Vaddiraju Ravi Chandra | మహిళలకు, బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
Vaddiraju Ravi Chandra | మహిళా రిజర్వేషన్లకు బీఆర్ఎస్ మొదటి నుంచీ మద్దతు ఇస్తోందని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. మహిళలతో పాటు బీసీలకు 33 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించాలని 2014లోనే అప్పటి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తుచేశారు.
- డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు
- బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ను నిలదీస్తాం
- బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర
Vaddiraju Ravi Chandra | మహిళా రిజర్వేషన్లకు బీఆర్ఎస్ మొదటి నుంచీ మద్దతు ఇస్తోందని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. మహిళలతో పాటు బీసీలకు 33 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించాలని 2014లోనే అప్పటి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తుచేశారు. తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ 12 ఏళ్లు ఆలస్యమైందన్నారు. తెలంగాణ భవన్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యసభలో బీఆర్ఎస్‌కు ఉన్న ముగ్గురు ఎంపీలు డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తారని వెల్లడించారు. అయితే రాజ్యసభ సీట్ల సంఖ్య కూడా పెంచాలని, అక్కడా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కూడా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ మధ్య అనుబంధం
బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఢిల్లీ కేంద్రంగా పనిచేసే పార్టీలని, వాటి మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలుసని రవిచంద్ర వ్యాఖ్యానించారు. దేశంలోని ఇతర ముఖ్యమంత్రులతో పోలిస్తే ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు కలిశారో పరిశీలించాలని అన్నారు. ప్రధానిని కలిసినా రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చలేదని, సొంత ప్రయోజనాలే నెరవేర్చుకున్నారని ఆరోపించారు. ఏ పార్టీకి ఎవరు బీటీంగా వ్యవహరిస్తున్నారో ప్రజలకు తెలుసన్నారు. 2029 ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో చెబుతున్నారని రవిచంద్ర పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను బీజేపీతో ఉన్న రాజకీయ అవగాహనకు ముడిపెడుతూ ఆయన విమర్శలు గుప్పించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



