త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jr NTR | ఎన్టీఆర్‌కు సర్జరీ.. కోలుకునేందుకు 3 నెల‌లు..!

Jr NTR | ప్ర‌ముఖ న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ భుజానికి స‌ర్జ‌రీ విజ‌యవంత‌మైంది. ఈ మేర‌కు సికింద్రాబాద్ కిమ్స్ ఆస్ప‌త్రి వైద్యులు బుధ‌వారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుద‌ల చేశారు.

S

Movies | Published On Aug 12, 2026, 4.57 pm IST

Jr NTR | ఎన్టీఆర్‌కు సర్జరీ.. కోలుకునేందుకు 3 నెల‌లు..!
Advertisement

Jr NTR | త్రినేత్ర‌.న్యూస్ : ప్ర‌ముఖ న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ భుజానికి స‌ర్జ‌రీ విజ‌యవంత‌మైంది. ఈ మేర‌కు సికింద్రాబాద్ కిమ్స్ ఆస్ప‌త్రి వైద్యులు బుధ‌వారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుద‌ల చేశారు. డాక్టర్ ఆర్ఎ పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ శ్రీనివాస్ రావు సురపనేని నేతృత్వంలోని ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది.

ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది, ఆయన పూర్తి క్షేమంగా ఉన్నార‌ని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఎన్టీఆర్‌కు త్వరలోనే ప్రత్యేక రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంద‌న్నారు. దాదాపు 2 నుండి 3 నెలల వ్యవధిలో సంపూర్ణంగా కోలుకుని, సాధారణ స్థితికి వస్తారని డాక్టర్ల అంచనా వేశారు.

ఇక ఎన్టీఆర్ కెరీర్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటైన ‘డ్రాగన్’ షూటింగ్‌పై కూడా తాజా అప్‌డేట్ వచ్చింది. ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో మొదటి నుంచే విపరీతమైన క్రేజ్ నెలకొంది.

ట్యాగ్స్:

Advertisement
Advertisement