Udhayanidhi Stalin | మరోవివాదంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్.. హిందూ సంఘాలు ఫైర్
Udhayanidhi Stalin | తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) మరో వివాదంలో (Controversy) చిక్కుకున్నారు.
Udhayanidhi Stalin | తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) మరో వివాదంలో (Controversy) చిక్కుకున్నారు. “సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటిది… దాన్ని నిర్మూలించాలి” అంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలపాలైన ఉదయనిధి.. ఇప్పుడు ఓ ఆలయాన్ని సందర్శించడం వివాదానికి దారితీస్తోంది.
త్వరలో తమిళనాడు అసంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అధికార డీఎంకే కూడా అధికారాన్ని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఇటీవలే ఓ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయన నుదుటిన తిలకం దిద్ది ఆశీర్వచనం చేశారు. ఇక ఆలయం నుంచి బయటకు వచ్చిన వెంటనే ఉదయనిధి తన నుదుటిపై ఉన్న తిలకాన్ని తుడిచేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఉదయనిధి ప్రవర్తనపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. గతంలో సనాతన ధర్మంపై (Sanatana Dharma Remark) తీవ్ర వ్యాఖ్యలు చేసిన వ్యక్తి.. ఇప్పుడు ఆలయాన్ని సందర్శించడం కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే అంటూ ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాలు సైతం డీఎంకే నేతలపై విరుచుకుపడుతున్నాయి. ఓట్ల కోసం డీఎంకే నేతలు ఎంతకైనా దిగజారుతారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల్లో ప్రయోజనం కోసమే ఉదయనిధి ఆలయాన్ని సందర్శించారంటూ ఆరోపిస్తున్నారు. ఎన్నికల వేళ ఉదయనిధి ప్రవర్తన తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారం ప్రతిపక్షాలకు ఓ ఆయుధం కావొచ్చు అంటూ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read..
ప్రపంచ శాంతికి ఇది గొప్ప రోజు.. సీజ్‌ఫైర్‌పై ట్రంప్
కాళేశ్వరం కమిషన్‌పై హైకోర్టు తీర్పు వాయిదా
పసికందుకు కాలం చెల్లిన ఇంజెక్షన్.. మంచిర్యాల పిల్లల దవాఖానలో దారుణం..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Supreme Court | కావేరి జలాల వివాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
సెప్టెంబర్ 22, 2026

Tamil Nadu | తమిళనాడు సర్కార్ బంపర్ ఆఫర్.. ప్రతి ఇంటికీ రూ.22వేల వరకు సోలార్ పథకం సబ్సిడీ..
సెప్టెంబర్ 22, 2026

Prakash Raj | విజయ్ విషయంలో నాకు చాలా సందేహాలు ఉన్నాయి.. టీవీకే పాలనపై ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సెప్టెంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్
- ●Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం
- ●Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా
- ●Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
- ●Adilabad | రిమ్స్ అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
- ●The Paradise | ‘ది ప్యారడైజ్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్.. రిలీజ్‌కు ముందే రూ.50 కోట్ల దిశగా!

Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్

Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం

Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా

Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?



