Uddhav Thackeray | విరాళాల చోరీపై “రామ రక్ష” నిరసనలకు పిలుపునిచ్చిన శివసేన
Uddhav Thackeray | అయోధ్య (Ayodhya) రామాలయ విరాళాల దుర్వినియోగంపై శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను హిందువులు ఎప్పటికీ క్షమించరన్నారు. దోపిడీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Uddhav Thackeray | అయోధ్య (Ayodhya) రామ మందిరంలో భక్తులు సమర్పించుకున్న విరాళాల (Donations) చోరీ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. రాముడి పేరుతో బీజేపీ భారీ దోపిడీకి పాల్పడుతోందంటూ ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో రామాలయ విరాళాల దుర్వినియోగంపై శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను హిందువులు ఎప్పటికీ క్షమించరన్నారు. దోపిడీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే కీలక ప్రకటన చేశారు. నిధుల దుర్వినియోగంపై బీజేపీని నిలదీసేందుకు జులై 5 నుంచి రాష్ట్రం (Maharashtra)లో "రామ రక్ష" (Ram Raksha) పేరుతో ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. జులై 5 ఆదివారం సెంట్రల్ ముంబైలోని దాదార్ వద్ద ఉన్న హనుమాన్ ఆలయం వద్ద నిర్వహించే నిరసనల్లో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రామ్ రక్షా స్తోత్రం, హనుమాన్ స్తోత్రం, హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తామని చెప్పారు. తాను స్వయంగా పార్టీ నేతలు, శివసైనికులతో కలిసి నిరసనకు నాయకత్వం వహిస్తానని వెల్లడించారు.
Also Read..
రిజెక్ట్ చేసిన సినిమాలోనే హీరోయిన్‌గా నటించా - భాగ్యశ్రీ బోర్సే కామెంట్స్
లోయలో పడిన బస్సు.. 40 మంది మృతి
లిథియమ్-అయాన్ బ్యాటరీ యాప్‌ల దుర్వినియోగం.. చైనా యాప్‌లను నిషేధించిన కేంద్రం..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Police Constables Wedding | ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు..! చర్చనీయాంశమైన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల పెళ్లి..!
ఆగస్టు 24, 2026

Newborns Died | అమరావతి హాస్పిటల్లో పేలిన వెంటిలేటర్.. ముగ్గురు నవజాత శిశువులు సజీవదహనం
ఆగస్టు 24, 2026

Crow | వీడేం మనిషిరా బాబూ.. మద్యం మత్తులో కాకిని తినేందుకు యత్నం..
ఆగస్టు 14, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | ఆ రాజకీయ కారణం ఏంటో మోదీయే చెప్పాలి : రేవంత్‌రెడ్డి
- ●Aditi Rao Hydari | ఓటీటీలోకి అదితిరావ్ హైదరీ బోల్డ్ మూవీ - నలుగురు హీరోయిన్లు - నాలుగు కథలు
- ●Ethanol | చక్కెర ధర పెరుగుదలను ఇథనాల్‌తో ముడిపెట్టొద్దు: నిపుణులు
- ●Gyanesh Kumar | భారత EVMలకు ఇంటర్నెట్, బ్లూటూత్ కనెక్టివిటీ ఉండదు : సీఈసీ జ్ఞానేశ్ కుమార్
- ●Bhu Bharati Portal | భూభారతిలో రిజిస్ట్రేషన్ కాని భూములివే.. 22A జాబితా నుంచి మీ ల్యాండ్ తొలగించుకోండిలా!
- ●స్కిల్స్ వర్సిటీ వర్సెస్ పాలిటెక్నిక్: 'జీవో 97'తో విద్యార్థులకు లాభమా? నష్టమా?

CM Revanth Reddy | ఆ రాజకీయ కారణం ఏంటో మోదీయే చెప్పాలి : రేవంత్‌రెడ్డి

Aditi Rao Hydari | ఓటీటీలోకి అదితిరావ్ హైదరీ బోల్డ్ మూవీ - నలుగురు హీరోయిన్లు - నాలుగు కథలు

Ethanol | చక్కెర ధర పెరుగుదలను ఇథనాల్‌తో ముడిపెట్టొద్దు: నిపుణులు

Gyanesh Kumar | భారత EVMలకు ఇంటర్నెట్, బ్లూటూత్ కనెక్టివిటీ ఉండదు : సీఈసీ జ్ఞానేశ్ కుమార్



