Nitin Gadkari | 135 నుంచి 89 కేజీలకు.. ఇదీ నితిన్ గడ్కరీ వెయిట్ లాస్ జర్నీ
Nitin Gadkari | కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) వెయిట్ లాస్ జర్నీ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఒకప్పుడు గడ్కరీ 135 కేజీల బరువు ఉండగా.. ఇప్పుడు 89 కిలోలకు తగ్గారట. కొవిడ్ తర్వాత జీవితం చాలా మారిపోయిందని చెబుతున్నారు కేంద్ర మంత్రి.
Nitin Gadkari | త్రినేత్ర.న్యూస్ : బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari)కి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆయన వెయిట్ లాస్ జర్నీ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఒకప్పుడు గడ్కరీ 135 కేజీల బరువు ఉండగా.. ఇప్పుడు 89 కిలోలకు తగ్గారట. ముఖ్యంగా కొవిడ్ మహమ్మారి తర్వాత ఆరోగ్యశైలిని మార్చుకుని, క్రమశిక్షణతో కూడిన వ్యాయామం చేయడం ద్వారా ఐదేళ్లలోనే 46 కిలోల బరువు తగ్గారు.
ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్ యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ అయిన వీడియోలో తన వెయిట్‌లాస్ జర్నీకి సంబంధించిన ఆసక్తికర విషయాలను కేంద్ర మంత్రి పంచుకున్నారు. "ఒక సమయంలో నేను దాదాపు 135 కిలోల బరువు ఉండేవాడిని. ప్రస్తుతం నా వెయిట్ 89 కేజీలు. రాత్రి ఎంత లేట్‌గా పడుకున్నా ఉదయం 7 గంటలకంతా నిద్ర లేస్తా. దాదాపు రెండున్నర గంటల పాటూ వ్యాయామం చేస్తా. వ్యాయామాన్ని రోజూ నా దినచర్యలో భాగం చేసుకున్నా. ముఖ్యంగా కొవిడ్ మహమ్మారి (COVID pandemic) తర్వాత ఆరోగ్యం విషయంలో నా ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. అంతకుముందు నా జీవితం ఎలాంటి ప్రణాళిక, క్రమశిక్షణ లేకుండా సాగింది. కొవిడ్ తర్వాత జీవితం చాలా మారిపోయింది. ఆ సమయంలో నేను చాలా మంది మిత్రులను కోల్పోయాను. ఆ పరిస్థితులే నన్ను ఆరోగ్యంపై దృష్టిపెట్టేలా చేశాయి. ఇప్పుడు వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా వ్యాయామానికి మాత్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తా" అని గడ్కరీ చెప్పుకొచ్చారు.
Also Read..
ప్రతి పేదవాడి గుండెలో ఎర్ర సత్యం బతికే ఉన్నాడు : మంత్రి వాకిటి
మిల్లర్ల బకాయిలు వసూలు చేయండి.. చెల్లించకపోతే మిల్లుల బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగిద్దాం
దేశంలో ప్రతి 2.3 నిమిషాలకు ఒక వాహనం చోరీ.. తెలంగాణలో ఎన్ని ఎత్తుకుపోయారంటే?
సంబంధిత వార్తలు

Nitin Gadkari | సిగ్గుగా ఉంది.. ప్రారంభోత్సవానికి నేను రాను : రహదారి నిర్మాణం ఆలస్యంపై గడ్కరీ అసహనం
సెప్టెంబర్ 10, 2026

Bharat NCAP 2.0 | భారత్ ఎన్‌క్యాప్ 2.0.. వాహన భద్రతపై గడ్కరీ కీలక ప్రకటన
సెప్టెంబర్ 3, 2026

Nitin Gadkari | పనిచేయలేకపోతున్నా.. ఇక కొత్తతరానికి బాధ్యతలు అప్పగించాలి : నితిన్ గడ్కరీ
ఆగస్టు 25, 2026
తాజావార్తలు
- ●Arrest | క్యూర్ కోడ్ స్కాన్ చేసి.. నకిలీ స్క్రీన్ షాట్ చూపించి
- ●New EHS | 921 ఆస్పత్రుల్లో ఈహెచ్ఎస్ అమలు
- ●Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..
- ●ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు
- ●Samantha | సినిమాలు మానేయాలనుకున్నా - విడాకుల తర్వాత జీవితంపై సమంత కామెంట్స్
- ●NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన

Arrest | క్యూర్ కోడ్ స్కాన్ చేసి.. నకిలీ స్క్రీన్ షాట్ చూపించి

New EHS | 921 ఆస్పత్రుల్లో ఈహెచ్ఎస్ అమలు

Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..

ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు



