త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sting energy drink | పాఠశాలల సమీపంలో ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్స్‌పై నిషేధం.. మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు

Sting energy drink | మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం (Maharashtra government) తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పాఠ‌శాల‌ల‌కు (schools) 500 మీట‌ర్ల ప‌రిధిలో 'స్టింగ్' ఎనర్జీ డ్రింక్స్ (Sting energy drink) విక్ర‌యాల‌పై నిషేధం విధించింది.

D

National | Published On Jul 3, 2026, 3.55 pm IST

Sting energy drink | పాఠశాలల సమీపంలో ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్స్‌పై నిషేధం.. మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు
Advertisement

Sting energy drink | 'స్టింగ్' ఎనర్జీ డ్రింక్స్ (Sting energy drink)లో పిల్ల‌ల‌కు (children) హానిక‌లిగించే ప‌దార్థాలు ఉన్నాయ‌న్న ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్న వేళ మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం (Maharashtra government) తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పాఠ‌శాల‌ల‌కు (schools) 500 మీట‌ర్ల ప‌రిధిలో ఈ డ్రింక్స్ విక్ర‌యాల‌పై నిషేధం విధించింది. ఈ విష‌యాన్ని ఫ‌డ్న‌వీస్ ప్ర‌భుత్వం అసెంబ్లీ వేదిక‌గా శుక్ర‌వారం ప్ర‌క‌టించింది.

పాఠ‌శాల విద్యార్థుల‌పై ఎన‌ర్జీ డ్రింక్స్ చూపిస్తున్న ప్ర‌భావంపై వ‌స్తున్న ఆందోళ‌న‌ల దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఫుడ్ అండ్ డ్ర‌గ్స్ అడ్మినిస్ట్రేష‌న్ మంత్రి న‌ర‌హ‌రి జిర్వాల్ (Minister Narhari Zirwal) తెలిపారు. ఈ నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించిన‌ట్లు చెప్పారు. నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని మంత్రి హెచ్చ‌రించారు. అదేవిధంగా ఎన‌ర్జీ డ్రింక్స్ తాగ‌డం వ‌ల్ల ఆరోగ్యంపై ప‌డే ప్ర‌తికూల ప్ర‌భావాల గురించి విద్యార్థుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌ని పాఠ‌శాల‌ల‌ను కోరిన‌ట్లు చెప్పారు. ఎనర్జీ డ్రింక్స్‌లో కఫిన్, చక్కెర శాతాలు అధికంగా ఉంటాయ‌ని మంత్రి వివ‌రించారు.

Also Read..

విరాళాల చోరీపై "రామ రక్ష" నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చిన శివ‌సేన‌

రెండు కొత్త ఏఐ ల్యాప్‌టాప్‌ల‌ను లాంచ్ చేసిన ఆసుస్‌.. ఫీచ‌ర్లు అదిరిపోయాయి.. ధ‌ర త‌క్కువే..

శ్రీలీల‌కు అచ్చిరాని బాలీవుడ్ - డెబ్యూ మూవీ ఆగిపోయిన‌ట్లేనా

Advertisement
Advertisement