత్ షా సవాల్
ఆగస్టు 12, 2026

Ramchandar Rao | రాహుల్.. తెలంగాణకు రండి, పారిపోకుండా పార్లమెంటుకూ రండి.. మీకున్న నాలెడ్జ్‌తోనే మాట్లాడండి
ఆగస్టు 11, 2026

NEET | నీట్‌ను రద్దు చేయాలి.. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన విజయ్ సర్కార్
ఆగస్టు 11, 2026
తాజావార్తలు
- ●Jr NTR | ఎన్టీఆర్‌కు సర్జరీ.. కోలుకునేందుకు 3 నెలలు..!
- ●Delhi | షాకింగ్ అధ్యయనం.. ఢిల్లీలో ప్రతి 20 మందిలో ఒకరికి షుగర్, బీపీ..
- ●Nitin Gadkari | 135 నుంచి 89 కేజీలకు.. ఇదీ నితిన్ గడ్కరీ వెయిట్ లాస్ జర్నీ
- ●Vakiti Srihari | ప్రతి పేదవాడి గుండెలో ఎర్ర సత్యం బతికే ఉన్నాడు : మంత్రి వాకిటి
- ●Revanth Reddy | మిల్లర్ల బకాయిలు వసూలు చేయండి.. చెల్లించకపోతే మిల్లుల బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగిద్దాం
- ●Dasoju Sravan | రాయదుర్గం సాక్షిగా 7 ఎకరాల భూ దోపిడీ : ఎమ్మెల్సీ దాసోజు

Jr NTR | ఎన్టీఆర్‌కు సర్జరీ.. కోలుకునేందుకు 3 నెలలు..!

Delhi | షాకింగ్ అధ్యయనం.. ఢిల్లీలో ప్రతి 20 మందిలో ఒకరికి షుగర్, బీపీ..

Nitin Gadkari | 135 నుంచి 89 కేజీలకు.. ఇదీ నితిన్ గడ్కరీ వెయిట్ లాస్ జర్నీ

Vakiti Srihari | ప్రతి పేదవాడి గుండెలో ఎర్ర సత్యం బతికే ఉన్నాడు : మంత్రి వాకిటి



