త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ar Rahman | మ్యూజిక్ న‌చ్చ‌లేద‌ని నిర్మాత రెమ్యూన‌రేష‌న్ ఇవ్వ‌లేదు – ర‌ణ‌బీర్‌క‌పూర్ సినిమాపై ఏఆర్ రెహ‌మాన్ కామెంట్స్‌

ర‌ణ‌బీర్‌క‌పూర్ హీరోగా న‌టించిన రాక్‌స్టార్ సినిమాకు ఏఆర్ రెహ‌మాన్ అందించిన పాట‌లు మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను ఆక‌ట్టుకున్నాయి. రాక్‌స్టార్ ఆల్బ‌మ్‌కు అనేక అవార్డులు ద‌క్కాయి. ప్ర‌పంచం మొత్తం మెచ్చిన ఈ పాట‌లు సినిమా నిర్మాత‌కు మాత్రం న‌చ్చ‌లేద‌ట‌. ఈ విష‌యాన్ని రెహ‌మాన్ స్వ‌యంగా వెల్ల‌డించారు. పారితోషికం కూడా ఇవ్వ‌లేద‌ని అన్నారు.

N

Entertainment | Published On Nov 28, 2026, 7.44 pm IST

Ar Rahman | మ్యూజిక్ న‌చ్చ‌లేద‌ని నిర్మాత రెమ్యూన‌రేష‌న్ ఇవ్వ‌లేదు – ర‌ణ‌బీర్‌క‌పూర్ సినిమాపై ఏఆర్ రెహ‌మాన్ కామెంట్స్‌
Advertisement

Ar Rahman |ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ కెరీర్‌లో బాలీవుడ్ మూవీ రాక్‌స్టార్ బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ హిట్‌గా నిలిచింది. ర‌ణ‌బీర్‌క‌పూర్ హీరోగా న‌టించిన ఈ సినిమాలోని పాట‌లు సంగీత ప్రియుల‌ను మెప్పించాయి. హిందీ సినిమా హిస్ట‌రీలోనే బెస్ట్ మ్యూజిక‌ల్ ఆల్బ‌మ్స్‌లో ఒక‌టి అంటూ రాక్‌స్టార్ పాట‌ల‌పై విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌ల‌ను కురిపించారు. ఏఆర్ రెహ‌మాన్ సంగీతానికి అనేక అవార్డులు వ‌చ్చాయి. మొత్తం ప‌ధ్నాలుగు పాట‌ల‌తో ప్ర‌యోగాత్మ‌కంగా రూపొందిన ఈ సినిమాకు ఇంతియాజ్ అలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 2011లో రిలీజైన ఈ సినిమా ఆ ఏడాది హిందీలో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ర‌ణ‌బీర్‌క‌పూర్‌కు స్టార్ ఇమేజ్‌ను తీసుకొచ్చింది.

నిర్మాత కామెంట్లు...

వ‌ర‌ల్డ్ వైడ్‌గా మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను ఆల‌రించిన ఈ పాట‌లు సినిమా ప్రొడ్యూస‌ర్‌కు మాత్రం న‌చ్చ‌లేద‌ని ఏఆర్ రెహ‌మాన్ అన్నాడు. త‌న‌కు రెమ్యూన‌రేష‌న్ కూడా ఇవ్వ‌లేద‌ని చెప్పారు. డెహ్రాడూన్‌లో జ‌రిగిన లిట‌రేచ‌ర్ ఫెస్టివ‌ల్‌కు ఇంతియాజ్ అలీతో క‌లిసి రెహ‌మాన్ చీఫ్ గెస్ట్‌లుగా హాజ‌ర‌య్యారు.

రెమ్యూన‌రేష‌న్ ఇవ్వ‌లేదు...

ఈవేడుక‌లో రాక్‌స్టార్‌పై రెహ‌మాన్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతోన్నాయి. "రాక్‌స్టార్ సినిమా కోసం నేను కంపోజ్ చేసిన పాట‌లు నిర్మాత‌కు న‌చ్చ‌లేదు. రెమ్యూన‌రేష‌న్ ఇవ్వ‌న‌ని అన్నారు. ఆ సినిమా కోసం నా వ‌ద్ద ప‌నిచేసిన ఇత‌ర మ్యూజిషియ‌న్లతో పాటు కంపోజింగ్‌కు అయిన ఖ‌ర్చుల‌న్నీ నేను సొంతంగా భ‌రించాను. ఒక్క పైసా కూడా రాద‌ని అనుకున్నా. ఆశ‌లు వ‌దులుకున్నా. చివ‌ర‌కు సినిమా రిలీజైన ఎనిమిది నెల‌ల త‌ర్వాత నిర్మాత ద‌గ్గ‌ర నుంచి చెక్ వ‌చ్చింది" అని రెహ‌మాన్ అన్నారు.

మ‌ణిర‌త్నం బొంబాయి

ఈ వేడుక‌లో మ‌ణిర‌త్నం బొంబాయి సినిమాకు సంబంధించి ఏఆర్ రెహ‌మాన్ ఆస‌క్తిక‌ర జ్ఞాప‌కాల‌ను అభిమానుల‌తో పంచుకున్నారు. బొంబాయి సినిమాను పాట‌లు లేకుండా డాక్యుమెంట‌రీ త‌ర‌హాలో మ‌ణిర‌త్నం చిత్రీక‌రించాల‌ని అనుకున్నారు. ఇర‌వై రోజుల్లోనే షూటింగ్ పూర్తిచేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ ఆ త‌ర్వాత క‌థ‌లో చాలా మార్పులు జ‌రిగాయి. ఐదు పాట‌ల‌ను కంపోజ్ చేయాల్సివ‌చ్చింది అని రెహ‌మాన్ తెలిపారు.

 

Advertisement
Advertisement