Donald Trump | ప్రపంచ శాంతికి ఇది గొప్ప రోజు.. సీజ్‌ఫైర్‌పై ట్రంప్
Donald Trump | ఇరాన్‌తో కుదిరిన కాల్పుల విరమణపై (ceasefire) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా స్పందించారు. ప్రపంచ శాంతికి ఇదో గొప్ప రోజుగా అభివర్ణించారు.
International | Published On Apr 8, 2026, 11.47 am IST
Donald Trump | ఇరాన్‌తో కుదిరిన కాల్పుల విరమణపై (ceasefire) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా స్పందించారు. ప్రపంచ శాంతికి ఇదో గొప్ప రోజుగా అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్ చేశారు. హర్మూజ్ జలసంధిలో (Strait of Hormuz) పేరుకుపోయిన ట్రాఫిక్ పునరుద్ధరణకు సాయం చేస్తామని ఈ సందర్భంగా ట్రంప్ హామీ ఇచ్చారు.
"ప్రపంచ శాంతికి ఇది ఒక గొప్ప రోజు. ఇరాన్ ఇదే కోరుకుంటోంది. వారు ఇక చాలని భావిస్తున్నారు. అదేవిధంగా యుద్ధం ఆగాలని ప్రపంచం మొత్తం కోరుకుంటోంది. హర్మూజ్ జలసంధిలో ట్రాఫిక్ పునరుద్ధరణకు అమెరికా సాయం చేస్తుంది. అంతేకాదు, అక్కడ చాలా సానుకూల చర్యలు ఉండబోతున్నాయి. పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది. ఇరాన్ తన దేశాన్ని పునర్నిర్మించుకునే పనులు మొదలు పెట్టొచ్చు. అన్ని విధాలుగా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇవన్నీ సజావుగా సాగుతాయని నాకు నమ్మకం ఉంది. అమెరికాలాగే ఇరాన్‌కు కూడా మంచి రోజులు రానున్నాయి. రాబోయే రోజుల్లో పశ్చిమాసియాలో (Middle East) స్వర్ణ యుగం ఉండబోతుంది" అని ట్రంప్ తన పోస్టులో రాసుకొచ్చారు.
Also Read..
ట్రంప్ నిర్ణయానికి ఇజ్రాయెల్ మద్దతు.. కానీ
సంబంధిత వార్తలు

Hardeep Singh Puri | దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు : కేంద్రం
సెప్టెంబర్ 22, 2026

Crude Oil | రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు కోత..? అమెరికా ఆంక్షలతో భారత్‌పై ఒత్తిడి..
సెప్టెంబర్ 22, 2026

Russia Sanctions Bill | రష్యా ఆంక్షల బిల్లుపై ట్రంప్ సంతకం.. ఇక భారత్‌పై 100% టారిఫ్స్..!
సెప్టెంబర్ 19, 2026
తాజావార్తలు
- ●Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్
- ●Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం
- ●Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా
- ●Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
- ●Adilabad | రిమ్స్ అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
- ●The Paradise | ‘ది ప్యారడైజ్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్.. రిలీజ్‌కు ముందే రూ.50 కోట్ల దిశగా!

Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్

Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం

Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా

Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?



