Mancherial | పసికందుకు కాలం చెల్లిన ఇంజెక్షన్.. మంచిర్యాల దవాఖానలో దారుణం..
Mancherial | మంచిర్యాల (Mancherial) జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పసికందుకు కాలం చెల్లిన ఇంజెక్షన్ (Expired) ఇచ్చారు.
Mancherial | త్రినేత్ర.న్యూస్: మంచిర్యాల (Mancherial) జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పసికందుకు కాలం చెల్లిన ఇంజెక్షన్ (Expired) ఇచ్చారు. దవాఖాన సిబ్బంది తప్పును సరిదిద్దుకోకపోగా ప్రశ్నించిన తల్లిదండ్రులపై దురుసుగా ప్రవర్తించారు.
మార్చి 1న పూజిత, శ్రవణ్ కుమార్ దంపతులకు బాబు జన్మించారు. చిన్నారికి ఊపిరితిత్తుల సమస్య (Lungs Problems) తలెత్తడంతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలలోని పిల్లల దవాఖానలో చేర్పించారు. చికిత్స సందర్భంగా వైద్య సిబ్బంది చిన్నారికి ఓ ఇంజక్షన్ వేశారు. అయితే దానిని పరిశీలించిన కుటుంబ సభ్యులు.. అది కాలం చెల్లిపోయిందని, బాటిల్‌పై ఉన్న ఎక్స్‌పైరీ డేట్‌ను మార్చినట్లు గుర్తించారు. దీంతో బాబు తండ్రి, కుటుంబ సభ్యులు ఆగ్రహంతో వైద్యుడిని, సిబ్బందిని నిలదీశారు. అయితే వారు బాధితులతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, దుర్భాషలాడినట్లు తెలుస్తున్నది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాస్పిటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

MLA Prem Sagar Rao | నాకు మంత్రి పదవి రావొద్దనే నాపై తప్పుడు వార్తలు రాయిస్తున్నరు : ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
ఆగస్టు 5, 2026

Student Missing | చదువుపై అయిష్టంతో కాలేజీ నుంచి విద్యార్థిని అదృశ్యం.. మూడు రోజులపాటు ఉచిత బస్సులో చక్కర్లు..
జులై 9, 2026

Harish Rao on Singareni Scams | సింగరేణిలో కాంగ్రెస్ వేల కోట్ల దోపిడీ.. రేవంత్ బామ్మర్దికే ఓబీ టెండర్లు: పీపీటీతో హరీష్ రావు సంచలన ప్రజెంటేషన్
జులై 1, 2026
తాజావార్తలు
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు
- ●Horoscope | ఆగస్టు 20 రాశిఫలాలు.. గురుడి ప్రభావంతో వారికి శుభ ఖర్చులు ఉంటాయి!
- ●Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..

NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు



