Jihadi Drug | రూ.182 కోట్ల విలువైన జిహాదీ డ్రగ్స్ పట్టివేత.. అమిత్ షా కీలక ప్రకటన
Jihadi Drug | నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (Narcotics Control Bureau) భారీ స్థాయిలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. 'ఆపరేషన్ రేజ్‌పిల్' (Operation Ragepill)లో భాగంగా దేశంలోనే మొదటిసారిగా సుమారు రూ.182 కోట్ల విలువైన "జిహాదీ డ్రగ్" (Jihadi Drug) అని పిలిచే 'క్యాప్టగాన్' (Captagon) మాదకద్రవ్యాలను ఎన్‌సీబీ స్వాధీనం చేసుకుంది.
Jihadi Drug | డ్రగ్స్‌పై నరేంద్ర మోదీ (PM Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగానే తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (Narcotics Control Bureau) భారీ స్థాయిలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. 'ఆపరేషన్ రేజ్‌పిల్' (Operation Ragepill)లో భాగంగా దేశంలోనే మొదటిసారిగా సుమారు రూ.182 కోట్ల విలువైన "జిహాదీ డ్రగ్" (Jihadi Drug) అని పిలిచే 'క్యాప్టగాన్' (Captagon) మాదకద్రవ్యాలను ఎన్‌సీబీ స్వాధీనం చేసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) శనివారం ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని తమ ప్రభుత్వం భారత్‌ను డ్రగ్స్ రహిత దేశంగా నిర్మించాలని నిర్ణయించిందన్నారు.
ఈ డ్రగ్స్‌ను మధ్యప్రాచ్య దేశాలకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు అమిత్ షా తెలిపారు. ఓ విదేశీయుడిని కూడా అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. డ్రగ్స్‌పై తమ ప్రభుత్వానికి ఉన్న జీరో టాలరెన్స్ విధానానికి ఇది నిదర్శనం అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా అక్రమంగా డ్రగ్స్‌ను రవాణా చేసే వారికి షా కీలక హెచ్చరికలు జారీ చేశారు. తమ భూభాగాన్ని డ్రగ్స్ అక్రమ రవాణా మార్గంగా ఉపయోగించుకోనివ్వబోమని స్పష్టం చేశారు. భారత్ గుండా వెళ్లే ప్రతి గ్రాము డ్రగ్‌ను తాము అణచివేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన నార్కోటిక్ అధికారును షా అభినందించారు.
Modi govt is resolved for a ‘Drug-Free India’.
Glad to share that through ‘Operation RAGEPILL’, our agencies have achieved the first-ever seizure of Captagon, the so-called “Jihadi Drug”, worth ₹182 crore.
The busting of the drug consignment destined for the Middle East and…
— Amit Shah (@AmitShah) May 16, 2026
Also Read..
ధూమపానం అలవాటే లేదు.. అయినా మహిళల్లో పెరుగుతున్న లంగ్ క్యాన్సర్ కేసులు..!
న్యాయ శిఖరం జస్టిస్ గుండా చంద్రయ్య కన్నుమూత
ఇంట్లో అందరూ ఇప్పటికీ ప్రీపెయిడ్ వాడుతున్నారా..? పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్లు చాలా బెటర్..
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






