త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | రామ్ మ‌నోహ‌ర్ లోహియా ఫంక్ష‌న్ హాల్ ఏర్పాటు గ‌ర్వ‌కార‌ణం: ప్రారంభోత్స‌వంలో మంత్రి పొన్నం

Multi purpose function hall | రామ్ మ‌నోహ‌ర్ లోహియా మ‌హానుభావుడ‌ని.. ఆయ‌న పేరిట‌ గోషామహల్ (Ghoshamahal) నియోజకవర్గంలో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ (Multi purpose function hall) ఏర్పాటు చేసుకోవ‌డం గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) అన్నారు. రూ. 3.92 కోట్ల జీహెచ్ఎంసీ నిధులతో రెండు దశల్లో దీన్ని నిర్మించిన‌ట్లు తెలిపారు.

S

News | Published On Apr 10, 2026, 3.45 pm IST

Ponnam Prabhakar | రామ్ మ‌నోహ‌ర్ లోహియా ఫంక్ష‌న్ హాల్ ఏర్పాటు గ‌ర్వ‌కార‌ణం: ప్రారంభోత్స‌వంలో మంత్రి పొన్నం
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: రామ్ మ‌నోహ‌ర్ లోహియా మ‌హానుభావుడ‌ని.. ఆయ‌న పేరిట‌ గోషామహల్ (Ghoshamahal) నియోజకవర్గంలో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ (Multi purpose function hall) ఏర్పాటు చేసుకోవ‌డం గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) అన్నారు. రూ. 3.92 కోట్ల జీహెచ్ఎంసీ నిధులతో రెండు దశల్లో దీన్ని నిర్మించిన‌ట్లు తెలిపారు. నాయిని నరసింహా రెడ్డి దీనికి శంకుస్థాపన చేస్తే నేడు కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఆయ‌న‌ ఫంక్ష‌న్ హాల్‌ను ప్రారంభించి మాట్లాడారు. ఇది అనేక భవిష్య‌త్ కార్య‌క్ర‌మాల‌కు వేదిక కావాల‌ని.. రాజకీయాలు శాశ్వతం కాదని వెల్ల‌డించారు. నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

చేప‌ల మార్కెట్‌ను అందుబాటులోకి తెస్తాం..

గోషామ‌హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ప్రతి మహిళా సభ్యురాలు కావాలని.. వారికి వడ్డీలేని రుణాలు అందాలని చెప్పారు. ఇక్క‌డున్న చేప‌ల మార్కెట్‌ను 99 రోజుల్లో వినియోగంలోకి తెస్తామ‌ని పేర్కొన్నారు. రామ్ మనోహర్ లోహియా మహానుభావుడ‌ని, ఢిల్లీ నడిబొడ్డున ఆయ‌న పేరిట ఆసుపత్రి కూడా ఉంద‌ని తెలిపారు. ఆయన పేరు ఈ ఫంక్షన్ హాల్ కు పెట్టుకున్నామ‌ని.. ఇది అందరికీ ఉపయోగపడాలని ఆకాంక్షించారు. తాను హైద‌రాబాద్ ఇంచార్జి మంత్రిగా ఉన్నాన‌ని, ఏ స‌మ‌స్య ఉన్నా త‌న దృష్టికి తీసుకురావాల‌ని సూచించారు.

ప్రతి డివిజ‌న్‌కు రూ.2 కోట్లు..

స్థానిక శాసన సభ్యుడి నుంచి రూ.5 లక్షలు, ఎంపీ నిధుల నుంచి రూ.5 లక్షలతో ఈ ఫంక్షన్ హాల్ లో ఏసీ ఏర్పాటు చేస్తామ‌ని వివ‌రించారు. ఫంక్షన్ హాల్ నిర్వహణ ముఖ్యమ‌ని, దీన్ని నిర్వాహకులు జాగ్ర‌త్తగా కాపాడుకోవాలని విజ్ఞ‌ప్తి చేశారు. వేసవి కాలం దృష్ట్యా ఏసీలు ఏర్పాటు చేయిస్తున్నామ‌ని పేర్కొన్నారు. అభివృద్ధి ప‌నుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డివిజన్ కు రూ.2 కోట్లు కేటాయించిన‌ట్లు వెల్ల‌డించారు. గోషామహల్ నియోజకవర్గంలో అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామ‌న్నారు.

మ‌హిళ‌లు బ‌స్సుల‌కు య‌జ‌మానులు కావాలి..

ప్రజా పాలన ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత కొత్త‌ రేషన్ కార్డులు పంపిణీ చేశాం. ఇంకా ఎవరికైనా అర్హత ఉండి రాకపోతే రాజకీయాలకు అతీతంగా అందిస్తాం. ఒక్కొక్క‌రికి 6 కిలోల సన్న బియ్యం స‌ర‌ఫ‌రా చేయిస్తున్నాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం క‌ల్పిస్తున్నాం. మహిళలు ప్రతి ఒక్కరు మెప్మా లో సభ్యులుగా చేరాలి. వారికి వడ్డీలేని రుణాలు అందిస్తున్నాం. హైదరాబాద్ లో మహిళా సంఘాల్లో తక్కువ మంది సభ్యులు ఉన్నారు. గ్రామాల్లో ఆర్టీసీ బస్సులకు మహిళలు యజమానులు అయ్యారు. హైదరాబాద్ లో కూడా మహిళలు బస్సులకు యజమానులు కావాలి అని మంత్రి పొన్నం ఆకాంక్షించారు.

కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే రాజాసింగ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, ముఖ్య నేతలు, అధికారులు తదిత‌రులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement