High Court | కాళేశ్వరం కమిషన్‌పై హైకోర్టు తీర్పు వాయిదా
High Court | కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) అక్రమాలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చెల్లుబాటుపై తుది తీర్పును హైకోర్టు (High Court) వాయిదావేసింది.
High Court | త్రినేత్ర.న్యూస్: కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) అక్రమాలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చెల్లుబాటుపై తుది తీర్పును హైకోర్టు (High Court) వాయిదావేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణల్లో అవకతవకలపై విచారణ నిమిత్తం ప్రభుత్వం జస్టిస్ ఘోష్ కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. అయితే కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ సీఎస్ ఎస్‌కే జోషి, ఐఏఎస్ స్వితా సభర్వాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై వాదనలు విన్న జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మసానం మార్చి 12న తీర్పు వాయిదా వేసింది. బుధవారం తుది తీర్పు వెళ్లడించాల్సి ఉండగా.. విచారణ సందర్భంగా తీర్పును ఏప్రిల్ 22కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నది.
కాళేశ్వరం అవకతవకలపై విచారణ కోసం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమిస్తూ 2024 మార్చి 14న ప్రభుత్వం జీవో 6ను విడుదల చేసింది. అయితే కమిషన్ చేపట్టిన విచారణ ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని, తమపై అభియోగాలు మోపే ముందు, తమ వాదనలను కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్లు ఆరోపించారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా విచారణ సాగుతున్నదని కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం నేడు వెలువరించాల్సిన తీర్పును ఈ నెల 22కు వాయిదా వేసింది.
సంబంధిత వార్తలు

జన్వాడలో లీజు.. ఎర్రవెల్లిలో భూములు.. కేసీఆర్–కేటీఆర్ నుంచి ప్రజలకు కావాల్సిన 10 జవాబులు!
సెప్టెంబర్ 23, 2026

Harish Rao | 4 వేలకు అవకాశం ఉంటే 800 క్యూసెక్కులే ఎందుకు ఎత్తిపోస్తున్నవ్..?
సెప్టెంబర్ 23, 2026

Harish Rao | యాదాద్రికి జీ10, జీ11 క్వాలిటీ కోల్ కావాలి.. కానీ జీ13, జీ14 క్వాలిటీదే వాడుతున్నారు
సెప్టెంబర్ 22, 2026
తాజావార్తలు
- ●Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్
- ●Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం
- ●Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా
- ●Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
- ●Adilabad | రిమ్స్ అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
- ●The Paradise | ‘ది ప్యారడైజ్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్.. రిలీజ్‌కు ముందే రూ.50 కోట్ల దిశగా!

Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్

Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం

Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా

Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?



