Bihar CM | బీహార్ తదుపరి సీఎంగా సామ్రాట్ చౌదరి..?
Bihar CM | బీహార్ ముఖ్యమంత్రి (Bihar CM) నితీశ్ కుమార్ (Nitish Kumar) రాష్ట్ర రాజకీయాలను వదిలేసి కేంద్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో బీహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి.
Bihar CM | బీహార్ ముఖ్యమంత్రి (Bihar CM) నితీశ్ కుమార్ (Nitish Kumar) రాష్ట్ర రాజకీయాలను వదిలేసి కేంద్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాజ్యసభ సభ్యుడిగా నితీశ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. త్వరలో సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలో బీహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న బీజేపీ నేత సామ్రాట్ చౌదరి (Samrat Choudhary) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఈ నెల 14న బీహార్ నూతన ముఖ్యమంత్రిని ఎన్డీయే (NDA) కూటమి ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే రోజు ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఆ సమావేశంలోనే కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. సామ్రాట్ చౌదరికి సీఎం పదవి వరించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నితీశ్ కుమార్‌తోపాటూ ఆయన ఢిల్లీకి వెళ్లారు. నాయకత్వ మార్పు గురించి పార్టీ హైకమాండ్‌తో చర్చించనున్నారు. నితీశ్ కుమార్ రాజీనామా చేసిన రోజే సామ్రాట్ చౌదరిని సీఎంగా ఎన్డీయే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. అయితే, దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
రేసులో కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్..
1990లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన సామ్రాట్ చౌదరి.. 2000లో జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో పర్బత్తా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి రబ్రీ దేవి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా పని చేశారు. ఆయన 2010లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై బీహార్ శాసనసభలో ప్రతిపక్ష పార్టీ చీఫ్ విప్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత 2014లో ఆర్జేడీ పార్టీ తిరుగుబాటు వర్గంలో చేరి పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సామ్రాట్ చౌదరి 2018లో భారతీయ జనతా పార్టీలో చేరి బీహార్‌ప్రదేశ్ ఉపాధ్యక్షుడిగా, 2023లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2024 జనవరి 28న నితీష్ కుమార్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు. సామ్రాట్ చౌదరితోపాటూ.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ (Nityanand Rai) పేరు కూడా తెరపైకి వచ్చింది.
నిషాంత్‌కు డిప్యూటీ పోస్ట్..?
మరోవైపు ఇప్పటి వరకూ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న నితీశ్ కుమార్ కుమారుడు నిషాంత్ కుమార్ నెల రోజుల క్రితం జేడీయూలో చేరిన విషయం తెలిసిందే. తన తండ్రి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లిన తరుణంలో రాష్ట్ర రాజకీయాల్లో నిషాంత్ కీలకంగా వ్యవహరించనున్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో నిషాంత్‌కు కీలక పదవి వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిషాంత్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా నివేదిస్తోంది.
Also Read..
రేవంత్.. ఫ్యూచర్ సిటీ సంగతి తర్వాత.. ముందు ఉన్న సిటీని బాగు చెయ్: కవిత
అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా
‘వైశాఖి’ వేడుకలకు రండి.. కేటీఆర్‌ను ఆహ్వానించిన అమీర్‌పేట్ గురుద్వారా కమిటీ
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026

N Ramachander Rao | మోదీ నేపథ్యం.. కాంగ్రెస్‌కు ఎప్పుడూ కంటగింపే : ఎన్ రామచందర్ రావు
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



