Postpaid Family Plans | ఇంట్లో అందరూ ఇప్పటికీ ప్రీపెయిడ్ వాడుతున్నారా..? పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్లు చాలా బెటర్..
Postpaid Family Plans | ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు. డిజిటల్ యుగంలో అది ఒక అత్యంత ఆవశ్యకమైన వస్తువుగా మారింది. ఈ క్రమంలోనే కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే ప్రతి ఒక్కరు ఒక్కో ఫోన్ వాడుతున్నారు. అయితే చాలా మంది ప్రీపెయిడ్ వాడుతుంటారు. దీని వల్ల ఇంట్లో ఉండే అందరూ నెల నెలా విడివిడిగా రీచార్జి చేస్తుంటారు.
Postpaid Family Plans | ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు. డిజిటల్ యుగంలో అది ఒక అత్యంత ఆవశ్యకమైన వస్తువుగా మారింది. ఈ క్రమంలోనే కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే ప్రతి ఒక్కరు ఒక్కో ఫోన్ వాడుతున్నారు. అయితే చాలా మంది ప్రీపెయిడ్ వాడుతుంటారు. దీని వల్ల ఇంట్లో ఉండే అందరూ నెల నెలా విడివిడిగా రీచార్జి చేస్తుంటారు. ఈ క్రమంలో ఒక్కొక్కరి రీచార్జికి నెలకు సగటున రూ.400 నుంచి రూ.500 వరకు ఖర్చవుతుంది. దీని వల్ల నెలవారీ బిల్లు మొత్తం కలిపి అందరికీ రూ.1600 నుంచి రూ.2వేల వరకు అవుతుంది. అయితే వినియోగదారులు ఈ భారాన్ని తగ్గించుకోవచ్చు. అందుకుగాను టెలికాం సంస్థలు జియో, ఎయిర్ టెల్ ఫ్యామిలీ పోస్ట్ పెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఈ ప్లాన్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఇవి కేవలం డబ్బును ఆదా చేయడమే కాకుండా, అన్‌లిమిటెడ్ 5జి డేటాను ఉపయెగించుకునే సౌకర్యం అందిస్తున్నాయి. అలాగే ప్రీమియం ఎంటర్‌టైన్‌మెంట్ యాక్సెస్‌ను సైతం పొందవచ్చు.
జియోలో ఉన్న ఫ్యామిలీ ప్లాన్ వివరాలు..
టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ప్లాట్‌ఫామ్‌లో జియో ప్లస్ పేరిట పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్లను చవక ధరలకే అందిస్తోంది. రూ.449 ప్రారంభ ధరకు ఈ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మెయిన్ యూజర్‌కు 75జీబీ ఉచిత డేటా, అపరిమిత 5జి డేటా లభిస్తాయి. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఇందులో మరో ముగ్గురు కుటుంబ సభ్యులను జత చేయవచ్చు. ఒక్కో అదనపు సిమ్‌కు కేవలం రూ.150 మాత్రమే అదనంగా చెల్లించాలి. అదే విడిగా అయితే నెలకు రీచార్జి రూ.400 వరకు అవుతుంది. అందువల్ల ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్ వల్ల ఎంతో డబ్బు ఆదా అవుతుందని చెప్పవచ్చు. ఇక ముగ్గురు సభ్యులను జత చేస్తే మొత్తం రూ.450 దీనికి ప్లాన్ రెంటల్ రూ.449 కలిపితే రూ.899 అవుతుంది. అంటే ప్రీపెయిడ్‌లో అయ్యే కనీస బిల్ రూ.1600 కన్నా చాలా తక్కువే అవుతుందన్నమాట. ఇలా ఈ ప్లాన్ తో ఇంట్లోని నలుగురు ప్రయోజనం పొందవచ్చు. ఈ ప్లాన్‌లో 5జి ఉన్న చోట అపరిమిత 5జి డేటా లభిస్తుంది. డేటా షేరింగ్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. జియో సినిమా, టీవీ, హాట్ స్టార్ వంటి యాప్ లకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. అంటే ఓటీటీ యాప్‌లను కూడా ఇందులో ఉచితంగా చూడవచ్చన్నమాట. ఇలా ఈ ప్లాన్‌తో ఎంతో డబ్బును ఆదా చేయవచ్చు.
ఎయిర్‌టెల్‌లో అయితే..
ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ, వ్యక్తిగత ప్లాన్‌లలో డేటా రోల్ ఓవర్, ఓటీటీ బెనిఫిట్స్‌ను అందిస్తోంది. డేటా రోల్ ఓవర్ అంటే ఒక నెలలో ఉచితంగా అందించే డేటాను యూజర్ మొత్తం వాడకపోతే మిగిలిన డేటా మరుసటి నెలకు బదిలీ అవుతుందన్నమాట. దీంతో గడిచిన నెలలోని మిగిలిన డేటా, ఈ నెలలో కొత్తగా వచ్చే డేటా.. మొత్తం కలిపి అధికంగా మొబైల్ డేటాను పొందవచ్చు. అయితే కొన్ని ప్లాన్‌లలో 5జి ఉన్న చోట అన్‌లిమిటెడ్ 5జి డేటాను కూడా ఇస్తున్నారు. ఇక ఇందులో రూ.699 ప్లాన్‌ను తీసుకుంటే ఇద్దరికి వస్తుంది. ఇందులో అన్‌లిమిటెడ్ 5జి డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ వంటి బెనిఫిట్స్ లభిస్తాయి. రూ.1199, రూ.1399 ప్లాన్‌లలో నలుగురు సభ్యులను జత చేయవచ్చు. 190 నుంచి 240 జీబీ వరకు నెలవారీ బల్క్ డేటా లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ఓటీటీ యాప్ లకు ప్రీమియం యాక్సెస్ లభిస్తుంది. ఇలా ఇందులోనూ డబ్బును ఆదా చేయవచ్చు.
వ్యక్తిగత రీచార్జిలు లేదా వ్యక్తిగత పోస్ట్ పెయిడ్ ప్లాన్ల కన్నా ఫ్యామిలీ పోస్ట్ పెయిడ్ ప్లాన్లు అదనపు ప్రయోజనాలను అందిస్తాయి. కుటుంబ సభ్యులకు అందరికీ ఒకే బిల్ వస్తుంది. డేటా మొత్తం షేర్ అవుతుంది. అందరూ నెల నెలా రీచార్జి చేయాల్సిన పనిలేదు. ఎంతో డబ్బును పొదుపు చేయవచ్చు. సాధారణంగా నలుగురు సభ్యులు ఉండే కుటుంబానికి నెలకు ప్రీపెయిడ్ రీచార్జిల మొత్తం రూ.1600 వరకు అయితే, పోస్ట్ పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ల ద్వారా రూ.1200 లోపే అందరూ సమానమైన బెనిఫిట్స్‌ను పొందవచ్చు. పోస్ట్ పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్లను తీసుకునే ముందు వినియోగదారులు కచ్చితంగా పూర్తి వివరాలను తెలుసుకున్నాకే ప్లాన్‌కు మారాలి. ఈ ప్లాన్ల వల్ల ఆర్థిక క్రమశిక్షణ అలవడడమే కాకుండా, అందరికీ అన్ని బెనిఫిట్స్ షేరింగ్‌లో వస్తాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Airtel | ఎయిర్‌టెల్ నుంచి ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్.. ఆ యూజర్లకే మొదటి ప్రాధాన్యత..
మే 19, 2026

BSNL Recharge Plan | బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. 70 రోజుల వ్యాలిడిటీ, హైస్పీడ్ డేటాతో రూ.599 కొత్త రీఛార్జ్ ప్లాన్..!
ఏప్రిల్ 27, 2026

Reliance Industries | ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేసిన రిలయన్స్ షేర్లు.. అప్పట్లో రూ.10వేలు పెట్టి ఉంటే ఇప్పుడు కోట్లు లాభం..
ఏప్రిల్ 26, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



