త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BJPs Bengal Manifesto | మ‌హిళ‌ల‌కు నెల‌కు రూ.3వేలు.. ఐదేళ్ల‌లో కోటి ఉద్యోగాలు.. బెంగాల్ ఎన్నిక‌ల మేనిఫెస్టో విడుద‌ల చేసిన బీజేపీ

BJPs Bengal Manifesto | ప‌శ్చిమ‌బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ మేనిఫెస్టోను (BJPs Bengal Manifesto) విడుద‌ల చేసింది. సంక‌ల్ప ప‌త్రం పేరు (Sankalp Patra)తో 15 సూత్రాలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) దీనిని శుక్ర‌వారం విడుద‌ల చేశారు.

D

National | Published On Apr 10, 2026, 3.54 pm IST

BJPs Bengal Manifesto | మ‌హిళ‌ల‌కు నెల‌కు రూ.3వేలు.. ఐదేళ్ల‌లో కోటి ఉద్యోగాలు.. బెంగాల్ ఎన్నిక‌ల మేనిఫెస్టో విడుద‌ల చేసిన బీజేపీ
Advertisement

BJPs Bengal Manifesto | ప‌శ్చిమ‌బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ మేనిఫెస్టోను (BJPs Bengal Manifesto) విడుద‌ల చేసింది. సంక‌ల్ప ప‌త్రం పేరు (Sankalp Patra)తో 15 సూత్రాలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) దీనిని శుక్ర‌వారం విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా బెంగాల్ ప్ర‌జ‌ల‌కు హామీల వ‌ర్షం కురిపించారు. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ గెలిచి అధికారంలోకి వ‌చ్చిన ఆరు నెల‌ల్లోనే రాష్ట్రంలో ఉమ్మ‌డి పౌరస్మృతి (యూసీసీ)ని అమ‌లు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. తద్వారా బెంగాల్‌లో ప్ర‌తి పౌరుడికి ఒకే చ‌ట్టం వ‌ర్తిస్తుంద‌ని తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగులు, జీత‌భ‌త్యాలు పొందే కార్మికులంద‌రికీ క‌ర‌వు భ‌త్యం అందేలా చూస్తామ‌ని చెప్పారు. త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన 45 రోజుల్లోగా 7వ వేత‌న సంఘం అమ‌లు చేస్తామ‌న్నారు. అంతేకాదు, మ‌హిళ‌లకు ప్ర‌తి నెల ఆర్థిక సాయంగా రూ.3వేలు, నిరుద్యోగ యువ‌త‌కు నెల‌కు రూ.3వేలు అందిస్తామ‌ని తెలిపారు. ఐదేళ్లలో కోటి కొత్త ఉద్యోగాలు, స్వయంఉపాధి అవకాశాలు, మహిళల కోసం ప్రత్యేక పోలీస్‌ బెటాలియన్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఈ మేనిఫెస్టో బంగారు బెంగాల్ నిర్మాణానికి ఓ మార్గ‌సూచికంగా అమిత్ షా అభివ‌ర్ణించారు. ఈ సంద‌ర్భంగా ప‌శ్చిమ బెంగాల్‌లోని మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌భుత్వంపై షా తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. దీదీ నేతృత్వంలోని గ‌త 15 ఏళ్ల పాల‌న బెంగాల్ ప్ర‌జ‌ల‌కు పీడ‌క‌ల అని అభివర్ణించారు.

Also Read..

మ‌రోసారి ఎగువ స‌భ‌కు హ‌రివంశ్ నారాయ‌ణ్‌ సింగ్‌.. నామినేట్ చేసిన రాష్ట్ర‌ప‌తి

బీహార్ త‌దుప‌రి సీఎంగా సామ్రాట్ చౌద‌రి..?

రామ్ మ‌నోహ‌ర్ లోహియా ఫంక్ష‌న్ హాల్ ఏర్పాటు గ‌ర్వ‌కార‌ణం: ప్రారంభోత్స‌వంలో మంత్రి పొన్నం

Advertisement
Advertisement